Type Here to Get Search Results !

Vinays Info

👉 కూటములు-సమావేశాలు

కూటములు-సమావేశాలు

సార్క్

-దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతికి దోహద పడడానికి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి దక్షిణాసియా ప్రాంతీయ కూటమి (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్) 1985, డిసెంబర్ 8న ఏర్పాటైంది.
-ఇందులో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్ (2007లో సభ్యత్వం తీసుకుంది). మొత్తం 8 దేశాలు.
-దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఉంది.
-సార్క్ జనరల్ సెక్రెటరీగా పాకిస్థాన్‌కు చెందిన అమ్జద్ హుస్సేన్ బి సియాల్ 2017, మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ పదవిలో అర్జున్ బహదూర్ థాపా (నేపాల్) 2014-17 వరకు కొనసాగారు.

సమావేశాలు

-మొదటి సమావేశానికి బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. 1985, డిసెంబర్ 7, 8 తేదీల్లో ఢాకాలో జరిగిన ఈ సదస్సులో ఉగ్రవాదం, మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రధానంగా చర్చించాయి.
-1986, నవంబర్ 16, 17 తేదీల్లో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది.
-18వ సమావేశం 2014లో నేపాల్‌లోని కఠ్మాండులో నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది.
-19వ సమావేశం 2016, నవంబర్ 15, 16 తేదీల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉండగా రద్దయ్యింది.
-2016లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరగడంతో ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీంతో మిగిలిన సభ్యదేశాలు కూడా హాజరుకాబోమని ప్రకటించడంతో 19వ సదస్సు రద్దయ్యింది. దీంతో 2018లో జరగాల్సిన 20వ సదస్సుకు ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఎంపిక చేయలేదు.
-సార్క్ ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అంశాన్ని నిర్ణయిస్తుంది... 1989ని మాదక ద్రవ్యాల నిరోధక ఏడాదిగా, 1990ని బాలికా సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది.
-2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా ప్రకటిచింది.
-2010-20 దశాబ్దాన్ని ప్రాంతీయ అంతర్గత అనుసంధాన దశాబ్దంగా ప్రకటించింది.

భారత్‌లో సార్క్ సమావేశాలు..

-సార్క్ సమావేశాలు భారత్‌లో ఇప్పటిరకు మూడుసార్లు జరిగాయి.
-మొదటి సారి 1986, నవంబర్ 16, 17 తేదీల్లో బెంగళూరులో (రెండో సమావేశం), రెండోసారి న్యూఢిల్లీలో 1995, మే 2-4 వరకు (8వ సమావేశం), మూడోసారి 2007, ఏప్రిల్ 3, 4 తేదీల్లో న్యూఢిల్లీలో (14వ సమావేశం) జరిగాయి.
ఆసియాన్ కూటమి

-వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section