Type Here to Get Search Results !

Vinays Info

నెహ్రూ రోజ్‌గార్ యోజన |Nehru rojghar Yojana

-నెహ్రూ రోజ్‌గార్ యోజన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఏడో పంచవర్ష ప్రణాళిక ముగిసేముందు 1989 అక్టోబర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-పట్ణణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు, పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
వార్షిక ఆదాయం రూ.11,800 కంటే తక్కువ ఉన్నవారు మాత్రమే ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు.
-ఈ కార్యక్రమంలో భాగంగా మూడు పథకాలు ఉంటాయి. అవి.. 1. ది స్కీమ్ ఆఫ్ అర్బన్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ (SUME), 2. ది స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ అండ్ ఎంప్లాయిమెంట్ (SUWE), 3. ది స్కీమ్ ఆఫ్ హౌసింగ్ అండ్ షెల్టర్ అప్‌గ్రేడేషన్ (SHASU).
-ఈ పథకాల అమలు కోసం 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 92 శాతం నిధులను ఉపయోగించారు.
-అర్బన్ మైక్రో ఎంటర్ ప్రైజెస్ స్కీమ్ పట్ణణ పేదలకు స్వయం ఉపాధి కోసం ఉద్దేశించినది. సూక్ష్మ సంస్థలు స్థాపించాలనుకునే పేదలకు ప్రభుత్వం కమర్షియల్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, అందులో ప్రభుత్వం రూ.4,000 గరిష్ట పరిమితికి మించకుండా 25 శాతం సబ్సిడీ ఇవ్వడం, మిగిలిన 75 శాతం లబ్ధిదారు చెల్లించడం ఈ పథకంలోని నిబంధనలు.
-అర్బన్ వేజ్ అండ్ ఎంప్లాయిమెంట్ పథకం లక్ష్యం పట్ణణ పేదలకు ఉపాధి కల్పించడం. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాలను సృస్టించేందుకు ఉద్దేశించిన పథకమిది.
-హౌసింగ్ అండ్ షెల్టర్ అప్‌గ్రేడేషన్ పథకం పట్ణణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునే పేదలకు రుణ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించినది. రుణంలో 25 శాతం ప్రభుత్వ సబ్సిడీ, మిగిలిన 75 శాతం లబ్ధిదారు చెల్లించేలా నిబంధన ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section