అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం
Theme for 2017: "Biodiversity and sustainable tourism
*■ జీవవైవిధ్యం సమస్యల అవగాహన మరియు అవగాహన పెంచడానికి మరియు నైరోబి తుది చట్టం ద్వారా 22 మే 1992 న జీవవైవిధ్య సదస్సు (CBD) స్వీకరణ జ్ఞాప కార్ధంగా డిసెంబర్ 2000 లో మే 22ను జీవవైవిధ్య అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారు.*
◆ గతంలో, 29 డిసెంబర్ జీవవైవిధ్య సదస్సు అమలులోకి వచ్చిన తేదీ జ్ఞాపకార్ధం జీవవైవిధ్య అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహించేవారు.
*🍄జీవ వైవిధ్యం అంటే...*
*★భూమిపై జీవాల మధ్య వుండే భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం.*
■ మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కి పోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి.
*■ ఈ భూమి ఏర్పడి 350 కోట్ల సం"రాలు అవుతుండగా, ప్రపంచ వ్యాప్తంగా 1కోటి 40 లక్షల జీవ రాశులు ఉండగా 80 లక్షలు మాత్రమే గుర్తించినట్లుచెప్పారు.ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి.అలాంటి మన దేశంలో కేవలం 17 లక్షల జీవ రాశుల సమాచారం మాత్రమే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వన జల జీవ రాశులున్న దేశాల్లో మన దేశం 17 స్థానంలో ఉండగా, మొత్తం12శాతం అడవులు ఇక్కడే ఉన్నాయి. ఇప్పటికి మన దేశంలో జీవ వైవిధ్యంపై 60 శాతం మంది ఆధారపడి బతుకుతున్నట్లు ఒక అంచనా. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది.అలాంటి ఈ జీవవైవిధ్యా న్ని మనం కాపాడుకోలేక పోతే చివరకు మనిషి మనుగడే లేకుండా పోతుందని వారు హెచ్చరించారు.*
■ గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపే శాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాల లోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు...
*■ వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.*
*★ విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువ గాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతాని కంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది.ఎన్నో పంటలలో వైవిధ్యా లు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం.ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతు ల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.*
*🍄సృష్టిలో జీవరాశుల ఏకత్వం..*
*◆ ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద.*
◆ సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధార పడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్దతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.
*◆ చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగితా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవమనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాసులు అంతరించిపోతున్నాయి.*
*🍄ప్రకృతి హితంగా భారతీయ ఆచారాలు..*
★భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిది అని భావించి విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు.
■ వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్చమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది.
*🍄భూ కాలుష్యం..🌗*
*■ రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్త నాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది.*
◆ ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.
*🍄కాపాడుకొనే విధానం..*
*★ మానవాళికి ప్రకృతి, జీవ వైవిధ్యం రెండు కళ్ళ లాంటివి .కనుక మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి.*
*★జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి.*
*★చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి.*
*★ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, జనపనార లేదా కాటన్ సంచులనే వాడాలి.*
*★ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిం చు కుందాం.*
*★ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానాంలో పది చెట్లు నాటే విధంగా చర్యలు చేపట్టాలి.*
◆ అడవులు, జీవ, జలరాశులను ఇప్పటికైనా పరిరక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవ జాతి మనగడకే ముప్పు తప్పదని గ్రహించాల్సిన సమయం ఇదే..
◆ మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అంతరిస్తున్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం మన సమష్టి బాధ్యత.
సమయం లేదు మిత్రమా..
సమాజ శ్రేయస్సా..!లేదా నాశనమా..!