సుప్రీంకోర్టు ముఖ్యమైన కేసులు - తీర్పులు
ఏకే గోపాలన్ కేసు (1950)
-మద్రాస్‌కు చెందిన ఏకే గోపాలన్ అనే వ్యక్తిని మద్రాస్ ప్రభుత్వం నిరోధక నిర్బంధ చట్టం-1950 కింద అదుపులోకి తీసుకుంది. అయితే ఏకే గోపాలన్ రెండు అంశాలపై తన నిర్బంధాన్ని ప్రశ్నించాడు. తనను నిర్బంధంలోకి తీసుకోవడం రాజ్యాంగంలోని 19వ నిబంధన ప్రకారం స్వేచ్ఛా హక్కుకు విరుద్ధమని, 21వ నిబంధన కింద వ్యక్తిగత స్వేచ్ఛకు నిర్బంధం వ్యతిరేకమని వాదించాడు.
చంపకం దొరైరాజన్ కేసు (1951)
-తమిళనాడులోని విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులవారికి కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన కేసు. మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. దీని ద్వారా 15(4) సెక్షన్‌ను నూతనంగా చేర్చారు.
శంకరీప్రసాద్ కేసు (1952)
-మొదటి రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలను ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కేసు వేశారు. పార్లమెంటుకు ఏ అంశాన్నయినా సవరించే అధికారం ఉన్నదని ఈ కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారి న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించింది.
బేరుబారి కేసు (1960)
-దేశంలో ఏదైనా ప్రాంతాన్ని వేరే దేశ భూభాగంలో కలుపడానికి ముందుగా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
కేశవ్‌సింగ్ కేసు (1964)
-కేశవ్‌సింగ్ అనే జర్నలిస్టు శాసనవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అతనికి జైలుశిక్ష విధించారు. ఈ కేసులో కోర్టు తీర్పునిస్తూ నిబంధన 21కి విరుద్ధంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది.
సజ్జన్‌సింగ్ కేసు (1965)
-ఆస్తి హక్కుకు సంబంధించి చేసిన 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్దమేనని ప్రకటించింది.
గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం (1967)
-ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
కేశవానంద భారతి వర్సెస్ కేరళ (1973)
-ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన 24వ, 25వ రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ఈ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మౌలిక స్వరూపం అనే పదాన్ని మొదటిసారి ప్రయోగించింది.
మేనకాగాంధీ కేసు (1978)
-ప్రజాప్రయోజన వ్యాజ్యంపై పాస్‌పోర్టు అధికారి పాస్‌పోర్టు చట్టం-1967 కింద మేనకాగాంధీ పాస్‌పోర్టును రద్దుచేశారు. ప్రజా ప్రయోజనం అన్నది బహుళ విస్తృతమైనదని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. 19, 14, 21వ నిబంధనలు సెక్షన్ 10(3) పాస్‌పోర్టు చట్టం-1967 ప్రకారం ఉల్లంఘనకు గురయ్యాయని కోర్టు గమనించింది. 21వ నిబంధన కింద వ్యక్తి స్వేచ్ఛ అనే దానికి సాధారణ అర్థం ఇచ్చింది. అయితే చట్టం సహజ న్యాయానికి అనుగుణంగా ఉండాలని పేర్కొన్నది.
వామన్‌రావు కేసు (1981)
నీరజాచౌదరి కేసు (1984)
-బాల కార్మికులకు సంబంధించి సమర్థవంతమైన చట్టాలు రూపొందించాలని ఈ కేసులలో సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
షాబానో కేసు (1985)
-ముస్లిం మహిళకు కూడా భరణం ఇవ్వాలని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ కేసు (1992)
-మైనారిటీ విద్యాసంస్థల్లో మైనారిటీయేతర విద్యార్థులకు 50 శాతం సీట్లు కల్పించాలని ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఇందిరాసహాని వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా (1992)
-వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు.
ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ (1993)
-ప్రాథమిక హక్కులలో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని.. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
సరళా ముద్గల్ (1995)
-ఒక వ్యక్తి హిందూ వివాహ చట్టం ప్రకారం పెండ్లి చేసుకున్న తర్వాత, మరో వివాహం కోసం మత మార్పిడి చేసుకోవడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
ఎస్‌ఆర్ బొమ్మై కేసు (1995)
-సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేముందు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రకటించింది.
చంద్రకుమార్ కేసు (1997)
-న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ప్రకటించింది.
టీఎంఏ పాయ్ కేసు (2002)
-మైనారిటీ విద్యాసంస్థల్లో ఆయా సంస్థల ప్రమాణాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇనామ్‌దార్ కేసు (2005)
-ప్రైవేటురంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీని కోసం 93వ రాజ్యాంగ సవరణ చేశారు.
ఐఆర్ కొయలో కేసు (2006)
-9వ షెడ్యూల్‌కు న్యాయసమీక్ష వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.
అశోక్ కుమార్ ఠాకూర్ కేసు (2007)