భూ ఆవరణాలు – వాతావరణం
భూ ఉపరితలంపై నాలుగు ఆవరణాలున్నాయి. అవి..
1. శిలావరణం 2. జలావరణం
3. వాతావరణం 4.జీవావరణం
వీటిని భూ భౌతికాంశాలు అంటారు.
1 . శిలావరణం:
గ్రీకు భాషలో ‘లిథోస్’ అంటే శిల అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో లిథో స్పియర్ అంటారు. దీన్ని ‘ఆశ్మావరణం’ అని కూడా పిలుస్తారు.
2. జలావరణం:
గ్రీకు భాషలో ‘హదర్’ అంటే జలం అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో ‘హైడ్రోస్పియర్’ అంటారు. భూ ఉపరితలంపై ఉన్న జలభాగం మొత్తం దీని కిందకు వస్తుంది.
3. వాతావరణం:
గ్రీకు భాషలో ‘అట్మోస్’ అంటే గాలి/ఆవిరి అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో ‘అట్మాస్పియర్’ అంటారు. దీనిలో వివిధ రకాల వాయువులు ఉంటాయి.
4. జీవావరణం
గ్రీకు భాషలో ‘బయో’ అంటే జీవం అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. అనేక జీవరాశులు దీని కిందకు వస్తాయి.
వాతావరణం
భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను వాతావరణం అంటారు. *వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘మెటియొరాలజి’ అంటారు.
భూమిని ఆవరించి ఉన్న వాతావరణం బరువు సుమారు 56 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా.
కార్బన్ డై ఆక్సైడ్ (ఛిౌ2), నీటి ఆవిరి 90 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే ఉంటాయి.
ఆక్సిజన్ 120 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది.
22 కి.మీ. ఎత్తులో 96% వాతావరణం విస్తరించి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా.
వాతావరణంలోని వాయువుల శాతం
నత్రజని – 78.08%
ఆక్సిజన్ – 20.94%
ఆర్గాన్ – 0.93%
కార్బన్ డై ఆక్సైడ్ – 0.03%
హీలియం, క్రిప్టాన్, గ్జినాన్ ఇతర జడ వాయువులు – 0.02%
నత్రజని (నైట్రోజన్):
దీన్ని మొక్కలు పరోక్షంగా నైట్రేట్స్ రూపంలో గ్రహిస్తాయి. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి భూసారాన్ని పెంచుతాయి.
ఆక్సిజన్:
ఇది జీవరాశులన్నింటికీ ప్రాణ వాయువు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకునే ఓజోన్ (ౌ3) పొరను ఏర్పరచడంలో ఆక్సిజన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కార్బన్ డై ఆక్సైడ్
దీన్నే బొగ్గుపులుసు వాయువు అంటారు. మొక్కలు ఛిౌ2ను గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. గ్రీన్హúస్ ఎఫెక్ట్కు ఛిౌ2 కారణమవుతుంది.
ఆర్గాన్
భూ ఉపరితలంపై ఎక్కువగా ఉన్న జడవాయువు. దీన్ని ఎలక్ట్రిక్ బల్బుల్లో వినియోగిస్తారు.
వాతావరణం – పొరలు
భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు, ఇతర మార్పుల ఆధారంగా వాతావరణాన్ని ఐదు ఆవరణాలుగా విభజించారు. అవి..
ట్రోపో ఆవరణం
ఇది భూ ఉపరితలం నుంచి సగటున 13 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. భూమధ్య రేఖా ప్రాంతాల వద్ద 18 కి.మీ, ధృవాల వద్ద 8 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది.
ట్రోపో అంటే మార్పు అని అర్థం. వాతావరణంలో మార్పులన్నీ ఈ ఆవరణంలోనే జరుగుతాయి. జీవరాశులన్నీ ఇందులోనే ఉంటాయి. సంవహన వాయు ప్రవాహాల వల్ల ఈ ఆవరణం ఎత్తు భూ మధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవరణంలో ఒక కి.మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత 6.4నిఇ తగ్గుతుంది. 75% వాతావరణం ఈ ఆవరణంలోనే ఉంటుంది. కాబట్టి ఇది జీవక్రియలకు అనుకూలం.
మేఘాలు, తుపాన్లు, అవపాతం ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఇందులో జెట్ ప్రవాహాల వల్ల వాతావరణంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల దీన్ని ‘గందరగోళ ఆవరణం’ అని కూడా అంటారు. ట్రోపో ఆవరణం పైభాగపు సరిహద్దును ‘ట్రోపో పాస్’ అంటారు.
స్ట్రాటో ఆవరణం
ఇది 50 కి.మీ ఎత్తు వరకు ఉంటుంది. స్ట్రాటో అంటే శ్రీకారం చుట్టడం అని అర్థం.
ఈ ఆవరణంలో పైకి వెళుతున్నకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇందులో సిర్రస్ మేఘాలు కనిపిస్తాయి. ఇక్కడ దుమ్ము, ధూళి కణాలు; నీటి ఆవిరి పరిమాణం తక్కువ.
స్ట్రాటో ఆవరణాన్ని ప్రశాంత మండలం అంటారు. ఇందులో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి.
ఓజోన్ పొర ఈ ఆవరణంలో ఉంటుంది. ఇది 35 నుంచి 60 కి.మీ. ఎత్తు ప్రాంతంలో విస్తరించి ఉంది. ఓజోన్ పొర ఉండే ప్రాంతం ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుంది. *స్ట్రాటో ఆవరణాన్ని ఓజోన్ ఆవరణం అని కూడా అంటారు.*
ఈ ఆవరణాన్ని చేరిన తొలి భారతీయుడు టీఎన్ సురేశ్ కుమార్. 2014 ఆగస్టు 15న మిగ్–29 నౌకలో ప్రయాణించి ఈ ఆవరణాన్ని చేరుకున్నారు.
స్ట్రాటో ఆవరణం పై భాగపు సరిహద్దును ‘స్ట్రాటో పాస్’ అంటారు.
మీసో ఆవరణం
ఇది స్ట్రాటో పాస్ను ఆనుకొని 80 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ఇందులో సంవహన క్రియ యథావిధిగా జరుగుతుంది. లక్షణాలు ట్రోపో ఆవరణం మాదిరిగా ఉండటం వల్ల దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అంటారు.
కొద్ది పరిమాణంలో ఓజోన్ పొర ఈ ఆవరణంలో కనిపిస్తుంది.
ఇందులో కాంతి ప్రేరేపిత రసాయన చర్యలు జరుగుతాయి. అందువల్ల దీన్ని రసాయనిక ఆవరణం అంటారు.
ఈ ఆవరణంలో ఉల్కలు నాశనమవుతాయి. మీసో ఆవరణం సరిహద్దును ‘మీసో పాస్’ అంటారు.
థర్మో ఆవరణం
మీసోపాస్ నుంచి 400 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరగడం వల్ల దీన్ని థర్మో ఆవరణం అంటారు. ఇందులో వాయువులు అయాన్ల రూపంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఐనో ఆవరణం అని కూడా అంటారు.
ఈ ఆవరణంలో అయోనైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. అణుసంబంధ ఆక్సిజన్, నైట్రోజన్ల నిరంతర రసాయన చర్యల వల్ల ఉష్ణం, కాంతి జనిస్తుంది. కాంతి పుంజాలు ఏర్పడతాయి. వీటినే ‘అరోరా’లు అంటారు.
ఈ ఆవరణంలో రేడియో, సమాచార తరంగాలు పరావర్తనం చెందుతాయి. అందువల్ల దీన్ని సమాచార పొర అంటారు. స్పేస్ షటిల్స్ ఈ ఆవరణంలో ఉంటాయి.
ఎక్సో ఆవరణం
ఇది ఐనో ఆవరణంపై ఉంటుంది. అతి తేలిక హైడ్రోజన్, హీలియం వాయువులు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి.
ఈ ఆవరణంలో భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉన్నందువల్ల వాతావరణ సంఘటనంలో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల దీన్ని విరుద్ధ ఆవరణం అంటారు.
కృత్రిమ ఉపగ్రహాలను ఈ ఆవరణంలో (36,000 కి.మీ. ఎత్తులో) ప్రవేశపెడతారు.