Type Here to Get Search Results !

Vinays Info

అఫ్జల్ ఉద్దౌలా | Afjal Uddavla

👉అఫ్జల్ ఉద్దౌలా (11 అక్టోబర్ 1827 - 26 ఫిబ్రవరి 1869) నాసిర్ ఉద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదును క్రీ.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించెను.

👉సిపాయిల తిరుగుబాటు

ఈతని పరిపాలన కాలంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది.
🔹హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన తురాబజ్ ఖాన్ ను బ్రిటిష్ వారు కాల్చి చంపారు. 🔹బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లాఉద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపారు.

🔹ఈ తిరుగుబాటు సమయంలో నిజాం మరియు సాలార్ జంగ్లు కంపెనీకి పూర్తి సహకారం అందించి బ్రిటిష్ వారికి తోడ్పడినందుకు ప్రతిఫలంగా షోలాపూర్ను తిరిగి నిజాంకు స్వాధీనం చేశారు. 🔹నిజాం కంపెనీకి చెల్లించవలసిన 50 లక్షల రూపాయలు రద్దుచేశారు. బ్రిటిష్ వారు నిజాంకు "స్టార్ ఆఫ్ ఇండియా" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section