Type Here to Get Search Results !

Vinays Info

రాజ్యాంగ దినోత్సవం|(సంవిధాన్ దివస్) | Indian Constitutional Day

రాజ్యాంగ దినోత్సవం|(సంవిధాన్ దివస్)
సందర్భంగా...

2015లో *భారత రాజ్యాంగ పిత* అంబేద్కర్ 125 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇకనుండి అంబేద్కర్ సేవలకు గుర్తుగా (పుట్టిన/మరణించిన రోజు కాదు) "రాజ్యాంగ దినోత్సవం "గా జరపాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు
*2015కు ముందు ఇదే రోజుని "   ఇండియన్ లా డే"గా జరుపుతున్నారు.*
🔸మన దేశము లో ప్రతి ఏటా నవంబర్ 26 న " నేషనల్ లా డే " నిర్వహిస్తారు . *1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రొజున న్యాయ దినోత్సవం నిర్వ హించాలని ప్రకటించారు.* 1949 లో భారత రాజ్యాంగ కమిటి,రాజ్యాంగ ముసాయిదా ను చేపట్టింది . కమిటీసభ్యులు 1949 నవంబరు 26 వ తీదీన తొలి ముసాయిదా ప్రతుల పై సంతకాలు చేశారు . అది 1950 జనవరి 26 వ తీదీ నుంచి అమల్లోకి వచ్చింది .
🔸 *రాజ్యాంగ మౌలిక లక్ష్యం -- సామాజిక , ఆర్ధిక , రాజకీయ న్యాయాన్ని అంద రికీ అందించడం.*
ఈ లక్ష్యము ప్రజల హక్కులకు రూపాన్ని ఇచ్చింది. ఆరోగ్య వంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించేం దుకు స్వతంత్ర ప్రతిపత్తి గల , సమర్ధవంత మైన న్యాయాన్ని ఇవ్వగల వ్యవస్థ అవసరము . చట్టము ముందు సమాన పరిగణన , వ్యక్తిగత స్వేచ్చ వంటి అంశాల అధ్యయనము ద్వారాభారతీయ న్యాయ వ్యవస్థ కీలక సామాజిక పాత్ర ను బలోపేతము చేయడం జరిగినది .
🔸ముఖ్యముగా గత మూడు దశాబ్దాలలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పి.ఐ.యల్) ఉద్యమ వికాసము తర్వాత ఇది మరింతగా బలపడింది . హక్కుల అవగాహనను వివిధ దశల్లో విసృత పరిచారు . ప్రాధమిక హక్కులకు పెద్దపీట వేశారు . వీటన్నింటికీ రక్షణ న్యాయవవస్థ . . . *కాబట్టి రాజ్యాంగ ముసాయిదా సంతకాల రోజును 'జాతీయ న్యాయదినోత్సవాన్ని' జరపడానికిఎంచుకున్నారు.*
🔸ఈ దినోత్సవము నాడు న్యాయవాదు లు సమావేశమై ప్రతిజ్ఞ చేస్తారు . *చట్టము ముందుఅందరూసమానమేననితెలియజేయడం ,సత్వరన్యాయముకోసముకృషిచేయడం ..న్యాయదినోత్సవ ధ్యేయాలు.*
🔸ప్రభుత్వాలు చట్టాలు ప్రజా వ్యతిరేకము గా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవి గా ఉన్నా అవి చెల్లవని చెప్పే అధికారం రాజ్యాంగ ధర్మాసనా లకు ఉన్నది .. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులకు కూడా చట్ట హోదా ఉంటుంది .
🔸మనదేశము లో న్యాయ మూర్తుల కొరత ఉన్నందున కేసుల పరిష్కారము సత్వరం జరుగుటలేదు . కేసు పరిష్కా రానికి చాలా కాల వ్యవధి పడుతున్నది . న్యాయము అందడము లో జాప్యము జరుగుతుందన్న కారణముగా చాలా మంది కోర్టుల్ని ఆశ్రయి చడానికి సందేహిస్తుంటారు . అయితే న్యాయవాద వృత్తిలో ఉన్న వారంతా చట్టబద్దము గా సమస్యలను పరిష్కరించుకో వాల్సిందిగా ప్రజల్ని చైతన్య పరచాల్సిన అవసరము ఉన్నది .
🔸ఈ మేరకు ప్రజల్లోవిశ్వాసం పెంపొందించగలగాలి . ఆప్పుడే న్యాయ పరిరక్షణ సంపూరణము కాగలదు ... న్యాయదినోత్సవం నిర్వహణ ప్రక్రియ ఫలవంతంగా ఉండగలదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section