ఎవరెస్టుశిఖరాన్ని అధిరోహించిన మొదటి ఇద్దరిలో ఒకరు..'సర్ ఎడ్మండ్ హిల్లరీ'
వర్దంతినేడు..✍సురేష్ కట్టా[సోషల్ టీచర్]
➖➖➖➖➖➖➖➖➖🏔🌁
*సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ, న్యూజీలాండ్ కు చెందిన పర్వ తారోహ కుడు మరియు అన్వేష కుడు. 33 యేళ్ళ వయసులో 1953, మే 29న షేర్పా పర్వతా రోహకుడు టెన్సింగ్ నార్కేతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్ట మొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు.*
*🔸వీరు 'జాన్ హంట్ ' నాయకత్వము లోని తొమ్మిదవ బ్రిటీషు అధిరోహణా బృందము లో భాగంగా ఎవరెస్టును ఎక్కారు.*
🔸ఎడ్మండ్ హిల్లరీ1919జూలై 20న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్‌లో జన్మించాడు. హిల్లరీ విద్యాభ్యాసం త్వాకౌ ప్రాథమిక పాఠశాలలోను, ఆక్లాండ్ గ్రామర్ పాఠశాలలో నూ కొనసాగింది.
*🍥పర్వతారోహణ..🌁*
🔸16 సంవత్సరాల వయస్సులోనే హిల్లరీ పర్వతారోహణపై మక్కువ చూపినాడు. 1939లో దక్షణ ఆల్ప్స్ పర్వతాలలో ఉన్న ఆలివర్ పర్వత శిఖరాన్ని అధిరోహించడం అతని జీవితంలో తొలి ప్రధాన సాహస కృత్యం. ఎవరెస్టు అధిరోహణే కాకుండా హిమాలయ పర్వతాలలో ఉన్న ముఖ్యమైన మరో 10 శిఖరాలను కూడా హిల్లరీ అధిరోహించినాడు.
*🍥ఎవరెస్టు అధిరోహణ..🏔*
*🔸8848 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తు గల హిమాలయపర్వతాలలోని'ఎవరెస్టు శిఖరం 'అధిరోహణ అత్యంత సాహసమైనకృత్యం. టెన్సింగ్ నార్కేతో పాటు ఎడ్మండ్ హిల్లరీ 1953, మార్చి 29 నాడు ఈ శిఖరాన్ని చేరుకొని ఈ ఘనత సాధించిన తొలివ్యక్తు లలోఒకడిగాఅవతరించినాడు.*
*🍥నేపాలీల...మానవతా మూర్తి...👋🏻👋🏻*
🔸ఎడ్మండ్ హిల్లరీ నేపాలీల ముఖ్యంగా షెర్పాల దృష్టిలో దైవసమానుడు. ఎవరెస్టు అధిరోహణ సమయంలో అక్కడి షెర్పాల దయనీయ జీవితాన్ని చూసి చలించిపోయా డు. అక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి షెర్పాల జీవితంలో వెలుగులు నింపినాడు. హిల్లరీ మరణానంతరం షెర్పాలు వెన్నతో దీపాలు వెలిగించి ప్రత్యేక బౌద్ధ ప్రార్థనలు చేశారు.
*🍥గుర్తింపులు..🎖🏅🎖*
🔸ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తమ దేశ గౌరవాన్ని నిలబెట్టినందు కు న్యూజీలాండ్ ప్రభుత్వం 5 డాలర్ల కరెన్సీనోటుపై హిల్లరీ బొమ్మ ను ముద్రించి అతని ప్రతిభను గౌరవించింది. న్యూజీలాండ్ లోని ఎన్నో పాఠశాలలకు, సంస్థలకు హిల్లరీ పేరు పెట్టినారు.
🔸బ్రిటన్ జట్టులోని సభ్యుడిగా హిల్లరీ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ హిల్లరీని సత్కరించింది.
🔸భారత్ లోని డార్జిలింగ్ లో సెయింట్ పౌల్ పాఠశాలలోని ఒక భవనానికి కూడా హిల్లరీ పేరు పెట్టబడినది.
*🍥విషాదకర సంఘటన..🛩*
🔸1975లో ఎడ్మండ్ హిల్లరీ నేపాల్ లో సేవాకార్యక్రమాలలో భాగంగా ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నప్పుడు తనను కలుసుకోవడానికి వస్తున్న భార్య, కుమారై ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి మరణం చెందడం హిల్లరీ జీవితంలో అత్యంత విషాద కరమైన సంఘటన.
*🍥మరణం*
🔸2008, జనవరి 11 న హిల్లరీ ఆక్లాండ్‌లో మరణించాడు. అప్పుడు ఇతని వయస్సు 88 సంవత్సరాలు. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న హిల్లరీకి గుండెపోటు రావడం తో ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినాడు.
(జూలై20,1919–జనవరి11,2008)
〰〰✍సే:సురేష్ కట్టా🌸🏔🙏🌸