Type Here to Get Search Results !

Vinays Info

NATIONAL MOTHER-IN-LAW DAY - అత్తవార్ల దినోత్సవం

NATIONAL MOTHER-IN-LAW DAY - అత్తవార్ల దినోత్సవం

National Mother-in-Law Day is observed annually on the fourth Sunday in October. It is a special day to honor the mother of your spouse. 

Some people get along very well with their Mother-in-Law. Others, not as well.  Whichever is the case, this is the day to celebrate them. 

HOW TO OBSERVE

Whether you make a grand gesture or prefer to keep it simple, take a moment to wish a Happy Mother-in-Law Day to your Mother-in-law. Use #MotherInLawDay when posting on social media.

HISTORY

This day, modeled after Mother’s Day, was first observed on March 5, 1934, in Amarillo Texas, where it was initiated by the editor of the local Amarillo newspaper.

-వినయ్స్ ఇన్ఫో - VINAYS INFO

ప్రతి సంవత్సరమూ అక్టోబర్ నెల నాలుగో ఆదివారము మదర్-ఇన్‌-లాస్ ... డే (అత్తల దినోత్సవం) జరుపుకుంటారు . ఈ ఉత్సవం జరుపుకోవడానికి ఖచ్చితమైన కారణము తెలియదు . గ్రీటింగ్ కార్డ్ కంపెనీలు బహుశా ప్రారంభించవచ్చును అని ఊహాగానాలు ఉన్నాయి . కారణము ఏదైనా ... అత్తగారి సాయానికి కృతజ్ఞతలు చెప్తూ కోడళ్ళు ఆమెకు బహుమతులు అందజేస్తూ ప్రేమ , ఆప్యాయతల్ని పంచే రోజు ఇది .

కమ్మని ప్రేమ అమ్మది అయితె ఆ అమ్మ తరువాత మరో అమ్మ ... అత్తమ్మ . జీవితమంతా తోడూ-నీడగా ఉండేందుకు బాసలు చేసి ఒకటైన ప్రతి జంటకు కన్న తల్లులిద్దరు ఆ ఇద్దరు దంపతులకు అత్తమ్మలే . అత్త కోడళ్ళ  కథనాలు అనేకచోట్ల సాగుతుంటాయి . దాదాపు అన్ని కథల్లోనూ ఎక్కడోచోట అత్తాకోడళ్ళ నడుమ స్పర్ధలు ఉంటునేఉంటాయి . యువతము " అమ్మో అత్తగారా!" అంటే నడుమతరము " అమ్మో కోడలుపిల్లా!" అంటుంటారు . ఎందుకీ అంతరము అని ప్రశ్నించుకుంటే ... కారణము ప్రేమే అని కనబడుతుంది .


కొడుక్కి పెళ్ళి చేసేంతవరకు తహతహలాడిన అమ్మ అత్తగారి హోదా రాగానే ఎందుకు రుసరుసలాడుతుందో తెలియక తలపట్టుకుంటారు కొందరు . కారణం చూడండి .... పుట్టింట ఎటువంటి అరమరిలకూ లేని కూతురు మెట్టినింట కోడలు పాత్రలోకి  వచ్చేసరికి ఏదో తెలియని అసంతృప్తితో ఎందుకు రగిలిపోతుందో ... అందుకు కారణము " ప్రేమే" . పెళ్ళి దాకా ప్రతి చిన్న అవసరానికీ అమ్మ అని పిలిస్తూ తనపై అనుక్షణము ఆధారపడిన కొడుకు పెళ్ళి తరువాత కోడలిని క్షణం క్షణం సదరు అవసరాలము పిలవడం ఆత్తకు ఎక్కడో అసంతృప్తి లేపుతుంది ...కొడుకు తనప్రేమకు దూరమతున్నాడేమోనని తన పాత్ర ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో నని బయమే భయము తోకూడిన ప్రేమే. ఫలితం గా కొత్తగా వచ్చిన కోడలి తో చీటికీ మాటికి తప్పులు ఎంచుతూ తగవులు ప్రారంభం అవుతాయి .

చాలా ఇళ్ళలో భార్యాభర్తల నడుమ వచ్చేటువంటి మనస్పర్ధలకు ఆ ఇంట్లోని అత్తగారినే బాధ్యురాల్ని చేస్తుంటారు . బాల్యము నుండి అత్తగారిపట్ల జీర్ణించుకుపోయిన దురభిప్రాయాలే ఇందుకు కారణము . చివరకు కథలు కార్టూన్లలో అత్తా కోడళ్ళ నడుమ వైరాన్ని ఎత్తిచూపుతుంటారు . ఇటువంటి స్పర్ధలతో కుటుంబసభ్యుల నడుమ కోపతాపాలు , చిక్కకులు , ఫలితం గా ఒత్తిడికి లోనవడం తప్పడం లేదు . చాలా జంటలు అత్తగారితో కలిసి వుండేందుకు సైతం మొగ్గుచూపడం లేదు . భార్యాభర్తల విడాకులవరకు దారితీస్తూ ఉంటాయి . చిన్న చిన్న వషయాలకు అత్తా కోడళ్ళు ఎవరూ బూతద్దం  లో చూడకూడదు . కుటుంబ వ్యవస్థ చిన్నాబిన్నము అవకుండా ఉండేటట్లు చూడాలి . ఒకవేళ ఎక్కడైనా విభేదాలు తలలెత్తినా వీలయినంత వరకు సంయమనాన్ని కోల్పోకుండా ఉండాలి . చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకుని , విచ్చిన్నధోరణిలో వ్యవహరించేకంటే అంతదాకా వెళ్ళకపోవడమే మంచిది .

కొన్నిసార్లు భరించలేనంత సాధింపులను ఎదుర్కొనే పరిష్థితులను చూస్తుంటాము . ఇటువంటపుడు ఇతరత్రా అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారాన్ని వెతుక్కోవాలి . ఒకే ఇంట్లో ఒకరి నొకరు ప్రతిక్షణము శత్రువుల్లా చూసుకునే బదులు పంతాలు విడిచిపెట్టి సర్దుకుపోవడం మంచిది . పెళ్ళయ్యాక అప్పటిదాకా తన కొంగుపట్టుకుని తిరిగిన కొడుక్కి అంతగా తనపై ఆధారపడాల్సిన పని లేదని ... జీవితాంతము తోడుకోసం చేయిపట్టిన భాగస్వామితో అతను మెలగాలని ఆ కన్నతల్లి గుర్తించాలి . తానా ఇంటికోడలు గా వచ్చినంతమాత్రాన భర్త పూర్తిగా తనకే ప్రాధాన్యత ఇవ్వాలని , స్వంతం కావాలని దేనికోసమూ అత్తగారిపై అస్సలు ఆధారపడకూడదని ఆ ఇంటికోడలు ఆలోచించకూడదు . అందరూ ఒక్కటే అన్న భావము ఉన్నప్పుడు ఏ సమస్యారాదు .

వీటినన్నింటినీ మననం చేసుకుంటు అత్తగారిలోని అమ్మతనాన్ని గౌరవిస్తూ అమ్మకోసం ఓ పండుగ జరుపుకున్నట్లే అత్తగారి కోసమూ ఓ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశమే ... ఈ మదర్-ఇన్‌-లా డే.

అత్తగారి హోదా: కాపురానికి అడుగుపెట్టిన క్షణము నుండి పరోక్షము గానో , ప్రత్యక్షముగానో అత్తగారు కోడలి మీద పెత్తనము చెలాయిస్తుంది . అయితె కోడళ్ళుకు తెలియని మరో విషయము ఏమిటంటే ఆ పెత్తనము పెళ్ళికి ముందునుండే ప్రారంభమవుతుంది  , తాను కోరుకున్న అమ్మాయిని  పెద్దల ప్రమేయము  లేకుండా పెళ్ళిచేసుకునే అబ్బాయిల సంఖ్య 10 శాతానికి మించదు . మిగిలిన 90 శాతము  అబ్బాయిలు తమ భార్యల ఎంపికలో తల్లికి ప్రాధాన్యత నిస్తారు . తన కొడుక్కి ఎటువంటి భార్యకావాలో తనకే బాగా తెలుసుననుకొంటుందా తల్లి . దాని ఫలితము గా తాను ముద్రవేసిన అమ్మాయినే పరిణయమాడమంటుంది.  అబ్బాయిలు కూడా అమ్మ మనసును తప్పనుకోరు ... నాటి వరకూ తన అవసరాలను కనిపెట్టి చూసిన అమ్మ కన్న నిర్ణయం చేయగలిగినవారెవరుంటారని అనుకొంటారు.  అలా అమ్మల ప్రభావముతో అబ్బాయిలు ఉండడము , తన సంసారము తాను స్వతంత్రము గా తీర్చిదిద్దుకోవాలన్న భావన అమ్మాయీలలో పెరరగడము తో ... అత్తా కోడళ్ళ మధ్య సంబందాలలో ఘర్షణ మొదలవుతున్నది . 

అమ్మ నుండి అత్తగా : - కొత్తకోడళ్ళు ముందుగా అర్ధము చేసుకోవాల్సింది తన భర్తకు  , అత్తకు మధ్య ఉన్న అనుబంధము గురించి. తల్లిగా ఆమె కొడ్కును పెంచిన తీరుమీద వివాహబంధ ... జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇవే సంసారము ప్రారంభమైన తొలినాళ్ళలో జరిగే చిన్న చిన్న సంఘటనలకు , భార్యా భర్తల సంబంధాలను మెరుగుపరచడము లేదా దెబ్బతీయడము చేస్తుంటాయి . అబ్బాయిలకు తొలిగా పరిచయమయ్యే " అమ్మాయి" తల్లి. తాను ఎదుటవారితో ఎలా ప్రవర్తించాలో తల్లి నుండే నేర్చుకుంటాడు . బావోద్వేగాల ప్రదర్శన , అనురాగబంధాల నిర్మాణము , బుద్ధి , జ్ఞానము , నడవడిక అన్నీ తలీ ద్వారనే అర్ధము చేసుకొని నేర్చుకుంటాడు కొడుకు. ఆడ పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెల్సుకునే యత్నము తల్లిని చూసే నేర్చుకుంటాడు . తల్లి చాలామంది అబ్బాయిలకు అత్యుత్తమ స్త్రీ. తనకు రాబోయే భార్య అమ్మలా ఉండాలనుకునే అబ్బాయిలూ ఉన్నారు. అయితే వీరికి అర్ధము కానిది .... తల్లి పాత్ర , భార్యపాత్ర ... భిన్నమైనవని , ఆ రెండూ ఒకేలా వ్యవహరించవని .  వివాహమయ్యే వరకూ అబ్బాయిలకు అమ్మతోటిదే లోకము . అబ్బాయికి ఆహారము వడ్డించేది , ఇష్టమైనవి చేసి పెట్టేది , బట్టలు ఉతికి సిద్ధము చేసేది , డబ్బు విషయములో జాగ్రత్తవహించేదీ , అబ్బాయి ప్రవర్తనకు అర్ధాలు చెప్పేది , అబ్బాయి మూడ్ ను అర్ధముచేసుకొని మెలిగేది ... అమ్మే .  అయితే వివాహము అయిన తర్వాత కొత్తకోడళ్ని తనకొడుకు అవసరాల గురించి చెప్పి ఇక నీదే ఆ బాధ్యత అని చెప్పి తప్పుకోదు అత్త . ఫలితము గా భార్యనుండి తల్లి అందించినటువంటి సేవలు , సహకారాలు ఆశిస్తుంటాడు అబ్బాయి. ఇది భార్య అర్ధము చేసుకుంటే పరవాలేదు.

తగాదా వద్దు :-   మరో రకము తల్లులు అబ్బాయిలను తమ నోటితో అదుపులో పెట్టుకుంటారు . ప్రతి పనికీ కొడుకును విమర్శిస్తారు . అమ్మ నిర్దేశించే లక్ష్యాలను అందుకోవడమే అబ్బాయి జీవతమవుతుంది . తాను అనుకున్నది అబ్బాయి అందుకోలేక పోగానే అమ్మ దిగులుపడి కూర్చుంటుంది .. కన్నీరు పెట్టుకుంటుంది. ఆ స్థితిని అబ్బాయిలు చూడలేరు.అందుకని చాలామంది అమ్మను సంతోషపరచడమే లక్ష్యము గా పెట్టుకుంటారు . ఇటువంటి భర్తలు లభించిన అమ్మాయిలు తెలివిగా వ్యవహరించాలి. తమ విషయాలు తల్లికి చేరవేయనివ్వకుండా జాగ్రత్త పడాలి . అత్తగారిని పరోక్షముగానైనా .  విమర్శించకూడదు . తల్లిమీడ మాటపడే సరికి పూనకము వచ్చినట్లు ప్రవర్తిస్తారు అబ్బాయిలు.

భర్తతో చర్చిండి :-  భర్తకు తల్లిమీద ఉన్న అభిప్రాయము తొలగించాలనే యత్నము కన్నా ఆ అభిప్రాయముతో నేనే ఏకీభవించడము లేదన్న మాటతో సరిపెట్టుకోవాలి. తల్లిదండ్రుల విషయములో అనవసర్పు వాదనలు చెయ్యవద్దు . ఈ ఎత్తుగడ క్రమముగా ఫలిస్తుంది. తల్లిని విమర్శించడము లేదు కాబట్టి  భర్త కూడా తల్లి విషయము తీసుకు రావడము తగ్గిస్తాడు . క్రమముగా తల్లికి ప్రతీ విషయము చేరవేసే గుణము తగ్గుతుంది. కాని అత్తగార్లందరూ అంత సులభముగా వూరుకోరు .కొడుక్కి ఫోన్‌ చేసి మాట్లాడకపోతే  ఆ కోపము కోడలి మీదకు మళ్ళిస్తారు. ఏదో ఒక విధము గా కోడళిని రెచ్చగొట్టి , ఆ చిరాకులో కోడలు అన్న చిన్న మాటను ' భూతద్దములో' కొడిక్కి చూపిస్తారు . ఇందంటా కొడుకు తనకెక్కడ దూరం అవుతాడో అన్న మానసిక భయము వల్లే . తన చేతుల్లోనుండి కొడుకు జారిపోతాడేమో  అన్న అభద్రతా భావము మూలంగా ... వీలులేకుండా ,కొడుకుతో తనకున్న ప్రేమానుబంధాన్ని అడ్డుపెట్టుకొని ... ఎత్తుగడలు వేస్తూ కోడల్ని సుఖముగా సంసారము చేసుకోనివ్వదు. ఒకే అంశము మీద తరచుగా  భర్తతో తగాదా పడడము అనవసరము ..అది అత్తగారి విషయములో అస్సలు అనవసరము .

ఎవరి స్థానము లో వారు ఉంటే ఉత్తమము . అత్త పోరులేని సంసారమే ఏ కోడలైనా కోరుకునేది. అనవసరపు ' పోరు' ఉండకూడదనుకుంటారే గాని అసలు అత్తలే వద్దనే అమ్మాయిలు ఉండరు . అందుకు గాను అత్తలూ కొంతవరకు తనకు దూరము గా కొడుకు జారిపోతున్నాడెమో నన్న అభద్రగా భావనను విడిచి,  కోడల్ని కూతురు మాదిరిగా చూసుకోవాలి. అయితే ఇక్కడ  'మామ' పాత్ర ఏమీ లేదా అంటే ... ఉండకూడదనే చెప్పాలి.  కుటుంబ వ్యవస్థలో ఆడవారి పాత్రే ముఖ్యమైనది. మామయ్యలు కోడలు వచ్చే సరికి వయసు మళ్ళినవారు అవడము మూలంగానో , సంసార సారధ్యబడలిక మూలంగానో , అనారో్గ్యమూలంగానో ఈ అత్తా కోడళ్ళ నాటికలో మౌనం పాత్ర పోషిస్తూ కాలం గడిపేస్తుంటారు. 

అత్త ఒకింటి కోడలే. కోడలూ కాబోయే అత్తే. అత్త కోడళ్ళ మధ్య మంచి అవగాహన ఉన్న కుటుంబం స్వర్గమే . ప్రతి తల్లి తమ కూతురు అత్తింటి వద్ద సుఖపడాలని కోరుకోవడం సహజం . అక్కడ పరిస్తితులకు అనుగుణంగా కాపురం ఉంటుంది . ప్రతి అత్త కూడా తమ కోడలు గునవంతురలుగా ఉండాలని ఆశిస్తుంది . అయితే కట్నం అనే జబ్బు లాంటి డబ్బుతో పాటు కొన్ని లాంచనాలు " అత్త కోడళ్ళ మధ్య విభేదాలు సృష్టి స్తున్నాయి " . వర్తమాన కాలంలో  ఉద్యోగాలు వలనో , పనికోసము వలసలు వెళ్ళడము మూలంగానో పెళ్లి అయిన వెంటనే వేరే కాపురాలు పెడుతున్నారు . ఇక అత్త కోడళ్ళ మధ్య సంబందాలే ఉండడం లేదు . కోడలి కూతిరి లాగ అత్త చూసుకోవడం ...అత్తను అమ్మలా చూసుకోవడం జరగడము లే

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section