విటమిన్-D
-దీని రసాయన నామం- కాల్సిపెరాల్
- దీని సాధారణ నామం- సూర్యకాంతి (SUNSHINE) విటమిన్ అని, యాంటీరికెటిక్ విటమిన్ అని, ఫ్రీ/ఉచిత విటమిన్ అని, హార్మోన్‌లాంటి విటమిన్ అని అంటారు.
విటమిన్-D లభించే పదార్థాలు
-సూర్యకాంతి, కాడ్‌చేపల కాలేయ నూనె, పాలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన. ఇది మొక్కలలో లభించదు. కానీ కొన్ని లైకేన్స్‌లో లభిస్తుంది.
-సూర్యకాంతి (అతినీలలోహిత కిరణాలు) చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టిరాల్ అనే కొవ్వు D విటమిన్‌గా మారుతుంది.
విటమిన్-D వల్ల ఉపయోగాలు
-ఇది ఆహారం ద్వారా లభించిన కాల్షియం, ఫాస్ఫరస్‌లను ఎముకలు, దంతాలలోకి పంపించి గట్టిగా ఉంచడంలో (పారాథార్మోన్ వలె) తోడ్పడుతుంది.
విటమిన్-D లోపం వలన కలిగే వ్యాధులు
-చిన్నపిల్లల్లో రికెట్స్
-పెద్దవారిలో ఆస్టియోమలేషియా
-PIGEON CHEST (కపోత వక్షం)
విటమిన్-E
-దీనిని టోకోఫెరాల్ అని, బ్యూటీ విటమిన్ అని, యాంటీస్టెరిలిటీ విటమిన్ (వంధ్యత్వ నిరోధక విటమిన్) అని అంటారు.
విటమిన్-E లభించే పదార్థాలు
-తాజాఫలాలు, మొలకెత్తిన పప్పులు, సన్‌ఫ్లవర్, పత్తిగింజల నూనె.
-కుసుమ పువ్వు (SAFFOLA) పిక్కలు/ NUTS (జీడిమామిడి, బాదం లాంటి DRY FRUITS)
-గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఇవ్వాలి.
విటమిన్-E వల్ల ఉపయోగాలు
-ప్రత్యుత్పత్తి సక్రమంగా పనిచేయడానికి అవసరం
-కండరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరం
విటమిన్-E వలన కలిగే వ్యాధులు
-వంధ్యత్వం-ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడం (ఎలుకల్లో)
-ఆర్‌బీసీల జీవిత కాలం తగ్గడం. వీటి జీవిత కాలం-120 రోజులు
విటమిన్-K
-దీనిని ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్, రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్, యాంటీహెమరేజిక్ విటమిన్ యాంటీబ్లీడింగ్ విటమిన్ అని అంటారు.
[03/02, 9:58 p.m.] VINAY KUMAR: విటమిన్-K లభించే పదార్థాలు
-ఆకుకూరలు, కాలేయం, గుడ్డు, ఆవుపాలు, పెద్దపేగులోని ఎశ్చరీషియా కొలై (ESCHERICHIA COLI) అనే బ్యాక్టిరియా
-అప్పుడే పుట్టిన శిశువులో లోపం ఎక్కువ. కావున సర్జరీ సమయంలో పేషెంట్‌కు K విటమిన్ ఇవ్వాలి.
విటమిన్-K వల్ల ఉపయోగాలు
-గాయమైన రెండు నుంచి ఐదు నిమిషాల్లో రక్తాన్ని గడ్డకట్టించడం
-బాంబు పేలుళ్లు, కత్తిపోట్ల వల్ల గడ్డకట్టడానికి 8 నిమిషాలు పడుతుంది
విటమిన్-K లోపం వలన కలిగే వ్యాధులు
హెమరేజియా: అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టక పోవడం, క్లోమం దెబ్బతినడం