తెలంగాణ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. కొత్త ఆశలు.. సరికొత్త విజయాలతో 31 జిల్లాల నవ శకానికి నాంది పలికారు సీఎం కేసీఆర్. సుపరిపాలన.. ప్రజల దగ్గరకే ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత లక్ష్యంగా 10 జిల్లాలకు కొత్త రూపు ఇచ్చారు.
By : VinayKumar Mukkani
👉అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు 31 జిల్లాలకు విస్తరణతో నవ తెలంగాణ ఆవిష్కృతం అయ్యింది.
👉21 కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు ఉనికిలోకి వచ్చాయి.
👉మొత్తం 31 జిల్లాలతో.. 68 డివిజన్లతో.. 584 మండలాలతో కొత్త తెలంగాణ ఆవిష్కారం అయ్యింది.
👉ఆదిలాబాద్ జిల్లా - Adilabad District
🔹జనాభా : 7లక్షల 8వేల 952
🔹విస్తీర్ణం : 4వేల 185.97 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 18
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ (కొత్త), మావల (కొత్త), గుడిహత్నూర్, బజార్ హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, భీంపూర్ ( కొత్త ), తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ (కొత్త)
🔹ఉట్నూరు : ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ (కొత్త), ఊట్నూరు
ప్రత్యేకతలు : ఇంద్రవెల్లి, సాత్నాల మత్తడివాగు, కుంటాల, పొచ్చెర జలపాతాలు
👉మంచిర్యాల జిల్లా - Machiryala District
🔹జనాభా : 8లక్షల 7వేల 037
🔹విస్తీర్ణం : 4వేల 056.36 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 18
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹మంచిర్యాల : చెన్నూర్, జైపూర్, భీమారం (కొత్త), కోటవల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నన్పూర్ (కొత్త), హాజీపూర్ (కొత్త), మందమర్రి, దండేపల్లి, జన్నారం
🔹బెల్లంపల్లి (కొత్త) : కాసిపేట, బెల్లంపల్లి, మేమునపల్లి, నెన్నెల, తాండూర్, భీమిలి, కన్నెపల్లి (కొత్త)
🔹ప్రత్యేకతలు : మందమర్రి, బెల్లంపల్లి బొగ్గుగనులు, గొల్లవాగు, నిల్వాయి వాగు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ర్యాలీ వాగు, కవ్వాల్ అభయారణ్యం
👉నిర్మల్ జిల్లా - Nirmal District
🔹జనాభా : 7లక్షల 9వేల 415
🔹విస్తీర్ణం : 3వేల 562.51 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 18
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹నిర్మల్ : నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్ (కొత్త), సోన్ (కొత్త), దిలావర్ పూర్, నర్సాపూర్-జి (కొత్త), కడెంపెద్దూర్, దస్తూరాబాద్ (కొత్త), ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగపూర్
🔹బైంసా (కొత్త) : కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, బాసర(కొత్త), లోకేశ్వరం, తానూర్
🔹ప్రత్యేకతలు : బాసర పుణ్యక్షేత్రం, నిర్మల్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు
👉ఆసిఫాబాద్ (కొమురంభీం జిల్లా) - Asifabad (Komaram Bheem District)
🔹జనాభా : 5లక్షల 15వేల 835
🔹విస్తీర్ణం : 4వేల 300.16 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 15
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹ఆసిఫాబాద్ : సిర్పూర్(యు), లింగాపూర్, జైసూర్, తిర్యాణి, ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి
🔹కాగజ్ నగర్ (కొత్త) : బెజ్జూరు, కాగజ్ నగర్, సిర్పూర్-టి, దహెగాం, కౌటాల, చింతలమానేపల్లి (కొత్త), పెంచికల్ పేట (కొత్త)
🔹ప్రత్యేకతలు : వట్టివాగు ప్రాజెక్టు, ఎర్రవాగుప్రాజెక్టు, తుమ్మడిహట్టి ప్రాజెక్టు, ప్రాణహిత నది, కొమురంభీం ప్రాజెక్టు
👉కరీంనగర్ జిల్లా - Karimnagar District
🔹జనాభా : 10లక్షల 16వేల 063
🔹విస్తీర్ణం : 2వేల 379.07 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 16
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹కరీంనగర్ : కొత్తపల్లి, కరీంగనర్, కరీంనగర్ రూరల్ (కొత్త), మానకొండూర్, తిమ్మాపూర్, వడ్లూరు-బేగంపేట, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి
🔹హుజూరాబాద్ (కొత్త) : వీణవంక, వి.సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జిమ్మికుంట, ఇల్లంతకుంట
🔹ప్రత్యేకతలు : ఎలగందుల ఖిల్లా, లోయర్ మానేరు డ్యాం
👉జగిత్యాల జిల్లా - Jagityala District
🔹జనాభా : 9లక్షల 83వేల 414
🔹విస్తీర్ణం : 3వేల 043.23 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 18
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹జగిత్యాల : జగిత్యాల, జగిత్యాల రూరల్ (కొత్త), రాయికల్, సారంగపూర్, బీర్ పూర్ (కొత్త), ధర్మపురి, బుగ్గారం (కొత్త), పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్
🔹మెట్ పల్లి (కొత్త) : కోరుట్ల, మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్
🔹ప్రత్యేకతలు : ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, కోటి లింగాల
👉పెద్దపల్లి జిల్లా - Peddapally District
🔹జనాభా : 7లక్షల 95వేల 332
🔹విస్తీర్ణం : 4వేల 614.74 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 14
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹పెద్దపల్లి : పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం (కొత్త), పాలకుర్తి (కొత్త), శ్రీరాంపూర్
🔹మంథని : కమాన్ పూర్, రత్నాపూర్ (కొత్త), మంథని, ముత్తారం (మంథని)
🔹ప్రత్యేకతలు : ధూళికట్ట బౌద్ధారామం, రామగిరి ఖిల్లా, రామగుండం సింగరేణి గనులు, ఎన్టీపీసీ, జెన్కో పవర్ ప్లాంట్, రామగుండం ఎరువుల కర్మాగారం, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్, ఎల్లంపల్లి ప్రాజెక్టు
👉సిరిసిల్ల (రాజన్నజిల్లా) - Sirisilla District
🔹జనాభా : 5 లక్షల 46 వేల 121
🔹విస్తీర్ణం : 2 వేల 30.89 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 13
🔹రెవెన్యూ డివిజన్లు : 1
🔹సిరిసిల్ల: సిరిసిల్ల రూరల్ (కొత్త), వేములవాడ, వేములవాడ రూరల్ (కొత్త), చందుర్తి, రుద్రంగి (కొత్త), కోసరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతుకుంట, బోయినపల్లి, వీర్నపల్లి (కొత్త)
🔹ప్రత్యేకతలు : వేములవాడ దేవాలయం, మిడ్ మానేరు ప్రాజెక్టు, అప్పర్ మానేరు ప్రాజెక్టు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
👉మహబూబ్ నగర్ జిల్లా - Mahabubnagar District
🔹జనాభా : 13 లక్షల 18 వేల 110
🔹విస్తీర్ణం : 4 వేల 37.89 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 21
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹మహబూబ్ నగర్: మూసాపేట (కొత్త), భూత్పూరు, హాన్వాడ, కోయిల్ కొండ, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ రూరల్ (కొత్త), నవాబ్ పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్(కొత్త), గండేడ్, దేవరకద్ర,
🔹నారాయణ్ పేట్: నారాయణ్ పేట్, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వా
ప్రత్యేకతలు : పిల్లల మర్రి, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, జటప్రోలు సంస్థానం
👉వనపర్తి జిల్లా - Wanaparthy District
🔹జనాభా : 7 లక్షల 51 వేల 533
🔹విస్తీర్ణం : 2 వేల 938.00 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 17
🔹రెవెన్యూ డివిజన్లు : ఒకటి
🔹వనపర్తి: వనపర్తి, గోపాలపేట, పెద్దముందడి, ఘన్ పూర్, కొత్తకొట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, చిన్నచింతకుంట, ఆత్మకూర్, అమరచింత(కొత్త), మదనపూర్(కొత్త), కోడేరు, అడ్డాకుల, ఆలంపూర్, ఉండవెల్లి(కొత్త), ఏదుల(కొత్త)
🔹ప్రత్యేకతలు : జోగులాంబ ఆలయం, శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ
👉నాగర్ కర్నూలు జిల్లా - Nagarkarnul District
🔹జనాభా : 8లక్షల 93వేల 308
🔹విస్తీర్ణం : 6వేల 545 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 22
🔹రెవెన్యూ డివిజన్లు : 3
🔹నాగర్ కర్నూలు : బిజేనేపల్లి, నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, కొల్లాపూర్, చిన్నంబావి (కొత్త), పెంటవెల్లి (కొత్త)
🔹కల్వకుర్తి (కొత్త) : కల్వకుర్తి, మిడ్జిల్, ఉరకొండ (కొత్త), వెల్దండ, వంగూర్, చారకొండ (కొత్త)
🔹అచ్చంపేట (కొత్త) : అచ్చంపేట, అమ్రాబాద్, పదర (కొత్త), బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, సిద్దాపూర్ (కొత్త)
🔹ప్రత్యేకతలు : సోమశిల ఘాట్, నల్లమల అటవీప్రాంతం, గుడిపల్లి రిజర్వాయర్, వట్టెం రిజర్వాయర్
👉గద్వాల జిల్లా (జోగులాంబ) - Gadwala District
🔹జనాభా : 6లక్షల 64వేల 971
🔹విస్తీర్ణం : 2వేల 928 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 13
🔹రెవెన్యూ డిజవిన్లు : ఒకటి
🔹గద్వాల : గద్వాల, ధరూర్, గట్టు, మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, నందిన్నె(కొత్త), రాజోలి(కొత్త), కృష్ణ (కొత్త), మాగనూర్, మక్తల్
🔹ప్రత్యేకతలు : జురాల ప్రాజెక్టు, రాజోళిబండ డైవర్షన్ స్కీమ్, బీచ్ పల్లి ఆంజనేయస్వామి ఆలయం
👉వరంగల్ అర్బన్ జిల్లా (12) - Warangal Orban District
🔹జనాభా : 11లక్షల 35వేల 707
🔹విస్తీర్ణం : వెయ్యి 304.5 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 12
🔹డివిజన్లు : ఒకటి
🔹వరంగల్ : వరంగల్, భిలా వరంగల్ (కొత్త), హన్మకొండ, కాజీపేట(కొత్త), హసన్ పర్తి, ఐనవోలు(కొత్త), ధర్మసాగర్, వేలేరు(కొత్త), భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, ఇల్లంతకుంట (కొత్త)
🔹ప్రత్యేకతలు : కాకతీయుల కళాతోరణం, కాకతీయుల కోట, వెయ్యిస్థంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం
👉వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా (14) - Warangal Rural District
🔹జనాభా : 7లక్షల 16వేల 457
🔹విస్తీర్ణం : 2వేల 175.5 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 14
🔹డివిజన్లు : 2
🔹వరంగల్ రూరల్ (కొత్త) : రాయపర్తి, వర్థన్నపేట, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, గీసుకొండ, సంగెం, పర్వతగిరి
నర్సంపేట : నర్సన్నపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ
🔹ప్రత్యేకతలు : ఐనవోలు మల్లన్న దేవాలయం, పాకల సరస్సు
👉భూపాలపల్లి (జయశంకర్) జిల్లా ( 19) - Bhupalapally District
🔹జనాభా : 7లక్షల 12వేల 257
🔹విస్తీర్ణం : 6వేల 361.7 చదరపు కిలోమీటర్లు 🔹మండలాలు : 19
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹భూపాలపల్లి : భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల (కొత్త), మొగుళ్లపల్లి, రేగొండ, ఘన్ పూర్ (ములుగు), మల్హర్ రావు, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల (కొత్త)
🔹ములుగు : ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం(కొత్త), మంగపేట, వెంకటాపురం (ఖమ్మం), వాజేడు
🔹ప్రత్యేకతలు : సింగరేణి బొగ్గు గనులు, కేటీపీపీ, గణపసముద్రం, రామప్పదేవాలయం, లక్నవరం సరస్సు, దేవాదుల ప్రాజెక్టు, గుండ్లవాగు, సమ్మక్క-సారలమ్మ జాతర
👉మహబూబాబాద్ జిల్లా - Mahabubnagar District
🔹జనాభా : 7లక్షల 70వేల 170
🔹విస్తీర్ణం : 2వేల 876.7 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 16
🔹డివిజన్లు : 2
🔹మహబూబాబాద్ : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, డోర్నకల్, కురవి, బయ్యారం, గార్ల, గంగారం (కొత్త)
🔹తొర్రూరు (కొత్త) : నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, చిన్నగూడూరు (కొత్త), దంతాలపల్లి (కొత్త), పెద్దవంగర(కొత్త),
🔹జనగాం జిల్లా - Janagam District
🔹జనాభా : 5లక్షల 82వేల 457
🔹విస్తీర్ణం : 2వేల 187.5 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 13
🔹డివిజన్లు : 2
🔹జనగామ : జనగామ, లింగాల ఘన్ పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల(కొత్త), రఘునాథ్ పల్లి, గుండాల
🔹స్టేషన్ ఘన్ పూర్ (కొత్త) : స్టేషన్ ఘన్ పూర్, చిల్పూరు (కొత్త), జఫర్ గఢ్, పాలకుర్తి, కొడకండ్ల
🔹ప్రత్యేకతలు : పోతన పుట్టిన బమ్మెర గ్రామం, హస్తకళలకు కేరాఫ్ పెంబర్తి, సీఎస్ఐ చర్చి
👉సిద్దిపేట జిల్లా - Siddipet District
🔹జనాభా : 9లక్షల 93వేల 376
🔹విస్తీర్ణం : 3వేల 425.19 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 22
🔹డివిజన్లు : 2
🔹సిద్దిపేట : సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ (కొత్త), సంగునూర్, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, హుస్నాబాద్ అర్బన్, హుస్నాబాద్ రూరల్ (అంతక్కపేట), కోహెడ, బెజ్జంకి
🔹గజ్వేల్ (కొత్త) : గజ్వేల్, జగదేవ్ పూర్, కొండపాక, ములుగు, మర్కూక్ (కొత్త), రాయపోల్ (కొత్త), చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి (కొత్త), వర్గల్
🔹ప్రత్యేకతలు : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్, కొమురెల్లి మల్లన్న దేవాలయం, కొత్తగా పోలీస్ కమిషనరేట్
👉మెదక్ జిల్లా - medak District
🔹జనాభా : 7లక్షల 67వేల 428
🔹విస్తీర్ణం : 2వేల 470.89 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 20
🔹డివిజన్లు : 3
🔹మెదక్ : మెదక్, హవేలీ ఘన్ పూర్ (కొత్త), పాపన్నపేట, శంకరంపేట రూరల్, శంకరంపేట(ఏ), టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు
🔹తూఫ్రాన్ (కొత్త) : రామాయంపేట, నిజాంపేట (కొత్త), ఎల్దుర్తి, చేగుంట, తూఫ్రాన్, మనోహరాబాద్ (కొత్త), నార్సింగ్ (కొత్త)
🔹నర్సాపూర్ (కొత్త) : నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కుల్చారం, చిల్పిచేడ్ (కొత్త)
🔹ప్రత్యేకతలు : మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం
👉సంగారెడ్డి జిల్లా - Sangareddy District
🔹జనాభా : 15లక్షల 27వేల 628
🔹విస్తీర్ణం : 4వేల 464.87 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 26
🔹డివిజన్లు : 3
🔹సంగారెడ్డి : సంగారెడ్డి, కంది (కొత్త), కొండాపూర్, సదాశివపేట, పటాన్ చెరు, అమీన్ పూర్ (కొత్త), రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల (కొత్త), పుల్కల్, ఆంథోల్, వట్ పల్లి (కొత్త), మునిపల్లి, హత్నూర
🔹జహీరాబాద్ (కొత్త) : జహీరాబాద్, మొగుడంపల్లి (కొత్త), న్యాలకల్, ఝరాసంఘం, కోహిర్, రాయ్ కోడ్
🔹నారాయణఖేడ్ (కొత్త) : నారాయణఖేడ్, కుంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ (కొత్త), మనూర్, నాగిల్ గిద్ద (కొత్త)
🔹ప్రత్యేకతలు : సింగూరు ప్రాజెక్టు, సంగమేశ్వరాలయం
👉నిజామాబాద్ జిల్లా - Nizamabad District
🔹జనాభా : 15లక్షల 34వేల 428
🔹విస్తీర్ణం : 4వేల 153 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 26
🔹రెవెన్యూ డివిజన్లు : 3
🔹నిజామాబాద్ : నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్ (కొత్త), నిజామాబాద్ రూరల్ (కొత్త), ముగ్పల్ (కొత్త), డిచ్ పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి (కొత్త), జక్రాన్ పల్లి, సిరికొండ, నవీపేట
🔹ఆర్మూర్ : ఆర్మూర్, బాల్కొండ, మెండోరా (కొత్త), ఆలూరు (కొత్త), కమ్మర్ పల్లి, వేల్పూరు, మోర్తాడ్, భీంగల్, నందిపేట, మాక్లూర్
🔹బోధన్ : రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, రుద్రూరు (కొత్త), కోటగిరి, ఆర్మూర్,
👉కామారెడ్డి జిల్లా - Kamareddy District
🔹జనాభా : 9లక్షల 72వేల 625
🔹విస్తీర్ణం : 3వేల 651
🔹మండలాలు : 20
🔹రెవెన్యూ డివిజన్లు : 3
🔹కామారెడ్డి : కామారెడ్డి, బిక్కనూరు, రాజంపేట(కొత్త), దోమకొండ, బీబీపేట (కొత్త), మాచారెడ్డి, రామారెడ్డి (కొత్త), సదాశివనగర్, తాడ్వాయి
🔹బాన్సువాడ (కొత్త) : బాన్సువాడ, బిర్కూర్, బిచ్ కుంద, జుక్కల్, మద్ నూర్, నిజాంసాగర్, పిట్లం, పెద్దకోడప్ గల్ (కొత్త)
🔹ఎల్లారెడ్డి (కొత్త) : ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి
👉నల్గొండ జిల్లా - Nalgonda District
🔹జనాభా : 16లక్షల 31వేల 399
🔹విస్తీర్ణం : 2వేల 449.79 చ.కిలోమీటర్లు
🔹మండలాలు : 31
🔹రెవెన్యూ డివిజన్లు : 3
🔹నల్గొండ : చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్, నల్గొండ, నార్కెట్ పల్లి, తిప్పర్తి, కేతేపత్తి, శాలిగౌరారం, గట్టుప్పల్
🔹మిర్యాలగూడ : దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల(హాలియా), నిడమనూరు, పెదవూర, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి(సాగర్)
🔹దేవరకొండ : చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి(డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పెద్ద అడిశర్లపల్లి(పీఏ పల్లి), నేరేడుగొమ్ము
🔹ప్రత్యేకతలు : దేవరకొండ ఖిల్లా, మూసీ ప్రాజెక్టు, ఎస్ఎల్ బీసీ, నాగార్జున సాగర్, బుద్ధవనం, ఉదయ సముద్రం
👉సూర్యాపేట జిల్లా - Surya peta District
🔹జనాభా : 10లక్షల 99వేల 560
🔹విస్తీర్ణం : వెయ్యి 415.68 చ.కిలోమీటర్లు
🔹మండలాలు : 23
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹సూర్యాపేట : ఆత్మకూరు(ఎస్), చివ్వెంల, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, పెన్ పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు
🔹కోదాడ : చిలుకూరు, హుజూర్ నగర్, కోదాడ, మట్టపల్లి, మేళ్లచెరరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)
🔹ప్రత్యేకతలు : హుజుర్ నగర్, కోదాడ పారిశ్రామిక ప్రాంతాలు, దురాజ్ పల్లి లింగమంతుల జాతర, మట్టపల్లి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రం, జాన్ పహడ్ దర్గా
👉యాదాద్రి జిల్లా - Yadadri District
🔹జనాభా : 7లక్షల 26వేల 465
🔹విస్తీర్ణం : 3వేల 091.48 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 15
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹భువనగిరి : ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు
🔹చౌటుప్పల్ : బి.పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపూర్
🔹ప్రత్యేకతలు : లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, భువనగిరి పారిశ్రామికి కారిడార్, కొలనుపాక జైన టెంపుల్, భూదాన్ పోచంపల్లి
👉ఖమ్మం జిల్లా - Khammam District
🔹జనాభా : 14లక్షల వెయ్యి 639
🔹విస్తీర్ణం : 8వేల 951 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 21
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹ఖమ్మం : బోనకల్, చింతకాని, కామేపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, కూచిమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, రఘునాథపాలెం, సింగరేణి, తిరుమలాయపాలెం, మధిర, ఎర్రుపాలెం
🔹కల్లూరు : ఏన్కూరు, కల్లూరు(కొత్త), పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, వైరా
🔹ప్రత్యేకతలు : పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్, నేలకొండపల్లి కంచర్ల గోపన్న జన్మస్థలం
👉భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా - Badradri District
🔹జనాభా : 13లక్షల 4వేల 811
🔹విస్తీర్ణం : 8వేల 951 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 24
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹భద్రాచలం : అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక, వెంకటాపురం, కరకగూడెం
🔹కొత్తగూడెం : అశ్వరావుపేట, చండ్రుకొండ, దమ్మపేట, గుండాల, కొత్తగూడెం, ముల్కలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఆళ్లపల్లి, అనర్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు
🔹ప్రత్యేకతలు : భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ పేపర్ బోర్డు, భారజల కర్మాగారం, సింగరేణి బొగ్గు గనులు, కిన్నెరసాని ప్రాజెక్టు, భద్రాద్రి రామాలయం, పర్ణశాల, బొగత జలపాతం
👉వికారాబాద్ జిల్లా - Vikarabad District
🔹జనాభా : 8లక్షల 81వేల 250
🔹విస్తీర్ణం : 3వేల 385 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 17
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹వికారాబాద్ : మర్పల్లి, మోమిన్ పేట్, నవాబ్ పేట, వికారాబాద్, పూడూరు, కులకచర్ల, దోమ, పరిగి, దారూరు, కోటపల్లి (కొత్త), బంట్వారం
🔹తాండూరు (కొత్త) : పెద్దేముల్, యాలాల, కొడంగల్, బొంరాసిపేట్, బషీరాబాద్, తాండూరు
🔹ప్రత్యేకతలు : అనంతగిరి కొండలు, కందులు, మసాలాలు పండించే ప్రాంతం
శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లా - Shamshabad District
🔹జనాభా : 25లక్షల 51వేల 731
🔹విస్తీర్ణం : ఒక వెయ్యి 038 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 26
🔹రెవెన్యూ డివిజన్లు : 4
🔹చేవేళ్ల : శంకరపల్లి, మొయినాబాద్, షాబాద్, చేవేళ్ల, కొందుర్గు, చౌదరిగూడెం (కొత్త)
🔹రాజేంద్రనగర్ : శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట (కొత్త), శంషాబాద్, కొత్తూరు, ఫరూఖ్ నగర్, కేశంపేట
🔹కందుకూరు (కొత్త) : సరూర్ నగర్, బాలాపూర్ (కొత్త), మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్ (కొత్త), ఆమనగల్, తల్లకొండపల్లి,
🔹ఇబ్రహీంపట్నం (కొత్త) : హయత్ నగర్, అబ్దుల్లాపూర్ (కొత్త), ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్
🔹ప్రత్యేకతలు : అంతర్జాతీయ విమానాశ్రయం, చిలుకూరు బాలాజీ టెంపుల్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్,
జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ, జూపార్క్, అప్పా
👉మేడ్చల్ జిల్లా - Medchal District
🔹జనాభా : 25లక్షల 42వేల 203
🔹విస్తీర్ణం : 5వేల 005.98 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 14
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹మల్కాజిగిరి : అల్వాల్ (కొత్త), మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ (కొత్త), బాచుపల్లి (కొత్త), బాలానగర్, కూకట్ పల్లి (కొత్త)
కీసర (కొత్త) : మేడ్చల్, శామీర్ పేట్, కీసర, కాప్రా, ఘట్ కేసర్, మేడిపల్లి (కొత్త), ఉప్పల్
🔹ప్రత్యేకతలు : కీసర టెంపుల్
హైదరాబాద్ జిల్లా - Hyderabad Dist
🔹జనాభా : 34లక్షల 41వేల 992
🔹విస్తీర్ణం : 4వేల 325.29 చదరపు కిలోమీటర్లు
🔹మండలాలు : 16
🔹రెవెన్యూ డివిజన్లు : 2
🔹అంబర్ పేట, ఆసిఫ్ నగర్, బహదూర్ పుర, బండ్లగూడ, చార్మినార్, గొల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్, అమీర్ పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్ పేట్, తిరుమలగిరి, మారేడుపల్లి