టెండూల్కర్ కమిటీ (2005)
అత్యంత వివాదాస్పదమైన కమిటీల్లో ఇది ఒకటి. యూపీఏ జమానాలో ఏర్పాటుచేసిన ఈ కమిటీ పేదరిక రేఖను అత్యంత తక్కువగా చూపింది. పేదల శాతాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నంచేసింది. ఈ కమిటీ కూడా వివాదాస్పదం కావడంతో మళ్లీ రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేశారు.
సూచనలు
ఇంతవరకు ఉన్న ఒక విధమైన గుర్తింపు కాలం (UNIFORM REFERENCE PERIOD)ను కాదని మిశ్రమ గుర్తింపు కాల పద్ధతి (MIXED RECALL PERIOD)ని వాడారు.
అలాగే పట్టణాలు, గ్రామాలకు ఒకేవిధమైన పేదరిక బుట్ట (POVERTY BASKET)ను నిర్ణయించారు.
పై అంచనాలు తీవ్ర వివాదాస్పదం కావడంతో 2012లో మరో కమిటీని నియమించారు.
రంగరాజన్ కమిటీ (2012)
-ఈ కమిటీ తన నివేదికను 2014లో సమర్పించింది.
-ఇది మళ్లీ పాతపద్ధతి అయిన గ్రామాలు, పట్టణాలకు విడివిడి కెలోరీ ఆధారిత దారిద్య్రరేఖను నిర్వచించింది.
-మిశ్రమ ఆధారిత కాలపట్టిక కాకుండా సవరించిన మిశ్రమ ఆధారిత కాల నిర్ణయ పట్టిక ఆధారంగా తీసుకున్నారు.
-పైవారి తరువాత వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఇతర కమిటీలు కూడా పేదరికాన్ని అంచనావేశాయి. ఉదాహరణకు సక్సేనా కమిటీ, హసీమ్ కమిటీ, అభిజిత్ కమిటీ మొదలైనవి.
-పైవేవీ ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసినవి కాదు. కాబట్టి వాటి పద్ధతిని, అంచనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రణాళికా సంఘం ప్రకటించింది.