➖➖➖➖➖➖➖➖
రెండు ‘నోబెల్’ ప్రైజ్ లు గెలుచు కున్న ప్రథమ శాస్త్రవేత్త !మేరీ క్యూరీ’’!
(ఈమె ప్రసిద్ధ భౌతిక - రసాయనిక శాస్త్రవేత్త)
➖➖➖➖➖➖➖➖➖
🔸మహిళలు బడికి పంపడమే గగనంగా వున్న రోజుల్లో ఏకంగా రెండు నోబెల్ బహుమతు లను గెలుచుకుని ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది ‘‘మేరీ క్యూరీ’’! ఈమె ఒక ప్రసిద్ధ భౌతిక - రసాయనిక శాస్త్రవేత్త.
🔸రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో ఈమె అందించిన అధ్బుత సేవలకుగానూ ప్రథమంగా రెండు నోబెల్ బహుమతులు లభించాయి. ఇప్పటివరకు ఏ ఇతర శాస్త్రవేత్తలకు ఇలా ఈ విధంగా రెండు రంగాలలో రెండు బహుమతులు లభించలేదు.
🔸ఆనాడు మహిళలను ఇంటినుంచి బయటకు పంపించకపోవడం, బడికి పంపకపోవడం లాంటి సమస్యలను, ఇతర కష్టాలను ఎదుర్కొంటూ ముందుకెళ్లిన ఈమె... ప్రపంచవ్యాప్తంగా వున్న మహిళల్లో ఒక వెలుగు నింపింది.
జీవిత చరిత్ర :-
〰〰〰〰
1867 నవంబర్ 7వ తేదీన పోలండ్ రాజధాని వార్సాలో నివాసమున్న బ్రోనిస్లావా - వ్లాడిస్లా స్క్లొడొస్కి అనే పోలీష్ దంపతులకు మేరీ క్యూరీ జన్మించింది. ఆ దంపతులకు కలిగిన 5మంది సంతానంలో ఈమె చిన్న అమ్మాయి. మేరీ క్యూరీ అసలు పేరు మారియా స్ల్కొడొస్క. ఈమె తన చిన్నతనంలోనే సోదరి హెలెనా, తల్లిని కోల్పోయింది. దాంతో కొన్నాళ్లపాటు తీవ్ర దిగ్ర్భాంతికి గురైన మేరీ... తర్వాత చాలా శ్రద్ధతో చదువును కొనసాగిం చింది. ఈమె చదువులో ఎంతగా నిమగ్నమైపోయేదంటే.. ఒక్కోసారి తినడం కూడా మరిచిపోయేదట! అలా ఆవిధంగా చదువుకుంటూ ఆమె తన 15వ ఏటలో తాను చదువుతున్న హైస్కూల్ లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. అయితే మేరీ అమ్మాయి కావడంవల్లో.. లేక రష్యా-పోలండ్ రాజ్యాల మధ్య గొడవల కారణంగానో తెలియదుకానీ.. అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు.
🔸అయితే చదువుకోవాలన్న సంకల్పం ఈమెలో మరింతగా పెరిగిపోయింది. మొదట పిల్లలకు బోధనలు చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఆ డబ్బులతో ఆమె వార్సా లోని ఫ్లోటింగ్ యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తూనే పారిస్ లో వైద్యం అభ్యసిస్తున్న తన సోదరికి అండగా నిలిచింది. 1891లో భోధనలు చేస్తూ కూడుకున్న ధనంతో మేరీ కూడా పారిస్ చేరుకుంది. అక్కడే ఆమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది.
🔸పార్బోన్ లో గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రా లను అభ్యసింది. (ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సార్బోన్ లోనే ఈమె 1909లో ప్రొఫెసర్ గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది). 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ను ప్రథమస్థానంలో పూర్తిచేసిన ఆమె.. ఒక సంవత్సరం తర్వాత అదే యూనివర్సిటీలో గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
🔸1903లో హెన్రి బెకెరెల్ పర్యవేక్షణలో ESPCI నుండి DSc పొందిన ఆమె... ఫ్రాన్సులో డాక్టరేటు పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు.
🔸ఇదిలావుండగా... మేరీ సార్బోన్‌లో వున్న సమయంలో అక్కడే తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. మేరీ తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్‌ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధనల వల్లనే మారియా, పియరి ఒకరినొకరు దగ్గరయ్యారు. తరువాత వారిద్దరు ఈ పరిశోధనలని రేడియోధార్మిక తపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు ‘‘పిచ్‌బ్లెండ్’’ అనే ఖనిజంపై సాగాయి. ఆ పరిశోధనల నేపథ్యంలోనే వీరిద్దరు ఈ ఖనిజంనుండి వారు యురేనియంను వేరుచేశారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో యురేనియంకన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థమని నిర్దారించారు. ఈ పరిశోధనలను వాళ్లిద్దరు 1898 డిసెంబరు 26 బయలు పరిచారు.
వ్యక్తిగత జీవితం :
🔸ఈమె తన తోటి ఇన్స్ పెక్టర్ అయిన పియరీ క్యూరీని పెళ్లాడింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి పరిశోధనలు ప్రారంభించారు. వీళ్లిద్దరూ చేసిన మొదటి పరిశోధనలకుగాను ఇద్దరికి నోబెల్ బహుమతి వచ్చింది.
🔸అలాగే వీరి కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ కూడా కొన్ని పరిశోధనలు జరిపి నోబెల్ బహుమతి గెల్చుకున్నారు. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.