1. దక్కన్ రాజ్యాలపై ఆధిపత్యం కోసం మహారాష్ట్రులను సైన్యంలో చేర్చుకున్న మొగల్ పాలకుడు
-షాజహాన్
2. మొగలులతో పోరాటానికి మహారాష్ట్రులకు గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇప్పించిన అహమ్మద్‌నగర్ ప్రధాని
-మాలిక్ అంబర్.
3. మహారాష్ట్ర జాతిపిత ఆధునిక మహారాష్ట్ర జాతి నిర్మాత
-శివాజీ
4. శివాజీ జన్మించిన ప్రాంతం
-శివనేర్ దుర్గం
5. శివాజీ జన్మించిన సంవత్సరం
-క్రీ.శ. 1627
6. శివాజీ తల్లిదండ్రులు
-జిజియాబాయి, షాజీ భాన్‌స్లే
7. శివాజీ సంరక్షకుడు
-దాదాజీ కొండదేవ్
8. శివాజీ మతగురువు
-సమర్థ రామదాసు
9. శివాజీ సమకాలీనుడైన మరొక మత ప్రవక్త
-తుకారామ్
10. శివాజీ ఇష్టదైవం
-భవానీ మాత(తుల్జాపూర్)
11. మహారాష్ట్ర విద్యారణ్యస్వామి అని భావించిన భక్తి ఉద్యమ ప్రవక్త
-సమర్థ రామదాసు
12. సమర్థ రామదాసు రచించిన గ్రంథం
-దశబోధ
13. అంజనేయస్వామిని ఆరాధ్యదైవంగా భావించినవాడు
-సమర్థ రామదాసు
14. శివాజీ ఆక్రమించిన తొలి దుర్గం
-తోరన
15. తోరన సమీపంలో శివాజీ నిర్మించిన నూతన దుర్గం
-రాయఘడ్
16. కొంకణ్ ప్రాంతాన్ని జయించిన శివాజీ అక్కడ నిర్మించిన దుర్గం
-ప్రతాప్‌గఢ్
17. 1653లో సింహగఢ్‌ను ఆక్రమించిన శివాజీ దానికి పెట్టిన పేరు
-విజయదుర్గం
18. 1653లో విజయ శకాన్ని ప్రారంభించినవాడు
-శివాజీ
19. పండరీపురంలోని విఠోబా ఆలయాన్ని ధ్వంసం చేసిన వాడు
-అఫ్జల్‌ఖాన్
20. శివాజీ చేతిలో హతుడైన బీజాపూర్ సైన్యాధిపతి
-అఫ్జల్ ఖాన్
21. శివాజీ చేతిలో ఓడిపోయిన మొఘల్ సైన్యాధికారి
-షయిస్త ఖాన్
22. శివాజీ కొల్లగొట్టిన మొఘలుల నౌకా స్థావరం
-సూరత్
23. సూరత్‌ను శివాజీ దోచుకున్న సంవత్సరం
-1664
24. సూరత్‌ను శివాజీ రెండోసారి దోచుకున్న సంవత్సరం
-1670
25. శివాజీ దోచుకున్న పోర్చుగీసు వారి వర్తక స్థావరం
-డామన్
26. శివాజీని ఓడించిన మొఘల్ సైన్యాధికారి
-ఔరంగజేబు సేనాని రాజా జైసింగ్
27. రాజా జైసింగ్‌తో శివాజీ చేసుకున్న సంధి
-పురంధర్ సంధి
28. పురంధర్ సంధి జరిగిన సంవత్సరం
-1665
29. పురంధర్ సంధి ప్రకారం శివాజీ మొఘలులకు అప్పగించిన కోటలు
-23
30. శివాజీ, ఆయన కుమారుడు శంభూజీ మొఘల్ రాజ్యాన్ని దర్శించిన సంవత్సరం
-1666
31. శివాజీకి 'రాజు' అనే బిరుదునిచ్చినవాడు
-ఔరంగజేబు
32. శివాజీ పట్టాభిషిక్తుడైన సంవత్సరం
-జూన్16,1674
33. శివాజీ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన ప్రాంతం
-రాయగఢ్(అక్సిష్టన్ అనే
ఆంగ్లేయుడు హాజరయ్యాడు)
34. శివాజీ పట్టాభిషేకం చేసిన కాశీకి చెందిన వేదపండితుడు
-గార్గభట్టు
35. శివాజీ రాజ్యం పేరు
-స్వరాజ్యం( Free state)
36. పరిపాలనకు ఆధారమైన శివాజీ రూపొందించిన గ్రంథం
-రాజ్యవ్యవహార కోశం
37. శివాజీ ఆస్థానంలోని మంత్రుల సంఖ్య
-8
38. శివాజీ ఆస్థనంలోని మంత్రుల పేరు
-అష్ట ప్రధానులు
39. అష్టప్రధానులు: 1. షీష్వా 2. అమాత్య, 3. మంత్రి
4. సచివ, 5. సేనాపతి, 6. సుమంత్
7. న్యాయాధీశ్, 8.పండితరావు
40. అష్ట ప్రధానుల్లో ప్రముఖుడు
-పీష్వా
41. పీష్వా అనగా
- ప్రధాని
42. మంత్రులపై అధికారం కలిగి సాధారణ పాలనను నిర్వహించే మంత్రి
-పీష్వా
43. భూమిని కొలవడానికి శివాజీ ఉపయోగించిన సాధనం
-కథీ
44. యుద్ధాలలో పాల్గొనవలసిన అవసరం లేని మంత్రులు
-పండితరావు, న్యాయాధీశ్
45. శివాజీ జీతాలను ఏ రూపంలో చెల్లించేవారు?
- ధన రూపం
46. శివాజీ ఎంత పన్నుని వసూలు చేసేవాడు?
- 2/5వ వంతు
47. తన రాజ్యంలో లేని ప్రాంతాలనుండి శివాజీ వసూలు చేసే పన్నులు
-సర్దేశ్‌ముఖి, చౌత్
48. శివాజీ కోటలను 'తల్లి' గా భావించాడు
49. శివాజీ బలమైన నౌకాదళాన్ని ఏర్పరచిన ప్రాంతం
-కొలబా
50. శివాజీ అనుమతితో వర్తక స్థావరాలను ఏర్పరచుకున్న విదేశీయులు
-ఫ్రెంచ్‌వారు
51. శివాజీ నిర్మించిన ముస్లిం పవిత్రుని సమాధి
-బాబా యాకుత్
52. శివాజీపై తిరుగుబాటు చేసిన అతని కుమారుడు
-శంభూజీ
53. శివాజీ మరణించిన సంవత్సరం
-1680
54. శివాజీ అనంతరం మహారాష్ట్ర పాలకులు
- 1. శంభూజీ , 2. రాజారాం
3. తారాబాయి, 4. సాహా
55. శివాజీ అనంతరం సింహాసనం అధిష్టించిన అతని కుమారుడు
-శంభూజీ
56. ఔరంగజేబు చేతిలో మరణించిన మహారాష్ట్ర పాలకుడు
-శంభూజీ
57. శంభూజీ అనంతరం మహారాష్ట్రకు నాయకత్వం వహించిన శివాజీ 2వ కుమారుడు -రాజారాం
58. రాజారాం అనంతరం మహారాష్ట్రకు నాయకత్వం వహించిన రాజారాం భార్య
- తారాబాయి
59. తారాబాయిని ఓడించి మరాఠా రాజ్య బాధ్యతలు చేపట్టిన శంభూజీ కుమారుడు
-సాహూ/ రెండో శివాజీ
60. సాహు విజయానికి కారణమైన మరాఠా యోధుడు
-బాలాజీ విశ్వనాథ్
61. మహారాష్ట్రలో పీష్వాల అధికారాన్ని స్థాపించినవాడు
-బాలాజీ విశ్వనాథ్(1713-20)
62. మహారాష్ట్రలో పీష్వాల అధికారం ప్రారంభమైన సంవత్సరం
-1713
63. మొత్తం పీష్వాల సంఖ్య
-7
64. చౌత్ పన్నును 6 మొగల్ రాష్ట్రాల నుండి వసూలు చేసిన వాడు -బాలాజీ విశ్వనాథ్
65. మహారాష్ట్రను పాలించిన రాజులు 2 రకాలు:
-1. ఛత్రపతులు, 2. పీష్వాలు
66. ఛత్రపతులు అనగా శివాజీ వారసులు
67. సతారా నుండి నామమాత్రంగా శివాజీ వారసులు పరిపాలించారు
68. పూనా నుండి పీష్వాలు పరిపాలించారు
69. సతారా నుండి పరిపాలించిన శివాజీ వారసులు:
1. సాహు (1708-49)
2. రామరాజు(1749-77)
3. రెండో సాహు (1777-1808)
4. ప్రతాప్‌సిన్హా(1808-1839)
5. రెండో షాజీ(1839-1848)
70. మహారాష్ట్రను పరిపాలిం చిన పీష్వాలు:
1. బాలాజీ విశ్వనాథ్
2. మొదటి బాజీరావు
3. బాలాజీ బాజీరావు
4. మాధవరావు
5. నారాయణరావు
6. రెండో మాధవరావు
7. రెండో బాజీరావు
71. 1848లో రెండో షాజీకి సంతానం లేని కారణంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే పేరుతో సతారాను ఆక్రమించిన గవర్నర్ జనరల్
-డల్హౌసి
72. బాలాజీ విశ్వనాథ్ అనంతరం పీష్వా అయిన అతని కుమారుడు
-మొదటి బాజీరావు
73. పీష్వాలలో గొప్పవాడు
-మొదటి బాజీరావు (1720-40)
74. మొదటి బాజీరావు లక్ష్యం -హింద్‌పద్-పద్‌షాహి
75. హింద్‌పద్-పద్‌షాహి అనగా అర్థం
-హిందూ జాతీయ రాజ్యం ఏర్పాటు
76. పాల్కేడ్, భోపాల్ యుద్ధాలలో మొదటి బాజీరావు చేతిలో ఓడిన హైదరాబాద్ పాలకుడు
-నిజాం-ఉల్-ముల్క్
77. మొదటి బాజీరావు కుమారుడు
-బాలాజీ బాజీరావు (1740-61)
78. బెంగాల్, బీహార్‌ల నుండి చౌత్ పన్నును వసూలు చేసిన పీష్వా
-బాలాజీ బాజీరావు
79. బాలాజీ బాజీరావు చేతిలో ఉద్గీర్ యుద్ధంలో ఓడిన హైదరాబాద్ పాలకుడు
-సలబత్ జంగ్
80. మూడో పానిపట్టు యుద్ధకాలం నాటి పీష్వా
-బాలాజీ బాజీరావు
81. మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం
-1761 జనవరి 14
82. మూడో పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రులను ఓడించిన అఫ్ఘన్ నాయకుడు
-అహమ్మద్‌షా అబ్దాలీ
83. అహమ్మద్ షా అబ్దాలీకి సహాయపడిన అయోధ్య నవాబు
-ఘజా ఉద్దౌలా
84. మూడో పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్ర సైన్యానికి నాయకత్వం వహించినవాడు -సదాశివరావు
85. బాలాజీ బాజీరావు అనంతరం పీష్వా అయిన అతని కుమారుడు
-మొదటి మాధవరావు
86. చిన్న వయసులో మొదటి మాధవరావు మరణించగా 'మూడో పానిపట్టు యుద్ధం కన్న మాధవరావు మరణం ఎక్కువ నష్టం కలిగించింది' అని పేర్కొన్న చరిత్రకారుడు
-గ్రాండ్ డఫ్
87. మాధవరావు మరణానంతరం వివిధ ప్రాంతాలలో స్వతంత్రంగా వ్యవహరించిన మహారాష్ట్ర రాజవంశాలు: 1. గ్వాలియర్‌లో సింధియాలు
2. ఇండోర్‌లో హోల్కర్‌లు
3. గుజరాత్‌లో గైక్వాడ్‌లు
4. బీహార్‌లో భాన్‌స్లేలు
88. ఆంగ్లేయులకు-మహారాష్ట్రులకు మధ్య జరిగిన యుద్ధాలు
-మహారాష్ట్ర/మరాఠా యుద్ధాలు
89. పీష్వా మాధవరావు మరణానంతరం బాధ్యతలు చేపట్టిన అతని సోదరుడు -నారాయణరావు
90. పీష్వా నారాయణరావును హత్య చేసి పీష్వా పదవిని అధిష్టించాలని ప్రయత్నించిన అతని పినతండ్రి
-రఘునాథ రావు/ రఘోబా
91. రఘోబాను తరిమివేయడానికి ఏర్పడిన 12 మంది సభ్యుల మహారాష్ట్ర కూటమి -బారాభారు కూటమి
92. బారాభారు కూటమికి నాయకుడు
-నానా పడ్నవీస్
93. రఘునాథరావు ఆంగ్లేయుల సహాయాన్ని కోరి 1775లో ఆంగ్లేయులతో చేసుకున్న ఒప్పందం
-సూరత్ ఒప్పందం
94. మొదటి మరాఠా యుద్ధం జరిగిన కాలం
-1778-82
95. మహారాష్ట్రులతో మొదటి మరాఠా యుద్ధం చేసిన గవర్నర్ జనరల్
-వారన్‌హేస్టింగ్స్
96. మొదటి మరాఠా యుద్ధానికి ముగింపు పలికిన సంధి
-సాల్బే
97. మొదటి మరాఠా యుద్ధం ద్వారా ఆంగ్లేయులు పొందిన నౌకా స్థావరాలు
-సాల్‌సెట్టి, బేసిన్
98. రెండో మరాఠా యుద్ధం జరిగిన కాలం
-1803-05
99. రెండో మరాఠా యుద్ధం చేసిన ఆంగ్ల గవర్నర్ జనరల్
-వెల్లస్లీ
100. మహారాష్ట్రులను, సైన్యసహకార సంధికి ఒప్పించిన గవర్నర్ జనరల్
-వెల్లస్లీ
101. మూడో మరాఠా యుద్ధం(1817-19)లో విజయం సాధించిన గవర్నర్ జనరల్
-మార్క్స్ ఆఫ్ హేస్టింగ్స్
102. పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్
-మార్క్ ఆఫ్ హేస్టింగ్స్
103. 'పిండారీలు' అనే దోపిడీ దొంగలను అణచడానికి మార్క్ ఆఫ్ హేస్టింగ్స్‌కు సహాయపడిన గ్వాలియర్ పాలకుడు
-దౌలత్‌రావు సింధియా
104. పీష్వాలలో ఆఖరివాడు
- రెండో బాజీరావు
105. రెండో బాజీరావు దత్తు కుమారుడు
-నానాసాహెబ్
106. నానాసాహెబ్ అసలు పేరు
-దొండేపంత్
107. 1857 తిరుగుబాటులో పాల్గొన్న 2వ బాజీరావు దత్తు కుమారుడు
-నానాసాహెబ్
108. నానాసాహెబ్ తిరుగుబాటు చేసిన ప్రాంతం
-కాన్పూర్
Indian History Practice Bits - భారతదేశ చరిత్ర ప్రాక్టీసు బిట్స్
October 13, 2016
Tags
1. దక్కన్ రాజ్యాలపై ఆధిపత్యం కోసం మహారాష్ట్రులను సైన్యంలో చేర్చుకున్న మొగల్ పాలకుడు
ReplyDelete-షాజహాన్
2. మొగలులతో పోరాటానికి మహారాష్ట్రులకు గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇప్పించిన అహమ్మద్‌నగర్ ప్రధాని
-మాలిక్ అంబర్.
3. మహారాష్ట్ర జాతిపిత ఆధునిక మహారాష్ట్ర జాతి నిర్మాత
-శివాజీ