Type Here to Get Search Results !

Vinays Info

Sir Hijack Newton | సర్ ఐజాక్ న్యూటన్


జనవరి 4, "సర్ ఐజాక్ న్యూటన్" జయంతి సందర్భంగా.....

🍀సర్ ఐజాక్ న్యూటన్ ( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. *ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.*

*🌷బాల్యం🌷*

🍀ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. *న్యూటన్ జన్మించే సమయానికి ఇంగ్లండు ప్రపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం మూలాన ఆయన జన్మదినం డిసెంబరు 25, 1642గా నిక్షిప్తం చేయబడింది. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు.*

*🍀న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. న్యూటన్ కు మూడు సంవత్సరాల వయసు రాగానే అతడి తల్లి, ఇతడిని ఆమె తల్లియైన Margery Ayscough సంరక్షణలో వదిలేసి వేరొక వ్యక్తిని (Barnabus Smith) పెళ్ళాడి అతనితో వెళ్ళిపోయింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించే వాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇది 19 ఏళ్ళ లోపు అతను చేసిన పొరపాట్ల జాబితా నుంచి వెల్లడి అయింది.*

*🌷యాంత్రికశాస్త్రం మరియు గురుత్వాకర్షణ🌷*

🍀"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు.అతను స్విస్ జన్మించిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ Fatio డి Duillier తో తీవ్రమైన సంబంధం ఏర్పడింది, శాస్త్రజ్ఞుడు నికోలస్ Fatio డి Duillier సహా, అభిమానులతో ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాడు.కాని ఇది ఆకస్మికంగా 1693 లో ముగిసింది, మరియు అదే సమయంలో న్యూటన్ నాడీ వ్యవస్థ దెబతినింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section