''సంస్కృతి అనేది దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుండి దిగుమతి చేసుకుం దాం'' అని సర్ థామస్ మన్రో ఆనాడు బ్రిటీష్ వారికి సూచించాడు. సంస్కృతి ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కో దేశానికి, ఖండానికి ఖండానికి భిన్నంగా ఉంటుంది. సంస్కృతి కాలానుగుణంగా వస్తున్న మార్పులను తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి నేడు తటస్థిస్తున్నది. గొప్ప సంస్కారం నాగరికత ఎంతో ప్రాచీన కాలం నుండే భారతదేశం కలిగి ఉందని ప్రాచీన వాజ్మయ ఆధారాలు తెలియజేస్తున్నాయి. కళలు, సాహిత్యం వికసించింది ఈ నేలలోనే. సాంప్రదాయాలు చేయ వలసిన పనులను సూచిస్తాయి. అందుకే వివిధ గొప్ప దేవాలయాలలో సంగీత నృత్య శిల్పాలను శిల్పీకరిం చారు. చరిత్ర వారసత్వం, సంస్కృతి నాగరికత అన్నీ జిజ్ఞాస అనే అంతర్ సూత్రంతో బంధించి ఉన్నాయి. నదిలోయల వద్ద కళలు వికసించాయి. అవి ఒక తరం నుండి ఇంకో తరానికి వారసత్వంగా అందించడం జరుగుతుంది. ఉపనిషత్‌లు చదువుతూ ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి భారత్ ఎదిగింది. కళలకు అంజలి ఘటించి గీతాంజలి పూయించిన నేల మనది.
*సంగీతరంగం*: భారతదేశంలో సంగీతానికి ఎంతో ప్రాధా న్యత ఉంది. సామవేదం సంగీతాన్ని విపులంగా వివరిస్తూ దేవతార్చనకు ఆనాడు ఉపయోగపడింది. అదే సంగీతం విప్లవగీతాలు, భక్తి గీతాలుగా, జాతీయగీతాలుగా పరిణితి చెందింది. సప్త స్వరాలు భారతీయ సంగీతంలో ఉన్నాయి.
అవి
స- షడ్జమం అంటే నెమలి క్రేంకారం
రి- రిషభం ఎద్దు రంకె
గ- గాంధర్వం మేక అరుపు
మ- మథ్యమం క్రౌంచపక్షి కూత
ప - పంచమం కోయిల కూత
ద- దైవత్వం గుర్రం సకిలింత
ని- నిషాదం ఏనుగు ఘీంకారం
ఇలా ప్రకృతి నుండి సంగీతాన్ని సొంతం చేసుకున్నాడు మానవుడు. రాగం అనేది శ్రావ్యానికి ప్రాతిపదిక, తాళం అనగా లయను సూచించే కాలమానం. భారతీయ సంగీతంలో 32 రకాల తాళాలు 120 రకాల తాళ సమ్మేళనాలు ప్రదర్శిస్తారని తెలుస్తోంది. భక్తి ఉద్యమ కారులు తమ భావాలను సంగీతంతో మేళవించి భక్తి మార్గాన్ని బోధించారు. కబీర్ తన దోహాలను పాడారు. ఆయన సంగీతాన్ని హిందూ, ముస్లిం మైత్రికి ఉపయో గించారు. మీరాబాయి కూడా తన భావాలకు సంగీతాన్ని ఆపాదించారు. త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, భక్త రామదాసు గానామృతాన్ని పంచి భక్తి భావాన్ని పెంచారు. అందుకే విజయనగర రాజులు సంగీతం పలికే రాళ్లతో హంపిలో విఠలేశ్వరాలయాన్ని నిర్మించారు. మేఫ్‌ు మల్హర్ రాగంతో తాన్‌సేన్ ఆలపిస్తే వర్షాలు కురిసేవని.. సంగీతానికి అంత శక్తి ఉందని అంటారు. జయదేవుడు గీతా గోవిందం ద్వారా కృష్ణలీలలను వివరించారు. పురంధర దాసు, శ్యామ శాస్త్రి, త్యాగయ్య కర్నాటక సంగీతానికి పల్లకి మోసిన బోయీలని చెప్పవచ్చు. ఈ ముగ్గురిని సంగీత త్రయం అంటారు. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిరసం గాన ఫణిహి '' అనేది ఆర్యోక్తి.
బండారు లక్ష్మినారాయణ కవి సంగీత సూర్యోదయంలో అనేక అంశాలను వివరించారు. జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం అని రెండు రకాలుగా సంగీతాన్ని విభజించవచ్చు. శాస్త్రీయ సంగీతంలో 2 రాగాలు ప్రధానమైనవి. హిందూస్థానీ సంగీతంలో తాళం ఉండదు. తాన్‌సేన్ అక్బర్ కాలంనాటి గొప్ప సంగీత విద్వాంసుడు. ఈయన అసలు పేరు రామ్ తనూపాండే. అమీర్ ఖుస్రూ ఢిల్లీ సుల్లానుల కాలంలో వివిధ సంగీత పరికరాలను కనిపెట్టి సంగీతాన్ని విస్తరించాడు. ఇతనిని 'భారతదేశ రామచిలుక' అని కూడా పిలుస్తారు. పిరోజ్‌షా తుగ్లక్ రాగదర్పణ్ అనే గ్రంథాన్ని పర్షియా భాషలోకి అనువదించాడు. ఆధునిక కాలంలో కూడా సంగీత నాటక అకాడమి తన పరిధిలో సంగీతాన్ని విస్తరింపజేస్తుంది. బిస్మిల్లాఖాన్, యం.ఎస్. సుబ్బులక్ష్మిలాంటి వారు భారతరత్న పొందిన సంగీతకారులు.
భారతదేశంలో 1952 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమిని స్థాపించి సేవలందిస్తుంది.
*కర్నాటక సంగీతంలో ప్రముఖులు*
1. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
2. యం.యల్. వసంతకుమారి
3. యం.డి రామనాథం
4. మంగళంపల్లి బాలమురళి కృష్ణ
5. సెమ్మం గుడి శ్రీనివాస అయ్యంగార్
*హిందూస్థానీ సంగీతం - ప్రముఖులు*
1. కుమార గంధర్వ
2. భీమ్‌సేన్ జోషీ
3. మల్లిఖార్జున
*సంగీత వాయిద్యాలు ప్రముఖులు*
షెహనారు : బిస్మిల్లాఖాన్
బడే గులాం అలీ
వేణువు: పండిత్ హరిప్రసాద్ చౌరాసియా
మహాలింగం
పన్నాలాల్ ఘోష్
మృదంగం: యల్లా వెంకటేశ్వర రావు
పాల్ఘాట్ రఘు
పాల్ఘాట్ మణి
నాదస్వరం: షేక్ చినమౌలానా
వీరుస్వామి పిళ్ళై
వీణ : చిట్టిబాబు
ఈమని శంకరశాస్త్రి
కె.కె. భవతార్
యస్. బాలచందర్
అతి ప్రాచీన సంగీత సాధనం వీణ
సరోద్: అంజాద్ అలీఖాన్
అలీ అక్బర్ ఖాన్
శారదారాణి
సితార్ : పండిట్ రవిశంకర్
అనౌష్కా శంకర్
షహీద్ పర్వీన్
తబలా : జాకీర్ హుస్సేస్
లతీఫ్ ఖాన్
శాంతి ప్రసాద్
గిటార్ : విశ్వమోహన్ భట్
సంతూర్ : పండిత్ శివకుమార్ శర్మ
వివిధ రాగాలు : కీరవాణి రాగం
హిందోళ రాగం
కల్యాణి రాగం
చారుకేసి రాగం
భైరవ రాగం మొదలైనవి.
మొగల్ సామ్రాజ్య చరిత్రలో జౌరంగజేబు మాత్రం తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. సూఫీ మతం లో కూడా సంగీతానికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది. చిష్టి శాఖకు చెందిన అమీర్ ఖుస్రూ ' నేను ఇంత మధురంగా గానం చేయడానికి గల కారణం భారతదే శంలో నివసించడమే అని దేశాన్ని కీర్తించాడు. రుద్రవీణ, సితార లాంటి సంగీత సాధనాలను కనుగొన్నాడు.