Type Here to Get Search Results !

Vinays Info

Indian History Practice Bits : 02

1. హర్షుడు మరణించిన సంవత్సరం - క్రీ.శ. 647.(పుష్యభూతివంశస్థుడు)
2. ఢిల్లీ సుల్తానత్‌ స్థాపించిన సంవత్సరం -క్రీ.శ. 1206 (1526 అంతం)
3. క్రీ.శ 647-క్రీ.శ. 1206 మధ్య కాలానికి గల పేరు -రాజపుత్ర/రసపుత్రయుగం
4. రాజపుత్రుల చరిత్రపై విస్తృతమైన పరిశోధన చేసిన ఆంగ్లేయుడు -కల్నల్‌ టాడ్‌
5. కల్నల్‌ టాడ్‌ రచించిన గ్రంథం - రాజస్థాన్‌ కథావళి (దీనినే ఏనల్స్‌ హిస్టరీ ఆఫ్‌ రాజస్థాన్‌ అంటారు)
6. రాజపుత్రులు విదేశీయులని పేర్కొన్న ఆంగ్లేయుడు -కల్నల్‌టాడ్‌
7. రాజపుత్రులు సిధియన్‌, పహ్లావ, ఘూర్జర, హూణ మొ. విదేశీ జాతుల సంతతి వారని అభిప్రాయపడిన చరిత్రకారుడు. - కల్పల్‌ టాడ్‌.
8. రాజపుత్రులు విదేశీయులు కాదు స్వదేశీయులే అనే వాదాన్ని ప్రతిపాదించిన చరిత్రకారులు -సి.వి.వైద్య, జి.ఎన్‌. ఝా
9. రాజపుత్రుల పుట్టుకను గురించి వివరించే సమకాలీన హిందీ గ్రంథం -''పృథ్వీరాజ్‌ రాసో''
10. పృథ్వీరాజ్‌ రాసో గ్రంథ రచయిత - చాంద్‌బర్దారు
(ఇది తొలి చారిత్రక హిందీ భాషా గ్రంథం)
11. రాజపుత్రులు అగ్నికుల క్షత్రియులని పేర్కొన్న ఆధారం - పృథ్వీరాజ్‌రాసో గ్రంథం
12. చాంద్‌ బర్ధారు అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్న రాజపుత్ర రాజవంశాలు: 1. ప్రతీహారులు, 2. పరమారులు
3. చౌహానులు, 4. సోలంకీలు
13. రాజపుత్రులలో ప్రసిద్ధిగాంచిన రాజవంశాలు:
1. ప్రతీహారులు, 2. గహద్వాలులు
3. చౌహానులు, 4.పరమారులు
5. హింద్‌ షాహీలు, 6. చందేలులు, 7.సోలంకీలు
14. రాజపుత్రులలో ప్రసిద్ధిగాంచిన మొదటి వంశం - ప్రతీహారులు
15. ప్రతీహారులు అనే పదానికి అర్థం - ద్వారపాలకులు
16. శ్రీరాముని ద్వారపాలకుడైన లక్ష్మణుని సంతతికి చెందినవారమని చెప్పుకొన్న రాజపుత్ర వంశం - ప్రతీహారులు
17. ప్రతీహార రాజ్య స్థాపకుడు - నాగభటుడు
18. ప్రతీహారుల తొలి రాజధాని -జోథ్‌పూర్‌ సమీపంలోని బీన్‌మల్‌
19. ప్రతీహార రాజులందరిలో గొప్పవాడు -మిహిరభోజుడు (క్రీ.శ. 836 నుండి 885)
20. మిహిరభోజుని రాజధాని నగరం - కనూజ్‌ (కన్యాకుబ్జం)
21. మిహిర భోజుని ఆస్థానాన్ని సందర్శించిన అరబ్బు యాత్రికుడు -సులేమాన్‌
22. గహద్వాలులకే గల మరొక పేరు -రాఠోరులు
23. గహద్వాల వంశ మూలపురుషుడు/స్థాపకుడు -చంద్రదేవుడు
24. గహద్వాలుల రాజధాని -కనోజ్‌ (కన్యాకుబ్శం)
25. ముస్లిందాడులను ఎదుర్కోవడానికి 'తురకదండు' అనే పన్ను వసూలు చేసిన రాజపుత్ర వంశం -గహద్వాలులు
26. రాఠోరు వంశరాజులలో ప్రసిద్ధుడు -జయచంద్రుడు
27. గహద్వాల వంశ ప్రతిష్ట మసకబారడానికి కారకుడు -జయచంద్రుడు
28. రాఠోరు జయచంద్రునికి ప్రధాన శత్రువు/చౌహాన్‌ వంశ పాలకుడు -పృథ్వీరాజ్‌ చౌహాన్‌
29. జయచంద్రుని కుమారై రాణి సంయుక్తను వివాహం చేసుకున్న చౌహాన్‌ పాలకుడు
- పృథ్వీరాజ్‌ చౌహాన్‌
30. మహ్మద్‌ ఘోరీకి తరైన్‌ యుద్ధాలలో సహకరించిన గహద్వాల పాలకుడు - జయచంద్రుడు
31. క్రీ.శ. 1193 లో జరిగిన చందావార్‌ యుద్ధంలో జయ చంద్రుని ఓడించిన తురుష్క సుల్తాన్‌ -మహమ్మద్‌ ఘోరి
32. చౌహాన్‌ల రాజధాని -అజ్మీర్‌
33. చౌహాన్‌ల కులదేవత -శాకంబరి
34. స్వతంత్ర చౌహాన్‌ రాజ్యస్థాపకుడు -సింహరాజ్‌ చౌహాన్‌
35. అజ్మీర్‌ నగరాన్ని అజయ మేరు అనే పేరుతో నిర్మించిన చౌహాన్‌ రాజు - అజరురాజ్‌ చౌహాన్‌
36. విశాలరాజ చౌహాన్‌ ఆస్థానకవి -సోమదేవ మహాకవి
37. సోమదేవ మహాకవి రచించిన గ్రంథం -లలిత విగ్రహ రాజనాటకం
38. చౌహాను వంశంలో అగ్రగణ్యుడు - పృథ్వీరాజ్‌చౌహాన్‌ (క్రీ.శ. 1179-92)
39. ''హిందూ జాతీయ వీరుడు'' అనే ప్రశంస పొందిన చక్రవర్తి -పృథ్వీరాజ్‌ చౌహాన్‌
40. మొదటి తరైన్‌ యుద్ధం జరిగిన సంవత్సరం -క్రీ.శ. 1191 (విజేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌)
41. మొదటి తరైన్‌ యుద్ధం పృథ్వీరాజ్‌ చేతిలో ఓడిన విదేశీ తురుష్కుడు -మహమ్మద్‌ ఘోరి
42. రెండో తరైన్‌ యుద్ధం జరిగిన సంవత్సరం -క్రీ.శ. 1192
43. రెండో తరైన్‌ యుద్ధం పృథ్వీరాజ్‌ను ఓడించి చంపిన విదేశీ తురుష్కుడు -మహమ్మద్‌ ఘోరి
44. తరైన్‌ యుద్ధాలకు గల మరొక పేరు -స్థానేశ్వర యుద్ధాలు
45. తరైన్‌ యుద్ధాలలో మహ్మద్‌ ఘోరీకి సహకరించిన భారతీయ పాలకుడు - జయచంద్రుడు(రాఠోర్‌/గహద్వాల వంశం)
46. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆస్థాన కవి - చాంద్‌బర్దారు
47. చాంద్‌ బర్దారు రచన -పృథ్వీరాజ్‌ రాసో లేదా పృథ్వీరాజ చరిత్రం (హిందీ)
48. ఢిల్లీ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం -తోమారులు
49. ఢిల్లీ ప్రాంతాన్ని చౌహాన్‌ వంశస్థుల నుండి అక్రమించిన వాడు -మహమ్మద్‌ ఘోరీ
50. పరమార రాజ్య రాజధాని -ధారానగరం
51. పరమార వంశ మూలపురుషుడు/స్థాపకుడు -ఉపేంద్రుడు
52. పరమార వంశస్థులలో గొప్పరాజు -ముంజరాజు
53. ముంజరాజుకు గల మరొక పేరు - వాకృతి రాజు
54. ధారానగరంలో ముంజేశ్వర తటాక నిర్మాత -ముంజరాజు
55. ముంజరాజు ఆస్థానకవి - పద్మగుప్తుడు
56. పద్మగుప్తుడు రచించిన గ్రంథం -నవ సాహసాంక చరిత్ర
57. ముంజరాజును ఓడించి చంపిన కళ్యాణి చాళుక్య రాజు -రెండో తైలుపుడు
58. ముంజరాజు తదనంతరం సింహాసనం అధిష్టించిన పరమార పాలకుడు -భోజరాజు(పరమారభోజుడు)
59. పరమార వంశంలో అత్యంత ప్రసిద్ధుడు -భోజరాజు
60. భోజపురి సరస్సు నిర్మాత -భోజరాజు
61. భోజరాజు తన పేరు మీదుగా నిర్మించిన విద్యాలయం -భోజపురి
62. పద్య, గద్యాత్మకంగా అనగా చంపూశైలిలో వెలువడిన తొలి గ్రంథం -రామాయణం
63. చంపూ శైలిలో రామాయణాన్ని రచించినవాడు
- భోజరాజు(ఈయనతో పోల్చి శ్రీకృష్ణదేవరాయలును '' ఆంధ్రభోజుడు'' అని కీర్తిస్తారు)
64. వివిధ శాస్త్రాలపై భోజరాజు రచించిన గ్రంథాలు:
1.వాస్తువిద్యపై '' సమరాంగణ సూత్రధార''
2. వైద్యముపై ''ఆయుర్వేద సర్వస్వం''
3. రాజనీతిపై ''యుక్తికల్పతరువు''
4. యోగశాస్త్రం పై రాజమార్తాండము
5. శైవముపై ''తత్వప్రకాశము''
6. అలంకార శాస్త్రం పై ''సరస్వతీ కంఠాభరణం'', ''శృంగార ప్రకాశము''
65. పరమారుల కాలంలో సాహిత్యానికి మక్కా నగరం అని పిలిచిన నగరం -ధారానగరం
66. మధ్య భారతదేశాన్ని పరిపాలించిన రాజపుత్ర వంశం
-చందేల వంశం
67. మధ్య భారతంలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని పాలించినవారు -చందేలులు
68. చందేల రాజుల రాజధాని -ఖజురహో(మధ్యప్రదేశ్‌)
69. స్వతంత్ర చందేల వంశ స్థాపకుడు -యశోవర్మ
70. చందేల రాజులందరిలో గొప్పవాడు -విద్యాధరుడు
71. గజనీ మహ్మద్‌ దాడులను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏకైక భారతీయ పాలకుడు -విద్యాధరుడు
72. ఖజురహో దేవాలయ నిర్మాతలు - చందేలులు
73. ఖజురహోలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయం -కాందరీయ మహాదేవాలయం
74. గుజరాత్‌ ప్రాంతంలో రాజ్యం స్థాపించిన రాజపుత్ర వంశం -సోలంకీలు
75. సోలంకీ రాజుల రాజధాని -అన్‌హిల్‌వాడ్‌ (గుజరాత్‌)
76. సోలంకీ రాజ్య స్థాపకుడు -మూలరాజు
77. గజనీ మహ్మద్‌ సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసినపుడు (క్రీ.శ 1026) సోలంకీరాజు -మొదటి భీమరాజు
78. సోలంకీలలో గొప్ప పాలకుడు - జయసింహుడు
79. సింహశక ప్రారంభకుడు/స్థాపకుడు -జయసింహుడు
80. జయసింహుడి ఆస్థాన కవి - హేమచంద్రుడు
81. జైనమతానికి చెందిన హేమచంద్రుడు రచించిన గ్రంథాలు:
1. కుమారపాల చరిత్ర
2. అభిదాన చింతామణి
82. మహ్మద్‌ ఘోరీని ఓడించిన సోలంకీ రాజు-రెండో భీమరాజు
83. ప్రతీహారులు ఉత్తరాపథంలో విజృంభిస్తున్న కాలంలోనే బెంగాల్‌ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వంశం
-పాలవంశ (వీరు రాజపుత్రులు కాదు)
84. పాలవంశ స్థాపకుడు -గోపాలుడు
85. పాల వంశస్థులలో గొప్పవాడు -ధర్మపాలుడు
86. ధర్మపాలుడు పోషించిన విశ్వవిద్యాలయాలు:
1. విక్రమశిల, 2. జగద్ధల, 3. ఉద్ధంతపురి
87. విక్రమశిల విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు
- బౌద్ధమతానికి చెందిన అతిశ దీపాంకరుడు
89. పాల వంశానికి చెందిన మహీపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదు ధరించిన చోళరాజు - మొదటి రాజేంద్రుడు
90. పాలవంశాన్ని అంతం చేసి బెంగాల్‌ అధిపత్యం పొందిన రాజవంశం -సేన వంశం
91. సేన వంశ రాజ్యస్థాపకుడు -విజయసేనుడు
92. కర్నాటకకు చెందిన క్షత్రియులు -సేన వంశస్థులు
93. సేన వంశస్థుల రాజధాని -గౌర్‌ పట్టణం
94. ''కులీనపాలన' అనే ప్రత్యేక పాలనా వ్యవస్థను బెంగాల్‌లో ప్రవేశపెట్టిన సేన వంశ పాలకుడు -బల్లాల సేనుడు
95. సేనవంశంలో గొప్పరాజు -లక్ష్మణసేనుడు
96. లక్ష్మణసేనుని ఆస్థాన కవులకు గల పేరు -పంచరత్నాలు
97. పంచరత్నాలలో ప్రముఖ కవి -జయదేవుడు
98. జయదేవుడు రచించిన గ్రంథం -గీతగోవిందం
(ఈ గ్రంథం ఆధారంగా ఒడిస్సీ నృత్యం చేస్తారు)
99. లక్ష్మణసేనుని ఓడించిన ముస్లిం సేనాని -భక్తియార్‌ ఖిల్జీ
100. నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేసిన ముస్లిం సేనాని -భక్తియార్‌ ఖిల్జీ
101. బెంగాల్‌, బీహార్‌లలో ముస్లిం అధికారం స్థాపించినవాడు -భక్తియార్‌ ఖిల్జీ
102. వర్ణాశ్రమ ధర్మాల స్థాపనకు కృషి చేసిన వంశం-సేనవంశం
103. రాజపుత్ర యుగంలో కళింగ ప్రాంతాన్ని పాలించినవారు -తూర్పుగాంగులు
104. తూర్పుగాంగ వంశస్థులలో ప్రసిద్ధుడు -నరసింహదేవుడు
105. కోణార్క్‌లోని సూర్యుదేవాలయాన్ని నిర్మించినవాడు
-నరసింహదేవుడు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section