పరిచయం
🔹విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్దతిలో నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల. పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థ కూడా .. మానవుడు సంఘ జీవిగా ఉండడానికీ చారిత్రకంగా మానవుడు ఏర్పరచుకున్న సాంఘీక ,రాజకీయ ,ఆర్ధిక వ్యవస్థలు పునరావృతం కావడానికి విద్య అవసరం.
నిర్వహనా సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది .అయితే పాటశాల వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పటికి కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. తరగతి గదికి కేంద్రబిందువు విద్యార్ది . పాఠశాల వ్యవస్థ రూపొందింది విద్యార్దికోసం.తరగతి గది విదానంలో ఉపాద్యాయుడు మార్గదర్సకుడు,తాత్వికుడు,స్నేహితుడులాగా ప్రవర్తింపవలసి ఉంటుంది.పాటశాల విద్యా విధానాన్ని నిర్వహించి,కొనసాగించే ఉపాధ్యాయునికి విషయజ్ఞానం ఉంటే సరిపోతుంది అని అంటారు చాలామంది .కాని విషయ పరిజ్ఞానానికి తోడు ఉపాద్యాయుడు పిల్లల మనస్తత్వాని తెలుసుకొని దానికి తగిన విధంగా భోదించ గలగాలి .అప్పుడే అది ఫలవంతమవుతుంది.
🔹ఉపాధ్యాయ వృత్తిలో ప్రధాన కర్తవ్యం అభ్యసనం.అందుకే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది.అభ్యాసన సిద్దాంతాలు,సూత్రాలు విద్యా విషయాలకు అన్వయించడం ద్వారా ఉపాధ్యాయుడు పాఠశాల లోని సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహిం చగలుగుతాడు. మనోవిజ్ఞాన శాస్త్రం అతని వృత్తికి ఒక స్థానం కల్పిస్తుంది.బోధనలో అతనికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించు కోవడానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది.బోధనా నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది.అతని పనిని సులభతరం చేస్తుంది.
🔹వడ్రంగి కి కర్ర స్వభావం తెలియాలి.కుమ్మరికి మట్టి స్వభావం తెలియాలి.నేతపనివానికి నూలు స్వభావం తెలియాలి.అలాగే ఉపాధ్యాయుడు మానవుని ప్రవర్తనా స్వభావం గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఈ మానవ ప్రవర్తనా స్వభావాన్ని గురించిన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం.
👉మనోవిజ్ఞాన శాస్త్రం
మనం ప్రతిరోజూ అనేకమంది వ్యక్తులను చూస్తుంటాం.అలాగే వాళ్ళ ప్రవర్తనలో అనేక రకాల తేడాలను కూడా గమనిస్తుంటాం.అంతేకాక ఒకే వ్యక్తి విభిన్న పరిస్తితులలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటాడు.అయితే నిశితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వైవిధ్యంలో కూడా ఒక క్రమం ఉందని మనకు తెలుస్తుంది.ఇటువంటి పరిశీలనలను,పరిశోధనలను ఆధారం చేసుకొని ప్రవర్తనల పట్ల కొన్ని ప్రాగుక్తులను చేయవచ్చుననే భావం మనకు స్పురిస్తుంది.ఇటువంటి ప్రయత్నాలకు ఉద్దేశించినదే మనోవిజ్ఞాన శాస్త్రం.మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలలో ఉన్న కారకాలను తెలుసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆసక్తిని కనబరుస్తుంది.అంటే వ్యక్తి ఒక రీతిలో ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తుంది.
👉మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రం గా రూపొంది సుమారు 126 సంవత్సరాలయింది.
1879 లో జర్మనీ లోని లీప్ జిగ్ నగరంలో విల్ హెల్మ్ ఊంట్ అనే శాస్త్రజ్ఞుడు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయ బద్దమైన,స్వతంత్ర మైన ఒక వైజ్ఞానిక శాస్త్రం గా ప్రారంభ మైనదని చెప్పవచ్చు.
🔹19 వ శతాబ్దం మధ్య వరకు మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం లో ఒక భాగంగా ఉండేది.
ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది.
🔹ప్రపంచమంతటా ఈ శాస్త్ర అధ్యయనం చురుగ్గా జరుగుతుంది.ఈ శాస్త్ర అధ్యయనం లో అనేక సాంప్రదాయాలు వెలిశాయి.ఈ శాస్త్రం మిగతా శాస్త్రాలను కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది.
👉మనోవిజ్ఞాన శాస్త్రం – నిర్వచనం
🔹మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో సైకాలజీ అంటారు.
🔹సైకాలజీ అనే పదం సైకీ,లోగోస్ అనే రెండు గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది.
🔹సైకీ అంటే ఆత్మ అని, లోగోస్ అంటే శాస్త్రం లేదా అద్య్హయనం అని అర్ధాలున్నాయి.
🔹పురాతన గ్రీక్ తత్వశాస్త్రాన్ని పరిశీలిస్తే ప్లేటో,అరిస్టాటిల్ మొదలైన వారు ఈ శాస్త్రాన్ని ఆత్మకు సంబందించిన శాస్త్రమని భావించారు.ఈ నిర్వచనం అనేక సందేహాలకు తావిచ్చింది.
🔹ఏదైనా ఒక విషయాన్ని శాస్త్రోక్తం గా వివరించాలంటే దానికి తగినన్ని ఆధారాలు అవసరం.కొన్నిచోట్ల పరిశోధనలను కూడా చేయవలసి ఉంటుంది.ఆత్మ ఇటువంటి పరిశీలనలకు అందుబాటులో ఉన్న మూర్త పదార్ధం కాదు.ఆత్మ అమూర్త విషయం.ఆత్మ ఉందా ? లేదా,ఉన్నట్లయతే దాని స్వభావం ఎలా ఉంటుంది ? ఇటువంటి విషయాలు సమస్యా పూరితమైనవి.కాబట్టి శాస్త్రవేత్తలు ఈ నిర్వచనాన్ని ఉపేక్షించారు.
🔹కాలక్రమేణా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనసుకు సంబందించిన శాస్త్రమని నిర్వచించ సాగారు.కాని ఈ నిర్వచనాన్ని కూడా పై కారణాల వలన తిరస్కరించడం జరిగింది.తరువాత కాలంలో అంటే 19 వ శతాబ్దంలో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతనానికి సంబందించిన శాస్త్రం గా పరిగణించారు.అంతే కాక దీన్ని పరిశీలించడానికి అంతః పరీక్షణ వంటి పద్దతులను కూడా ప్రవేశపెట్టారు.కాని ఈ నిర్వచనానికి కూడా అనేక మంది ఆక్షేపణలు తెలిపారు.
🔹20 వ శతాబ్ది ప్రారంభంలో జాన్.బి.వాట్సన్. అతి ముఖ్యమైన ప్రవర్తనా వాదాన్ని ప్రవేశ పెట్టాడు. ఇతని సిద్దాంతం ప్రకారం మానవుడిని అర్ధం చేసుకోవడానికి ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం.అంతేకాక ‘మనోవిజ్ఞాన శాస్త్రం’ పేరునే ప్రవర్తనా శాస్త్రం గా మార్చడానికి వాట్సన్ సిద్దపడ్డాడు.ప్రవర్తనా వాదం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనంకు సంబందించిన శాస్త్రం గా నిర్వచించవచ్చు.ఈ నిర్వచనాన్ని మనో విజ్ఞానులు సూత్రప్రాయం గా అంగీకరించారు.తరువాత మనోవిజ్ఞానులు ఈ నిర్వచాన్ని మనోవిజ్ఞాన పరిధులను అనుసరించి కొంత మార్చారు.
ఉడ్ వర్త్ అనే శాస్త్రవేత్త పై నిర్వచనాలను సమీక్షిస్తూ ‘మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను,తరువాత తన మనసును పోగొట్టుకుంది.చివరకు తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుని,ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రం నిలుపుకుంది.’ అని చమత్కరించడం జరిగింది.
👉నిర్వచనాలు:
🔹ఎడ్విన్ బోరింగ్ప్ర కారం ‘మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం’
🔹క్రో & క్రో ప్రకారం “మానవుని ప్రవర్తనను,ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం.”
🔹నార్మన్.ఎల్.మన్ప్ర కారం “జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం”
🔹ఉడ్ వర్త్ ప్రకారం “వ్యక్తి తన పరిసరాలకు అనుగుణం గా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం”
🔹పిల్స్ బరి ప్రకారం “మానవ ప్రవర్తనా శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం”
🔹స్కిన్నర్ అభిప్రాయం ప్రకారం ‘ప్రవర్తనా అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం’
వ్యక్తి ప్రవర్తనను,అనుభవాలను శాస్త్రీయం గా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఉత్తమమైన నిర్వచనం గా చెప్పవచ్చు.
👉మనోవిజ్ఞాన శాస్త్ర చారిత్రక ఆధారాలు
🔹శాస్త్రజ్ఞులు మొదటి నుంచి వ్యక్తికి సంబందించిన అనేక విషయాలను తెలుసు కోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఇందులో భాగంగా మొదట ఆత్మను గురించిన పరిశోదనలు నిర్వహించారు.తరువాత మనసును గురించి తెలుసుకోడానికి ప్రయత్నిచసాగారు.మనసు, దాని స్వభావాన్ని గురించి తెలుసుకోవడానికి మానవుడు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాడు అందానికి ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలయం పై రాసి ఉన్న “నిన్ను గురించి నీవు తెలుసుకో “ అనే సూక్తి నిదర్శనం అని చెప్పవచ్చు.
🔹ప్రాచీన కాలంలోని వారు తాము గుర్తించిన విషయాలను శాస్త్రీయ పద్ధతులలో పరిసీలించలేక పోవడంతో అవి నమ్మకాలుగానే మిగిలిపోవడం జరిగింది.మానవుడికి తనను గురించి తాను తెలుసుకోవాలన్న ఆశ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే కలిగింది.ఈ దిశలో అనేకమంది మేధావుల పరిశోధనలు మనోవిజ్ఞాన శాస్త్రం పై ప్రభావం చూపడం జరిగింది. వీరిలో కొందరి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
👉సోక్రటీస్:(469-339 B.C)
🔹మొదటగా అచేతనమైన మానసిక కృత్యాలను గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు.
🔹ఇతని తాత్విక అభ్యుపగమానాలు గ్రీక్ తత్వాన్ని,తద్వారా పాశ్చాత్య తత్వాన్ని ఎంతో ప్రభావితం చేసాయి.
🔹“ఆత్మ” లో “జ్ఞానం” ఇమిడి ఉందని,జ్ఞానం అంతర్గతంగా,నిగూడం గా ఉంటుందని,దానిని చైతన్య మానసిక స్థితి లోకి తీసుకు రావచ్చునని తెలియజేసాడు.
👉ప్లేటో (428-348 B.C)
🔹సోక్రటీస్ శిష్యులలో పెరోన్దినవాడు ప్లేటో.
యితడు భావవాది.
🔹‘మనసు మెదడు లోను ,ఇచ్చ హృదయం లోను,తృష్ణ లేదా వాంఛ ఉదారంలోనూ ఉంటాయని అభిప్రాయపడినవాడు.
🔹ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు.
విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని ఇతని అభిప్రాయం.
రిపబ్లిక్ గ్రంధ రచయిత.
🔹జిమాషియా అనే పాటశాల ప్రారంభకుడు.
👉అరిస్టాటిల్ (384-322)
🔹ప్లేటో శిష్యుడు.
🔹ప్రాచీన పాటశాల ఉద్యమానికి జీవం పోసినవాడు.
🔹ఆత్మను రెండు భాగాలుగా గుర్తించాడు.
🔹నిష్క్రియాత్మక మనసును ఏమీ రాయని నల్ల బల్లతో పోల్చాడు.
🔹నిష్క్రియాత్మక మనసుకు ‘తాబ్యూలారసా’ అని పేరు పెట్టాడు.
🔹తాబ్యూలారసాను చిన్న పిల్లల మనస్సుతో పోల్చాడు.
🔹డి అనిమా,పర్వాతురాలియా,ఎథిక్స్,పాలిటిక్స్ ల రచయిత.
👉సెయింట్ ఆగస్టీన్ (354-430 A.D)
🔹అంతః పరీక్షణ లేదా అంతః పరిశీలనా పద్ధతులద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించాడు.
🔹ఇతని పాండిత్య వాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం లో సంరచంనాత్మక వాదానికి దారి తీసింది.
కంటతా పెట్టడం, మానసిక శారీరక శిక్షణ,పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు.
👉రూసో (1712-1778):
🔹విధ్యాతత్వం లో విప్లవం తీసుకొని వచ్చినవాడు.
🔹ఇతడు ఫ్రెంచ్ దేశీయుడు.
🔹ప్రాకృతిక వాదానికి మూలపురుషుడు.
🔹ప్రాకృతిక వాదం విద్యావిధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది.
🔹ఎమిలి,సామాజిక ఒడంబడిక గ్రందాల రచయిత.
🔹రూసో రూపొందించిన ఆదర్శ విద్యార్ధికి నమూనా “ఎమిలి”.
🔹విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం లో స్వయం ప్రేరణా పద్ధతులను,అనుభవం ద్వారా విద్య,క్రీడా పద్ధతిని ప్రతిపాదించాడు.
🔹మానవులంతా జన్మతః మంచివారేనని, నాగరికత పట్టణవాసం వారిని మాలిన పరుస్తుందని ఇతని వాదం.
🔹“ప్రకృతి లోకి తిరిగి పోదాం” అనేది ఇతని నినాదం.
👉పెస్ట్టాలజి(1746-1827)
🔹ఇతడు స్విట్జెర్లాండ్ దేశస్తుడు.
🔹1805-1825 మధ్య యోర్ధాన్ బోర్దింగ్ స్కూల్ లో తన విద్యా ప్రయోగాలను చేసాడు.
తెలిసిన విషయాలనుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు.
🔹సామూహికం గా కృత్యాలు నిర్వహించాలని చెప్పాడు.
🔹బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్ధి కేంద్రబిందువు.
🔹ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం.
1780 లో “ఈవెనింగ్ ఆఫ్ ఎ హెర్మిట్” అనే గ్రంధాన్ని రచించాడు.
🔹విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారిలో పెస్తాలజి అగ్రగణ్యుడు.
🔹పెస్తాలజి సిద్ధాంతాలు విద్యా మనో విజ్ఞాన శాస్త్రం లో వైయక్తిక భేదాలు, సహజ సామర్ధ్యం పైన ప్రయోగాలకు దారి తీసాయి.
👉ప్రోబెల్ (1782-1852)
🔹ఇతడు జర్మనీ దేశస్తుడు.
🔹ఇతడు పెస్టాలాజి సమకాలికుడు.
🔹కిండర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్తకు పితామహుడు.
🔹1837 లో ఇతడు స్థాపించిన “Child Nature and Activity Institute” కిండర్ గార్డెన్ పాటశాల గా రూపొందింది.
👉ఈయన బోధనా పద్ధతులు
ఎ) స్వయం వివర్తనం.
బి)స్వయం ప్రకాశం.
సి) స్వయం బోధన.
డి) బోధనలో బహుమతులను ప్రవేశపెట్టాడు.
ఎ) సంగీతం ద్వారా అభ్యసనం.
“Play way” అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి .
ప్రోబెల్ ఉపాధ్యాయుడి ని తోటమాలితో,విద్యార్ధిని తోటలోని మొక్క తో పోల్చాడు.
👉హెర్బార్ట్(1776-1841)
🔹ఇతడు జర్మనీ దేశస్థుడు.
🔹బోధనా విధానం లో సోపానాలను రూపొందించాడు.
🔹పాట్యప్రణాలికను రూపొందించడానికి కూడా తయారు చేసాడు. అవి:
ఎ) సన్నాహం
బి) ప్రదర్శనం.
సి) సంసర్గం.
డి) సాధారనీకరణం.
ఇ) అన్వయం.
ఎఫ్) సింహావలోకనం.
🔹నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.
👉మరియా మాంటిస్సొరి (1870-1952)
🔹ఈమె ఇటలీ దేశస్థురాలు, వైద్యవేత్త.
🔹ఈమె మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది.
🔹ఈమె రూపొందించిన విద్యా విధానం జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేఛ్చ, ఆత్మప్రకటన.
ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వడం ఈమె విద్యా విధానం లో మొదటి సోపానం.
👉జాన్ డ్యుయి(1859-1952):
🔹ఇతను అమెరికా దేశస్థుడు.
🔹ఇతను వ్యవహారికా సత్తావాదాన్ని రూపొందించాడు.
🔹కార్యకారణ వాదం కూడా కనుక్కున్నాడు.
పాఠశాల అంటే చిన్న మోతాదు సమాజం.
“Democracy and Education” గ్రంధకర్త.
👉జోహాన్స్ ముల్లర్(1801-1858)
🔹ఇతను జర్మనీ కి చెందిన శాస్త్రవేత్త.
🔹ఇతను నిర్దిష్ట నాడీశక్తుల సిద్దాంతాన్ని రూపొందించాడు.
🔹అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలుగజేయవచ్చునని తెలిపాడు.
👉సర్ ఫ్రాన్సిస్ గాల్టన్(1822-1911)
🔹ఇతను బ్రిటన్ దేశస్థుడు.
🔹వైయక్తిక భేదాలను గురించి ప్రయోగాలు చేశాడు.
🔹అనువంసికతకు, ప్రజ్ఞ కు ఉన్న సంబంధాలను గురించి అనేక పరిశోధనలను నిర్వహించాడు.
🔹“Hereditary Genius” గ్రంధ రచయిత.
🔹“An Inquiry into human faculty and its development” పుస్తక రచయిత.
🔹మానవ శాస్త్ర ప్రయోగ శాలను స్థాపించాడు.
👉విల్ హెల్మ్ ఊంట్ (1832-1920):
🔹మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా చెప్పవచ్చు.
🔹సంరచానాత్మక వాదానికి మూల పురుషుడు.
🔹1879 లో జర్మనీ లో Leipzig లో Experimental Psychology Laboratory ని ప్రారంభించడం తో Psychology ఒక ప్రత్యేక శాస్త్రం గా రూపొందడానికి కృషి చేసిన వ్యక్తి.
ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా నిలచిన వ్యక్తి.
👉స్టాన్లీ హాల్ (1844-1924)
🔹అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త .
🔹బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూలపురుషుడు.
ఊంట్ ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు.
🔹శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు.
🔹1883 లో “The Content Of Children’s Mind” అనే పుస్తకాన్ని రాశాడు.
🔹American Psychological Association ను ప్రారంభించాడు.
🔹బాలల అధ్యయన ఉద్యమానికి మూలపురుషుడు.
👉విలియం జేమ్స్ (1842-1910)
🔹ఇతను అమెరికా దేశస్థుడు.
🔹స్మృతి, విస్మృతి, అభ్యాసన బదలాయింపులపై అనేక సిద్ధాంతాలను రూపొందించాడు.
🔹కార్యకారణ వాదానికి మూలపురుషుడు.
🔹“The Principles Of Psychology” గ్రంధకర్త.
🔹ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడుగా చెప్పవచ్చు.
👉సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856-1939)
🔹ఆస్ట్రియా దేశస్థుడు.
🔹మనోవిశ్లేషణ సిద్దాంత మూలపురుషుడు.
🔹అచేతన ప్రేరణ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు.
🔹ఇద్, ఈగో, సూపర్ ఈగో లను పేర్కొన్నాడు.
🔹మనో లైంగిక వికాసదశలను గురించి చెప్పాడు.
🔹“An Interpretation of Dreams” గ్రంధకర్త.