😎😎➖➖➖➖➖➖➖➖
*అంధులకు వెలుగు లూయీ బ్రెయిలీ*
*జయంతి సందర్భంగా..
➖➖➖➖➖➖➖➖😎😎
*⚪అమావాస్య చీకట్లో అంధకార జీవితాన్ని గడుపుతున్న అంధుల పాలిట పున్నమి వెన్నెలల వెలుగు ప్రదాత లూయీ బ్రెయిలీ. మానిక్ బారన్, సైమన్ రెనా బ్రెయిలీ దంపతులకు లూయీ బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్ లోని క్రూవే గ్రామంలో జన్మించారు. దృష్టిలోపం ఉన్నవాళ్ళకీ, అంధులకీ ఉపయోగపడే విధంగా ఆరు అక్షరాలతోనే చదవడానికీ, రాయడానికీ వీలుగా ఒక అక్షరమాల రూపొందించాడు. పైకి ఉబ్బెత్తుగా ఉండి, చేతి వేళ్ళతో స్పృశిస్తూ చదవుకోగలిగేటట్లు చేసి అంధులపాలిట లూయీ బ్రెయిలీ దైవంగా మారాడు.*
*⚪బ్రెయిలీ కనిపెట్టిన ఈ లిపిని తర్వాత కాలంలో అతని పేరుతోనే పిలిచారు. నేడు రికార్డింగ్ సదుపాయం వచ్చినా, అంధులు కూడా చదువుకున్నారని చెప్పడానికి ఒక ప్రామాణిక ఆధారం బ్రెయిలీ లిపిలో రాయడం, చదవడం. నిజానికి ఈ లిపికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అంత సులువుగా లభించలేదు. ఎంతో పోరాడాల్సి వచ్చింది. బ్రెయిలీ లిపిలో అనేక పుస్తకాలు నేడు అందుబాటులోకి వస్తున్నాయి. లెబ్రరీల్లోనూ ఈ పుస్తకాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషికి ముఖ్యమైనవి కళ్ళు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలన్నారు. జ్ఞానానికి నిజమైన వాకిళ్ళు కళ్ళు. లూరుూ బ్రెయిలీ అందరిలాగే పుట్టాడు. మూడేళ్ళ వరకూ బాగానే ఉన్నాడు. తన తండ్రి గుర్రం జీన్లు తయారు చేస్తున్న దగ్గరకెళ్ళి ఆడుకుంటుండేవాడు. కత్తి మొన కన్నుకి తగిలింది. అలా ఒక కన్ను పోయింది. తర్వాత రెండవ కన్ను కూడా పోయింది.*
*⚪తన అక్కతో పాటు పాఠశాలకు వెళ్ళే లూయి కి చదువు మీద ఆసక్తి కలిగింది. ఇంటికొచ్చి ఆ పాఠాల్ని చెప్తుండేవాడు.అతని శ్రద్ధాసక్తుల్ని గమనించిన తండ్రి చిన్న మేకుల్ని ఒక చెక్కపై అక్షరాలుగా చేసి లూరుూ చేతుల్తో చదివించే వాడు. లూరుూకి మంచి ధారణ, గ్రహణశక్తి ఉండటం వల్ల పాఠశాల్లో ఉపాధ్యాయుల మన్ననల్ని పొందేవాడు. పదవ ఏట పారిస్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది బ్లెండ్ లో స్కాలర్‌షిప్పుకి ఎంపికయ్యాడు.*
*⚪1784లో వాలెంటీన్ హావే స్థాపించిన అంధుల పాఠశాలలో అంధులకు వివిధ వృత్తి పనుల్లో శిక్షణ నిస్తుండే వారు. చదువుకోవడానికి వీలుగా రాగి రేకులపై ఉబ్బెత్తు అక్షరాల్ని రాసేవారు. చదువుకోవడమే తప్ప ప్రతి విద్యార్థీ రాయాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పనిగా ఉండేది. రాగి రేకులపై రాసిన అక్షరాల్ని చదువుకోవాలంటే, వాటిని మోయడం పెద్దబరువుగా కూడా ఉండేది. ఆ పద్ధతిలో అంధుల కోసం రాసే ఆ విధానాన్ని లెన్ టెప్ అని పిలిచేవారు. లూరుూ తాను చదువుకున్న పాఠశాలలోనే తన 17వఏటఉపాధ్యాయుడయ్యాడు.*
*⚪లూయీ బ్రెయిలీ చదువు చెప్తూనే, సులభమైన రీతిలో అంధులు చదువుకునేలా, రాయగలిగేలా అక్షరమాలను రూపొందించాలని ప్రయత్నిస్తుండేవాడు.ఆ పాఠశాలను ఫ్రెంచి మాజీ ఆర్మీ కెప్టెన్ చార్లెస్ బార్బేయర్ సందర్శించాడు. ఆ సందర్భంగా తాను కనుగొన్న 12 గుర్తులతో రూపొందించిన రాత్రి చదువు గురించి ప్రస్తావించాడు. అది నిజానికి సైనికులకు మాత్రమే తెలిసే రహస్య సంకేతాల్ని తమ వేళ్ళ ద్వారా స్పృశించి తెలుసుకునే విద్య. అప్పటి నుండీ అటువంటి పద్ధతిలోనే మరింత సులభంగా, తేలికైన పద్ధతిలో ఆరు అక్షరాల్లో అంధులు చదువుకొనే, రాయగలిగే లిపిని లూరుూ బ్రెయిలీ కనిపెట్టాడు.*
*⚪దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే కృషిలో భాగంగా లెక్కల్ని అభ్యసించడానికి, సంగీతాన్ని నేర్చుకోవడానికీ ఈ లిపి ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు. 1829 లో ‘మెథడ్ ఆఫ్ రైటింగ్, మ్యూజిక్ అండ్ ప్లైన్ సాంగ్స్ బై మీన్స్ ఆఫ్ డాట్స్ ఫర్ యూస్ బె ది బ్లెండ్ అండ్ ఎరేంజ్‌డ్ ఫర్ దెమ్’ అనే పుస్తకాన్ని లూరుూ బ్రెయిలీ ప్రచురించాడు. 1839లో డాట్స్‌తో ముద్రణ చేసే విధానం గురించి కూడా పుస్తకాల్ని ప్రచురించాడు. 1852 జనవరి 6వ తేదీన క్షయ వ్యాధితో లూయీ బ్రెయిలీ మరణించాడు.*
⚪ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలంతా లూయి బ్రెయిలీ జయంతులు, వర్థంతులతో అంధులంతా ఆయనకు స్మరించుకుంటున్నా రంటే అందుకు కారణం ఆయన అంధులందరీకీ వెలుగు ప్రదాత కావడమే.