Type Here to Get Search Results !

Vinays Info

Vitamin A | విటమిన్ -A

విటమిన్ -A
-దీని రసాయన నామం- రెటినాల్
-సాధారణ నామం-యాంటీగ్జెరాఫ్తాల్మియా
-ఈ విటమిన్ లభించే పదార్థాలు- పసుపుపచ్చ పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ఆకు కూరలు, క్యారట్, పాలు, షార్క్‌కాడ్ చేప కాలేయ నూనె
- A-విటమిన్ అధికంగా కలిగిన పదార్థం- క్యారట్
-విటమిన్-A అధికంగా ఉండే ఆకుకూర-బచ్చలి, అధికంగా ఉండే ఫలం- బొప్పాయి, అధికంగా ఉండే పాలు- ఆవు పాలు
గమనిక: మొక్కలలో A-విటమిన్ (PRO VITAMINE-A) రూపంలో ఉండి పేగు, కాలేయంలలో A- విటమిన్‌గా మారుతుంది
-పామాయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణం- విటమిన్-A
ఉపయోగాలు
-కంటి చూపునకు తోడ్పడుతుంది
-గర్భధారణకు ఉపయోగపడుతుంది
-ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది
-చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరం

విటమిన్ -A లోపం వలన కలిగేవ్యాధులు
రే చీకటి (నిక్టోలోపియా): మసక చీకటిలో కండ్లు కనిపించక పోవడం
పొడికండ్లు (ైగ్జెరాఫ్తాల్మియా): కన్నీటిని ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్రంథులు/అశ్రుగ్రంథులు పనిచేయకపోవడం వల్ల కన్నీరు ఉత్తత్తికాక కండ్లు పొడిగా మారతాయి
-కన్నీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్, సోడియం క్లోరైడ్ (NACL) ఉండటం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. దుమ్ము, ధూళి బయటకు పంపిస్తుంది
-కండ్లు పొడిగా మారినప్పుడు కనుగుడ్లను కప్పి ఉంచే సున్నితమైన కార్నియా/శుక్లపటలం పగిలి శాశ్వత అంధత్వం (కెరటోమలేషియా) కలుగుతుంది
-కంటి అధ్యయనం- ఆప్తాల్మాలజీ
- చర్మ అధ్యయనం- డెర్మటాలజీ
గమనిక: కనుగుడ్లు దానం చేసే వ్యక్తులు మరణించిన 6-8 గంటల్లో కార్నియాను సేకరిస్తారు
డెర్మటోసిస్: చర్మం పైపొర పొలుసులుగా ఊడిపోతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section