Type Here to Get Search Results !

Vinays Info

వాతావరణ పీడనం - ప్రభావాలు

🔹Climate అనే గ్రీకు పదం నుంచిClimate అనే ఇంగ్లిష్ పదం ఆవిర్భవించింది*. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని అర్థం
👉*వాతావరణ స్థితి*: ఒక ప్రదేశ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతాల సంయుక్త స్థితిని వాతావరణ స్థితి అంటారు.
🔹వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మెటీరియాలజీ.
*👉శీతోష్ణస్థితి*: ఒక ప్రదేశానికి సంబంధించిన దీర్ఘకాల (కనీసం 30 ఏళ్ల) వాతావరణ స్థితుల సరాసరిని శీతోష్ణస్థితి అంటారు.
👉*వాతావరణ పీడనం*: ఒక ప్రదేశంలోని వాయువుల పొర బరువును వాతావరణ పీడనం అంటారు.
👉గాలికి బరువు ఉందని గెలీలియో నిరూపించాడు.
👉వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం - భారమితి (బారోమీటర్)
👉భారమితిని కనిపెట్టింది టారిసెల్లి (ఇటలీ, క్రీ.శ.1643). ఇతను గెలీలియో శిష్యుడు.
👉సామాన్య వాతావరణ పీడనం అంటే భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీ మీటర్లు.
👉760 మి.మీ. = 76 సెంటీమీటర్లు = 29 అంగుళాలు = 1013.2 మిల్లీ బార్లు.
గొట్టంలో పాదరసం ఎత్తు 3 మిల్లీ మీటర్లు అయితే 4 మిల్లీ బార్లకు సమానం.
👉1 మి.మీ. = 1.33 మి.బార్లు.
👉ఒక చదరపు సెం.మీ వైశాల్యంలో 1 గ్రా. బరువును మిల్లీబార్ అంటారు.
👉*వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు*
👉*1. ఎత్తు*: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున పీడనం తగ్గుతుంది. ప్రతి 300 మీటర్ల ఎత్తుకు 25.4 మిల్లీబార్ల పీడనం తగ్గుతుంది.
6 కి.మీ ఎత్తులో 506 మిల్లీబార్లు లేదా 308 మి.మీ. వాతావరణ పీడనం తగ్గుతుంది.
*2.ఉష్ణోగ్రత*: ఇది పెరిగితే గాలి సాంద్రత తగ్గి, పీడనం కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం విలోమానుపాతంలో ఉంటాయి.
*3. నీటి ఆవిరి*: పొడి గాలి కంటే నీటి ఆవిరి బరువు తక్కువ కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పెరిగితే పీడనం తగ్గుతుంది.
*4.వాయు ప్రవాహాలు* : అధిక ఉష్ణోగ్రత వల్ల అల్పపీడనం గల ప్రాంతాల్లో పైకి తేలిపోయే వాయు ప్రవాహాలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి పవనాలు వీస్తాయి.
అల్ప ఉష్ణోగ్రత వల్ల అధిక పీడనం గల ప్రాంతాల్లో కిందకు దిగే వాయు ప్రవాహాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పవనాలు వీస్తాయి.
సముద్ర మట్టం వద్ద సరాసరి వాతావరణ పీడనం 900-1030 మిల్లీబార్లు ఉంటుంది.
*ప్రపంచంలో అత్యంత వాతావరణ పీడనం గల ప్రాంతం సైబీరియాలోని అగాటా*. ఇక్కడ 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది (1963, డిసెంబర్ 31).
ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం గల ప్రాంతం టిప్ అని పిలిచే చక్రవాతం (మరియాన ద్వీపం). ఇక్కడ 870 మిల్లీబార్లు నమోదైంది (1979 అక్టోబర్ 12).

🔹భూగోళంలో పీడన మేఖలలు

👉*1.భూమధ్యరేఖ అల్పపీడన మేఖల*: 100 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతాన్ని డోల్‌డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం, నిశ్చలవాత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతంలో సగటున 1013 మిల్లీబార్ల్ల వాతావరణ పీడనం ఉంటుంది.
👉*2.ఉప ఆయనరేఖా అధిక పీడన మేఖల*: భూమధ్యరేఖకు ఇరువైపులా 250-300 అక్షాంశాల మధ్య ఉంటుంది. వీటినే గాలి కిందకి దిగే ప్రాంతాలు అంటారు. పీడన మండలాలు సూర్య గమనాన్ని బట్టి ఉత్తర, దక్షిణాలుగా కొద్దిగా జరుగుతాయి.
👉*3. ఉప ధ్రువ అల్పపీడన మేఖల*: భూమధ్యరేఖకు ఇరువైపులా 450-650 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యలో ఉంటుంది. దీన్నే సమశీతోష్ణ అల్పపీడన మేఖల అంటారు.
👉*4. ధ్రువ అధిక పీడన మేఖల*: 750-900 అక్షాంశాల మధ్యగల అతి శీతల ప్రాంతాన్ని ధ్రువ అధిక పీడన ప్రాంతం అంటారు.

పవనాలు
గాలి ఎప్పుడూ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపునకు ప్రయాణిస్తుంది.
*భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనం అంటారు
👉భూమి ఉపరితలంపై నిటారుగా పైకి కదిలే గాలిని గాలి ప్రవాహం అంటారు.
రెండు ప్రదేశాల మధ్య వీచే గాలి.. పీడన మార్పుపై ఆధారపడి ఉంటుంది.
👉సమాన పీడనం గల ప్రదేశాలను కలిపే రేఖలు.. సమభార రేఖలు (ఐసోబార్‌‌స).
👉రెండు ప్రదేశాల మధ్య పీడన భేదాన్ని పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత ఎక్కువైతే గాలి వేగం పెరుగుతుంది.
👉గాలి వేగాన్ని కొలిచే పరికరం అనిమోమీటర్ (పవనవేగమాపకం) / బ్యూఫోర్టు స్కేల్.
👉సమాన పవన వేగం గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు - ఐసోకైనటిక్స్.
👉గాలి వీచే దిశను సూచించేది పవన సూచిక
👉భూ భ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు.
🔹కొరియాలిస్ బలం భూమధ్యరేఖ వద్ద తక్కువగా, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది.
🔹*కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఫ్సై సూత్రం ప్రకారం ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు కుడి వైపునకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు నెట్టబడతాయి*.

👉పవనాలు రకాలు
🔹పవనాలు మూడు రకాలు అవి..
1) ప్రపంచ పవనాలు
2) కాలాన్ని బట్టి వీచే పవనాలు
3) స్థానిక పవనాలు

1.ప్రపంచ పవనాలు
ఈ పవనాలు ఏడాది పొడవునా నిరంతరం ఒకే దిశలో, స్థిరంగా వీస్తాయి. అందుకే వీటిని స్థిర పవనాలు అని కూడా అంటారు.
👉ప్రపంచ పవనాలు 3 రకాలు

👉వ్యాపార పవనాలు: ఇవి ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖా అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. ఇవి 80-300 అక్షాంశాల మధ్య వీస్తాయి.
🔹వీటిని ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అని అంటారు.
🔹వీటి వేగం గంటకు 15-20 కిలోమీటర్లు. ఈ పవనాల వల్ల ఖండాల తూర్పు తీరాల్లో వర్షం సంభవిస్తుంది.

👉పశ్చిమ పవనాలు: ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి.
🔹ఇవి 350-600 అక్షాంశాల మధ్య వీస్తాయి. వీటిని ప్రతి వ్యాపార పవనాలు అంటారు.
🔹వీటి వేగం గంటకు 45-75 కిలోమీటర్లు.
ఉత్తరార్ధ గోళంలో నైరుతి దిశ నుంచి, దక్షిణార్ధ గోళంలో వాయవ్య దిశ నుంచి వీస్తాయి.
🔹400 అక్షాంశాల వద్ద వీటిని గర్జించే నలభైలు (దక్షిణార్ధ గోళంలో) అంటారు.
🔹500 అక్షాంశాల వద్ద వీచే వీటిని భయపెట్టే యాభైలు, కోపోద్రిక్త యాభైలు అంటారు.
🔹600 అక్షాంశాల వద్ద వీచే వీటిని వణికించే అరవైలు అంటారు.
ఇవి బయలుదేరే ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలు (300 అక్షాంశాలు) అంటారు.

🔹 ధ్రువ తూర్పు పవనాలు: అధిక పీడన ధ్రువ ప్రాంతాల నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. వేగం తక్కువ, స్థిరత్వం ఉండదు.
ఇవి 600-800 అక్షాంశాల మధ్య వీస్తాయి.

2.కాలాన్ని బట్టి వీచే పవనాలు
వీటినే రుతుపవనాలు అంటారు. ఒక రుతువులో ఒక దిశలో, మరొక రుతువులో దానికి వ్యతిరేక దిశలో వీస్తాయి.

🔹భూ పవనాలు: తీరం నుంచి సముద్రం వైపునకు వీస్తాయి.
🔹సముద్ర పవనాలు: సముద్రం నుంచి తీరం వైపునకు వీస్తాయి.
🔹లోయ పవనాలు: పగటి సమయంలో పర్వతాల మీదకు వీస్తాయి.
🔹పర్వత పవనాలు: రాత్రి సమయాల్లో పర్వతాల నుంచి లోయలోకి వీస్తాయి.

👉3.స్థానిక పవనాలు
ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో స్థానికంగా సంభవించే మార్పు వల్ల ఇవి ఏర్పడతాయి.
ఇవి రెండు రకాలు

1. వెచ్చని పవనాలు
2. శీతల పవనాలు.

👉వెచ్చని పవనాలు
🔹ఫోన్: ఆల్ఫ్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ మీదకు వీస్తాయి.

🔹చినూక్: అమెరికా, కెనడాల్లో వీస్తాయి (హిమభక్షకి).

👉శాంట అనా: కాలిఫోర్నియాలో వీస్తాయి.
👉సిరోకో మధ్యధరా సముద్రం నుంచి ఐరోపాకు వీస్తాయి.
🔹బెర్‌‌గ్స:దక్షిణాఫ్రికాలో వీస్తాయి.
🔹నార్వెస్టర్*: న్యూజిలాండ్‌లో వీస్తాయి.
🔹హార్మాటాన్*: పశ్చిమ ఆఫ్రికాలో వీస్తాయి.
🔹సలానో*: స్పెయిన్‌లో వీస్తాయి.
🔹ఖమ్సిన్*: ఈజిప్టులో వీస్తాయి.
🔹గిబ్లీ:* లిబియాలో వీస్తాయి.
🔹గర్బీ:* ఏజివ్, ఏడ్రియాటిక్ సముద్రం మీదుగా వీస్తాయి.
🔹సిమ్మన్:* అరేబియా ఎడారి ప్రాంతంలో వీస్తాయి.
🔹బ్రిక్ ఫెల్లర్:* ఆస్ట్రేలియాలో వీస్తాయి.
🔹జోండా*: అర్జంటీనాలో వీస్తాయి.
శీతల పవనాలు
🔹మిస్ట్రల్:* ఐరోపాలో ఫ్రాన్‌‌స నుంచి మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి.
🔹బోరా:* ఐరోపా (యుగోస్లావియా)లో వీస్తాయి.
🔹పాంపిరో*: అర్జంటీనాలో వీస్తాయి.
🔹బురాన్: రష్యా, సైబీరియాలో వీస్తాయి.
🔹నెవడాస్: గ్రీన్‌లాండ్‌లో వీస్తాయి.
🔹పుర్గా: రష్యాలో వీస్తాయి.
🔹కెటబాటిక్:అంటార్కిటికా ఖండంలో వీస్తాయి.
🔹బైస్: ఫ్రాన్ ‌‌సలో వీస్తాయి.
🔹ప్యూనా: ఆండీస్ పర్వతాల్లో వీస్తాయి.
🔹నార్టె: మెక్సికోలో వీస్తాయి.

👉ప్రాక్టీస్ బిట్స్
1. మంచును తినే పవనం?
1) సిరోకో 2) లెవిచె
3) హార్మాట్టాన్ 4) చినూక్

👉2. భూ పవనం అంటే ?
1) ప్రపంచ పవనం 2) స్థానిక పవనం
3) వ్యాపార పవనం 4) రుతుపవనం

👉3. ఆండీస్ పర్వతాల్లో వీచే పవనం?
1) నార్టె 2) లూ 3) చినూక్ 4) ప్యూనా

🔹సమాధానాలు: 1) 4; 2) 4; 3) 4.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section