Type Here to Get Search Results !

Vinays Info

నేడు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం | World Standards Day - October -14

🔹వస్తువులన్నింటికీ నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి

🔹ప్రపంచ వినియోగదారులకు ప్రామాణికమైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు చట్టబద్దమైన అధికారాల ద్వారా నిర్ధేశించేందుకు 1946లో లండన్‌లో అక్టోబర్‌ 14వ తేదీన అంతర్జాతీయ ప్రామాణికరణ సంస్థ ఏర్పాటైంది.

🔹25మంది సభ్యులతో ప్రారంభించిన ఈ సంస్థలో ప్ర స్తుతం 125 సభ్యదేశాలు ఉన్నాయి.

🔹1947లో భారతదేశంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ చట్టాన్ని ఆమోదించి బ్యూరోను ఒక శాసన బద్దమైనా సంస్థగా మార్చారు. అప్పటి నుంచే ఐ.ఎస్‌ .ఐ ముద్ర ప్రకటితమైంది. ఈ ముద్ర గల వస్తువులు నాణ్యత కలిగినది.

🔹1947లో భారతీయ ప్రమాణాల సంస్థ మొదటి రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. ఒకటి బట్టలకు, రెండవది ఇంజనీరింగ్‌కు సబంధించినది. ఈ సంస్థ నిర్ణయించిన తొలి ప్రమాణం ఏమిటోతెలుసా, మన జాతీయ పతాకం ఎంత పొడవు, వెడల్పు ఉండాలన్నది ఈ సంస్థ నిర్ణయించింది.

🔹1951లో ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సంస్థ కార్యాలయంలో స్వీకరించారు.

🔹అంతే కాదు మెట్రిక్‌ విధానాన్ని దేశంలో 1955లో ప్రవేశపెట్టారు. తర్వాత తూనికలు, కొలతల పరిమాణాన్ని చట్టాన్ని ఆమోదించింది. కాలక్రమంలో టెలి కమ్యూని కేషన్స్‌ టీకాలు, నూనెగింజలు, త్రాగునీరు, పాడి పరిశ్రమ వంటివి కూడా ఈ సంస్థ పరిధిలోకి చేర్చారు. ఐఎస్‌ఐ మార్కు సంస్థ అనుమతి లేనిదే ఎవరూ వాడకూడదు అన్ని సాంకేతిక పరీక్షలు, తనిఖీలు నిర్వహించిన దరిమిలా ఒక సంవత్సరానికి ఐఎస్‌ఐ లైసెన్స్‌ ఇస్తుంది. ప్రతీ సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాలి.

🔹ప్రమాణాలు నిర్ణయించడానికి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు ఈ రోజునే ప్రారంభించాయి. కనుక ఈ రోజున వరల్డ్‌ స్టాండర్స్‌డే గా జరుపుకుంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section