💥 ఘన, ద్రవ, వాయు స్థితులతోపాటు పదార్థ నాలుగో స్థితి ప్లాస్మా. సిల్వర్, హైడ్రోజన్, నైట్రోజన్ వంటి వాటి లో ఒకే రకమైన పరమాణువులుంటాయి. అవి మూల కాలు. నీరు, గ్లూకోజ్, సుక్రోజ్ (చక్కెర), టేబుల్ సాల్ట్ (సోడియం క్లోరైడ్) వంటివి సమ్మేళనాలు. వీటిలో ఒకటి కంటే ఎక్కువ మూలకాల పరమాణువులుం టాయి.
💥గాలి (ప్రధానంగా నైట్రోజన్ (78%), ఆక్సిజన్ (20%), కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్), బంగారు ఆభరణాలు, చక్కెర ద్రావణం వంటివి మిశ్రమాలు. వీటిలోని అనుఘటకా లను సులభంగా వేరుచేయొచ్చు.
💥అయోడిన్, గ్రాఫైట్, డైమండ్‌లు అలోహాలైనా లోహాల్లా మెరుస్తాయి.
💥అయోడిన్, కాంఫర్‌లు ఉత్పతనం చెందుతాయి. అంటే ఘన స్థితి నుంచి నేరుగా వాయువుగా మారతాయి.
💥సాధారణంగా లోహాలు ఘన పదార్థాలు. కానీ మెర్క్యురీ, గాలియం, సీసియం, ఫ్రాన్షియంలు కూడా దాదాపు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉంటాయి.
💥 ఫాస్పరస్ పొడి గాలిలో మండుతుంది. అందువల్ల దీన్ని నీటిలో నిల్వ చేస్తారు.
💥 రీచార్జబుల్ బ్యాటరీల్లో లిథియంను, మానసిక చికిత్సలకు లిథియం కార్బొనేట్‌ను ఉపయోగిస్తారు.
💥మిల్క్ ఆఫ్ మెగ్నీషియా (మెగ్నీషియం హైడ్రాక్సైడ్) ఆమ్ల విరోధిగా, విరేచనకారిగా పనిచేస్తుంది.
-
💥పాలను చీజ్‌గా మార్చడంలో, రక్తం గడ్డకట్టడంలో కాల్షియం తోడ్పడుతుంది.
💥శరీరంలో 99% కాల్షియం ఎముకలు, దంతాల్లో ఉం టుంది. ఎముకల్లో కాల్షియం ఫాస్పెట్ రూపంలో, దంత ఎనామిల్‌లో హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది.
💥కిడ్నీలో ఏర్పడిన రాళ్లలో ప్రధానంగా ఉండేది కాల్షియం ఆక్సలేట్.
💥 కాల్షియం శోషణకు సూర్యరశ్మి ఆధారిత విటమిన్-డి చాలా అవసరం.
💥 క్లోరోఫిల్‌లో మెగ్నీషియం, రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్, సయనోకోబాలమిన్ (విటమిన్ బి12)లో కోబాల్ట్ లోహ అయాన్లు ఉంటాయి.
💥 జీర్ణ వ్యవస్థ ఎక్స్ కిరణ ఇమేజింగ్‌లో బేరియం మీల్‌గా, బేరియం సల్ఫేట్‌్‌ను ఉపయోగిస్తారు.
💥 ఫుల్లరీన్.. సాకర్ బాల్ నిర్మాణంలో ఉంటుంది.
💥సహజ రబ్బరుకు గట్టిదనం కోసం సల్ఫర్‌ను కలిపి వేడిచేసే ప్రక్రియను వల్కనైజేషన్ అంటారు.
💥 నూనెలను నికెల్ లోహం ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్ వాయువుతో క్షయకరణం (హైడ్రోజనీ కరణం) చేసి వనస్పతి (డాల్టా)గా మార్చుతారు.
💥ఇనుము వంటి లోహాలు తుప్పుపట్టకుండా జింక్ లోహంతో పూత పూసే ప్రక్రియ గాల్వనైజేషన్.
💥 ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆక్సీకరణం చెంది బరువు పెరుగుతూ ఐరన్ ఆక్సైడ్‌గా మారుతుంది.
💥భూ పటలంలో సమద్ధిగా లభించే లోహం అల్యూమి నియం. ఆ తర్వాతి స్థానం ఇనుముది.
💥లేత పసుపు వర్ణ వీధి దీపాల్లో సోడియం ఆవిరి, సాధారణ ట్యూబ్‌లైట్లలో మెర్క్యురీ ఆవిరి ఉంటాయి.
💥సున్నపురాయి, పాలరాయి (మార్బుల్), ముత్యంలో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది.
💥కెంపులో అల్యూమినియం ఆక్సైడ్‌తోపాటు మలినంగా క్రోమియం ఉంటుంది.
💥 ఎమరాల్డ్‌లో బెరీలియం ఉంటుంది.
💥 కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం లోహ (అయాన్ల) కార్బొనేట్‌లు, క్లోరైడ్‌లు, సల్ఫేట్‌లు ఉంటాయి.
💥 సముద్ర జలం (కఠినజలం) నుంచి స్వాదుజలాన్ని పొందడానికి అనువైన ప్రక్రియ తిరోగామి ద్రవాభిసరణం.
💥గాగుల్స్‌కు ఉపయోగించే రంగు అద్దాల్లో ఫై ఆక్సైడ్ ఉంటుంది.
💥సాధారణంగా అయానిక పదార్థాలు స్పటికాకతిని కలిగి ఉంటాయి. కానీ డైమండ్, ఐస్‌లు సమయోజనీయ స్పటికాలు.
💥బాగా సాగే గుణం ఉన్న లోహం బంగారం.
💥ఇనుముకు తుప్పు పట్టే గుణం అధికం. స్టీలు (ఉక్కు)గా మార్చాక తుప్పు పట్టకపోవడానికి కారణం అందులో ఉండే క్రోమియం.
💥ఆరోగ్యవంతమైన దంతాల కోసం కాల్షియంతోపాటు ఫాస్పరస్, ఫ్లోరైడ్ కూడా అవసరమే.
💥టూత్‌పేస్ట్‌లలో కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్‌లను ఉపయోగిస్తారు.
💥మంటలను ఆర్పే సాధనాల్లో సోడియం కార్బొనేట్, పొటాషియం కార్బొనేట్‌లు ఉంటాయి. ఇవి ఆమ్లంతో కలిసినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయి.
💥బేకింగ్ సోడా యాంటిసెప్టిక్‌గా, ఆమ్ల విరోధిగా కూడా పనిచేస్తుంది.
💥వాటర్ గ్లాస్ అనేది - సోడియం సిలికేట్
💥జిప్సం (కాల్షియం సల్ఫేట్ డై హైడ్రేట్- నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారు చేస్తారు.
💥రేడియోధార్మిక పదార్థాలు ఆల్ఫాబీటా, గామా కిరణాలను ఉద్గారం చేస్తాయి.
💥 కోబాల్ట్-60 ఐసోటోప్ ఆధారిత గామా కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ చేస్తారు.
💥 అణు బాంబులోని సూత్రం కేంద్రక విచ్ఛిత్తి.
💥యురేనియం-235 వంటి అస్థిర కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చెందిస్తే కేంద్రకం విఘటనం చెందడంతోపాటు అపారశక్తి విడుదలవుతుంది.
💥ఈ 'శంఖల కేంద్రక విచ్ఛిత్తి చర్య'ను నియంత్రించి న్యూక్లియర్ రియాక్టర్‌లలో అణు విద్యుచ్ఛక్తిని పొందుతారు. ఇంధనాలుగావాడతారు
💥న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారిగా భారజలాన్ని వాడతారు.
💥న్యూట్రాన్ల సంఖ్యను నియంత్రించేందుకు బోరాన్, కాడ్మియం కడ్డీలను వాడతారు.
💥హైడ్రోజన్ బాంబు, సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తికి మూలాధారం కేంద్రక సంలీనం.
💥భూపొరల్లో సమద్ధిగా లభించే మూలకాలు వరుసగా ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం.
💥 ఘన కార్బన్ డై ఆక్సైడ్‌ను పొడి మంచు అంటారు.
💥అల్యూమినియం పొడి, అమోనియం నైట్రేట్‌ల మిశ్ర మాన్ని అమ్మోనాల్ అంటారు. ఇది పేలుడు పదార్థం.
💥డైమండ్.. ఉష్ణ, విద్యుత్ వాహకం కాదు.
💥బంగారం, ప్లాటినంల చర్యాశీలత తక్కువ. ఇవి నోబుల్ మెటల్స్. ప్రకతిలో సహజ స్థితిలో లభిస్తాయి.
💥లోహాల్లో వెండి (సిల్వర) మంచి విద్యుద్వాహకం.
💥అల్యూమినియం ఆక్సైడ్ రూపంలోని ధాతువు బాక్సైట్. దీన్నుంచే అల్యూమినియాన్ని వ్యాపార సరళిలో సంగ్రహిస్తారు.
💥రాగి సల్ఫడ్ రూపంలోని ఖనిజం కాపర్ పైరటీస్.
💥రేడియోధార్మిక యురేనియం ఖనిజం పిచ్‌బ్లెండ్.
💥భారతదేశంలో విరివిగా లభించే మోనజైట్ ఇసుక నుంచి రేడియోధార్మిక థోరియం లభిస్తుంది.
💥సీసం ఖనిజం గెలీనాబీ మెగ్నీషియం- డోలమైట్, మాగసైట్, ఐరన్- హెమటైట్, మాగటైట్.
💥ఇనుము సంగ్రహణలో ఉపయోగించే బ్లాస్ట్ కొలిమిలో ఐరన్ ఆక్సైడ్, ఐరన్‌గా క్షయకరణం చెందడానికి కార్బన్ మోనాక్సైడ్ ఉపయోగపడుతుంది.
💥బ్లాస్ట్ కొలిమిలో, మొదట 750ష వద్ద లభించే గుల్ల బారిన ఘన స్థితిలోని ఐరన్‌ను స్పాంజ్ ఐరన్ అం టారు. 1500నిఇ వద్ద కొలిమి అడుగున ద్రవ స్థితిలో ఉండే ఐరన్‌ను దుక్క ఇనుము లేదా పోత ఇనుము అంటారు.
💥కార్బన్ శాతం గరిష్టంగా (34%) ఉన్నది దుక్క ఇనుము.
💥కార్బన్ శాతం అతి తక్కువ (0.5% కంటే స్వల్పం) ఉన్న శుద్ధమైన ఇనుము.. చేత ఇనుము.
💥ఇనుములో కార్బన్ శాతం పెరిగితే పెళుసుదనం ఎక్కువవుతుంది.
💥స్టీల్ అనేది ఐరన్‌తో కూడిన మిశ్ర లోహం. కార్బన్ తప్పనిసరిగా 0.11.5% వరకు ఉంటుంది.
💥స్టీల్‌కు స్థితిస్థాపకత ఎక్కువ.
💥ఇనుము, నికెల్, క్రోమియం, మాంగనీస్ కలిసి ఉన్న మిశ్ర లోహం నిక్రోమ్. దీన్ని హీటర్ల ఫిలమెంట్ తయారీ లో ఉపయోగిస్తారు. కాపర్, జింక్, నికెల్‌ల మిశ్ర లోహం జర్మన్ సిల్వర్ (సిల్వర్ ఉండదు). దీన్ని పాత్రలు, నిరోధక చుట్టల తయారీలో వాడతారు. ఇమిటేషన్ జ్యుయలరీలో ఉపయోగిస్తారు.
💥ఫ్యూజ్‌వైర్ల తయారీకి టిన్, లెడ్‌ను ఉపయోగిస్తారు.
💥 ఢిల్లీలోని ఐరన్ పిల్లర్ నేటికీ తుప్పు పట్టకపోవడానికి కారణం అందులోని అధిక ఫాస్పరస్ శాతం.
💥ఇత్తడి - కాపర్, జింక్, కంచు కాపర్, టిన్‌ల మిశ్ర లోహాలు.
💥ప్రపంచంలో తయారు చేసిన మొదటి మిశ్ర లోహం కంచు (బ్రాంజ్).
💥మానవుడు ఉపయోగించిన తొలి లోహం - రాగి (కాపర్)
💥సిల్వర్ పెయింట్‌లో ఉండే లోహం- అల్యూమినియం.
- సోల్డర్ మెటల్‌లోని లోహాలు - తగరం (టిన్), సీసం (లెడ్).
💥 రేడియోధార్మికత నుంచి రక్షణకు లెడ్ ఉపయోగ పడుతుంది.
💥వేడి చేసినప్పుడు సంకోచించే లోహం - జిర్కోనియం.
💥అరటి పండు నుంచి లభించి రక్తపోటును నియంత్రించే క్షార లోహం పొటాషియం.
💥రక్తం ప్లాస్మాలో కాల్షియం అయాన్‌లు ఉంటాయి.
💥బంగారు నగల తయారీలో గట్టిదనం కోసం కాపర్ కలుపుతారు.
💥 స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు.
💥 ఒక క్యారెట్ 100/24 శాతానికి సమానం.
💥 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం 91.7.
💥దంతాల్లోని రంధ్రాలను ఫిల్లింగ్ చేయడానికి సిల్వర్, టిన్, మెర్క్యురీ, జింక్‌ల మిశ్రమాన్ని వాడతారు.
💥మిర్రర్‌ల కళాయి పూతలో ఉపయోగించే లోహం సిల్వర్.
💥హెల్మెట్‌ల తయారీలో మాంగనీస్ స్టీల్‌ను ఉపయోగిస్తారు.
💥ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు యురేనియం-238ని ఉపయోగించుకొని, ప్లుటోనియం-239ని ఉత్పత్తి చేస్తాయి.
💥చెట్లు, శిలాజాల వయసును కార్బన్-14 ఐసోటోప్ ఆధారిత రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా నిర్ధారిస్తారు.
💥 థైరాయిడ్, గాయిటర్ చికిత్సతోపాటు మెదడులోని కణుతులను గుర్తించడానికి అయోడిన్-131 ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు.
💥బయోగ్యాస్, సహజ వాయువు, గోబర్ గ్యాస్‌లో ప్రధాన హైడ్రోకార్బన్ మీథేన్.
💥బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలకు కారణం మీథేన్ (ఫైర్‌డ్యాంప్).
💥మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ అనేవి పరమాణు భారం పెరిగే క్రమంలో (వరుసగా) మొదటి నాలుగు హైడ్రోకార్బన్లు.
💥 సీఎన్‌జీలో సంపీడనం చెందించిన మీథేన్ ఉంటుంది.
💥ఎల్‌పీజీ, సిగరెట్ లైటర్‌లో బ్యూటేన్ ఉంటుంది.
💥ఇథిలీన్‌కు కాయలను త్వరగా పక్వం చెందించే గుణం ఉంటుంది.
💥కాల్షియం కార్బైడ్ తేమ సమక్షంలో ఎసిటలీన్ విడుదల అవుతుంది. ఇది కూడా కాయలను పక్వం చెందిస్తుంది. కానీ ఇది హానికరం.
💥ఎసిటలీన్‌ను వెల్డింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
💥 ఎసిటికామ్ల విలీన ద్రావణమే వెనిగర్.
💥మాంసం త్వరగా కుళ్లకుండా వెనిగర్ వాడతారు.
💥చీమ, తేనెటీగ కుట్టినప్పుడు ఫార్మికామ్లం విడుదలవుతుంది.
💥ఇథనాల్‌ను ధర్మామీటర్‌లలో, రాకెట్ ప్రొపెల్లెంట్‌లుగా కూడా ఉపయోగిస్తారు.
💥ఉడ్ స్పిరిట్ అంటే మిథైల్ ఆల్కహాల్. దీన్ని సేవిస్తే కంటిచూపు పోవడం, మరణం సంభవిస్తాయి.
💥ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే లివర్ దెబ్బతిని సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది.
💥ఘనీభవన స్థానం తక్కువ కారణంగా ఇథిలీన్ గ్లైకాల్‌ను వాహనాల రేడియేటర్లలో (నీరు గడ్డకట్ట కుండా) యాంటీ ఫ్రీజ్‌గా వాడతారు.
💥మాయిశ్చరైజింగ్ సబ్బుల్లో ఉండేది గ్లిజరాల్.
💥 ఫార్మలిన్ (ఫార్మాల్డిహైడ్ విలీన ద్రావణం)ను స్పెసిమెన్స్ (మత కళేబరాలు, భాగాల)ను భద్రపర్చడానికి వాడతారు.