మహబూబ్ ఆలీఖాన్ | Mahabub Ali Khan

VINAYS INFO
VINAYS INFO

మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదు ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. 🔹ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.

🔹అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జా గా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది.

🔹పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది.

🔹మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు.
🔹అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.

🔹ఇతడు రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడినది.

🔹ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.

🔹మహబూబ్ నగర్ కు ఆ పేరు మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగానే మహబూబ్ నగర్ అని వచ్చింది.

You may like these posts

Post a Comment