Type Here to Get Search Results !

Vinays Info

కార్ల్ డేవిడ్ ఆండర్సన్'భౌతిక శాస్త్రంలో..నోబెల్ ప్ర్తెజ్ గ్రహీత వర్దంతి సందర్భంగా..

కార్ల్ డేవిడ్ ఆండర్సన్'భౌతిక శాస్త్రంలో..నోబెల్ ప్ర్తెజ్ గ్రహీత వర్దంతి సందర్భంగా..
~~✍సురేష్ కట్టా(నెల్లూరు జిల్లా)
➖➖➖➖➖➖➖➖➖🏗🎢
*🔻అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త . అతను ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్  1932 లో కనుగొన్నారు. ఈయన చేసిన ఉత్తమ ఆవిష్కరణకు 1936 లో భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది.*

*జీవిత విశేషాలు:*

🔻అండర్సన్ న్యూయార్క్ నగరం లో జన్మించాడు.  ఈయన స్వీడిష్ నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందినవాడు. ఈయన భౌతిక శాస్త్రము మరియు  ఇంజనీరింగ్ లను  పూర్తిచేశాడు.

*🔻రాబర్ట్ ఎ. మిల్లికాన్ పర్యవేక్షణ లో ఆయన విశ్వకిరణాలపై పరిశోధనలు ప్రారంభించిన పుడు ఊహించని విధంగా క్లౌడ్ ఛాంబర్ చిత్రాలలో పరమాణు ఉపకణాన్ని కనుగొన్నా డు. ఈ కణం పరమాణు ఉపకణమైన  ఎలక్ట్రాన్ తో సమానమైన ద్రవ్యరాశి గలదిగా గుర్తించాడు. కానీ ఈ కణం ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం (ఋణావేశం) నకు వ్యతిరేక ఆవేశం (ధనావేశం) ఉన్నట్లు గుర్తించాడు. ఈ పరిశోధన 1932 లో ప్రకటించబడింది. దీనిని యితర శాస్త్రవేత్తలు ఆ తర్వాత కాలంలో ధృవీకరించారు.*

🔻పాల్ డిరాక్ యొక్క సైద్ధాంతిక ప్రిడిక్షన్  పాజిట్రాన్  కూడా ఈ కణ ఉనికిని ఋజువు చేసింది. అండర్సన్ మొదట విశ్వకిరణాలలో ఈ కణాలను కనుగొన్నాడు. ఆ తర్వాత ఆయన సహజ రేడియోధార్మిక పదార్థమైన ThC'' (208Tl)నుండి వెలువడిన గామా కిరణాలను యితర పదర్థాలపై ప్రక్షిప్తం చేసి నపుడు ఫలితంగా పాజిట్రాన్-ఎలక్ట్రాన్ జంటలు యేర్పడుటను ఋజువు చేసెను. *ఈయన చేసిన కృషికి 1936 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని "విక్టర్ హెస్" తో పాటుగా పొందారు. మ్యూయాన్ కణం  ఉప పరమాణు కణాలు జాబితాలో మొదటిది.*

*🔻1936 లో అండర్సన్ మరియు ఆయన యొక్క విద్యార్థి ఐన "సేథ్ నెడెర్మేయర్" కలసి మ్యూయాన్ (లేదా "మ్యూ-మీసాన్) అనే పరమాణు కణాన్ని కనుగొన్నారు.*

*🔻ఈ పరమాణు కణం ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కి 207 రెట్లు ఉంటుంది  కానీ అది ఎలక్ట్రాన్ తో సమానమైన ఋణావేశాన్ని మరియు 1/2 స్పిన్ ను కలిగి ఉంటుంది. దీనికి కూడా కాశ్మిక్ కిరణాలలోనే కనుగొన్నా రు.  అండర్సన్ మరియు నెడెర్మేయన్ లు స్ట్రాం ఇంటరేక్షన్  సిద్ధాంతం లో 'హిడెకి యుకవా ' ప్రతిపా దించిన కణం అయిన  పైయాన్  ను కూడా వీక్షించారు.*

🔻అండర్సన్ తన అకడమిక్ మరియు పరిశోధనా జీవితాన్ని "కాల్‌టెక్"లో గడిపారు. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఆయన రాకెట్ లపై పరిశోధనలు చేశారు.

🔻ఈయన 1950 లో "అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్"కు పెలోగా ఎంపిక కాబడ్డారు. ఈయన 1911, జనవరి 11 న మరణించారు.
(సెప్టెంబర్ 3, 1905 - జనవరి 11, 1991)

〰🕊:సే: సురేష్ కట్టా🌸🙏🌸

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section