Type Here to Get Search Results !

Vinays Info

పంచవర్ష ప్రణాళికలు | Five Year Plans - VINAYSINFO

👉మొదటి పంచవర్ష ప్రణాళిక

-ప్రణాళిక అమలు కాలం- 1950-56
-నమూనా- హరాడ్ డోమర్ నమూనా
-ప్రణాళిక లక్ష్యం- వ్యవసాయరంగం అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం
-ప్రణాళిక సంఘం అధ్యక్షుడు- జవహర్‌లాల్ నెహ్రూ
-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు - జీఎల్ నందా
-వృద్ధిరేటు లక్ష్యం- 2.1 శాతం
-సాధించిన వృద్ధిరేటు- 3. 6శాతం
-ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 53.5 శాతం
-ప్రైవేటురంగం వాటా- 46.5 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 1960 కోట్లు
-స్థాపించిన సంస్థలు- హిందుస్థాన్ మెషిన్‌టూల్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ, చిత్తరంజన్ రైలు ఇంజిన్ ఫ్యాక్టరీ, హిందుస్థాన్ షిప్ బిల్డర్స్, నాగార్జునసాగర్, భాక్రానంగల్, హిరాకుడ్ బహుళార్థసాదక ప్రాజెక్టులు.
-ప్రారంభించిన పథకాలు- సమాజాభివృద్ధి కార్యక్రమం (సీడీపీ)-1952, సమాజ విస్తరణ అభివృద్ధి కార్యక్రమం-1953

👉రెండో పంచవర్ష ప్రణాళిక

-ప్రణాళిక కాలం- 1956-61
-నమూనా- పీసీ మహలనోబిస్ నమూనా
-ప్రణాళిక లక్ష్యం- ప్రభుత్వరంగానికి ప్రాధాన్యం
-ప్రణాళికసంఘం అధ్యక్షుడు- జవహర్‌లాల్ నెహ్రూ
-ఉపాధ్యక్షుడు వీటీ కృష్ణమాచారి
-వృద్ధిరేటు లక్ష్యం - 4.5శాతం
-సాధించిన వృద్ధిరేటు- 4.1 శాతం
-ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 60.3 శాతం
-ప్రైవేటు రంగం వాటా- 39.7 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 4,600 కోట్లు
-స్థాపించిన సంస్థలు- రూర్కెలా ఇనుము- ఉక్కు పరిశ్రమ (జర్మనీ సహకారం), దుర్గాపూర్ ఇనుము-ఉక్కు కర్మాగారం (బ్రిటన్ సహకారం), భిలాయ్ ఇనుము- ఉక్కు కర్మాగారం (రష్యా సహకారం)
ఈ ప్రణాళికను ధైర్యవంతుల ప్రణాళిక అని కూడా అంటారు.

👉మూడో పంచవర్ష ప్రణాళిక
 

-ప్రణాళిక కాలం - 1961-66
-నమూనా - పీసీ మహలనోబిస్ 2 రంగాల నమూనా
-ప్రణాళిక లక్ష్యం - వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించడం
-ప్రణాళికా సంఘం అధ్యక్షులు - జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి
-ఉపాధ్యక్షుడు - జీఎల్ నందా
-వృద్ధిరేటు లక్ష్యం - 5.6 శాతం
-సాధించిన వృద్ధిరేటు - 2.8 శాతం

-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా - 64.7 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రైవేటురంగం వాటా - 35.3 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి - రూ.8,580 కోట్లు
-ఈ ప్రణాళిక కాలంలో రష్యా సహకారంతో బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు.
-1964లో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI), 1965లో భారత ఆహార సంస్థ (FCI)లను స్థాపించారు.
-హరితవిప్లవం ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభమైంది.
- ఈ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు.

👉నాలుగో పంచవర్ష ప్రణాళిక

-ప్రణాళిక కాలం - 1969-1974
-నమూనా - శ్రీ మన్నే, రుద్ర నమూనా. ఇది అమెరికా ఆర్థికవేత్త లియాంటిఫ్ నమూనా (ఇన్‌పుట్-అవుట్‌పుట్ మోడల్)ను పోలి ఉంటుంది.
-ప్రణాళిక లక్ష్యం - స్థిరత్వంతో కూడిన వృద్ధిరేటు, స్వావలంబన సాధన
-ప్రణాళికా సంఘం అధ్యక్షురాలు - శ్రీమతి ఇందిరా గాంధీ
-ఉపాధ్యక్షుడు - డీఆర్ గాడ్గిల్
-వృద్ధిరేటు లక్ష్యం - 5.7 శాతం

-సాధించిన వృద్ధిరేటు - 3.3 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా - 63.9 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రైవేటురంగం వాటా - 36.1 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి - రూ.15,900 కోట్లు
-ఈ ప్రణాళిక కాలంలో రష్యా సహకారంతో విశాఖపట్నం, కర్ణాటకలోని విజయనగర్, తమిళనాడులోని సేలంలో 3 మినీ స్టీల్ కర్మాగారాలను స్థాపించారు.
-ఈ ప్రణాళిక కాలంలోనే (1971లో) ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ప్రారంభించారు.
-శ్వేత విప్లవం (1970), ఉపాధి హామీ పథకం (1972-మహారాష్ట్ర), కరువు పీడిత ప్రాంతాల పథకం (1973) ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభమయ్యాయి.
-చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజెన్సీ, ఉపాంత రైతుల వ్యవసాయ కూలీల ఏజెన్సీలను కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేశారు.

👉ఐదో పంచవర్ష ప్రణాళిక
 

-ప్రణాళిక కాలం- 1974-1979

-నమూనా- జవహర్‌లాల్ నెహ్రూ, టీఎన్ కృష్ణ నమూనా

-ప్రణాళిక లక్ష్యం- పేదరిక నిర్మూలన, స్వావలంబన సాధన

-ప్రణాళికా సంఘం అధ్యక్షురాలు- ఇందిరాగాంధీ

-ఉపాధ్యక్షుడు- పీఎన్ హక్సల్

-వృద్ధిరేటు లక్ష్యం- 4.4 శాతం

-సాధించిన వృద్ధిరేటు- 4.8 శాతం

-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 69.7 శాతం

-ప్రణాళికా వ్యయంలో ప్రైవేటురంగం వాటా- 30.3 శాతం

-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 39,430 కోట్లు

-ఈ ప్రణాళిక కాలంలో 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 1976లో మొదటి జాతీయ జనాభా విధానాలను ప్రారంభించారు.

-ఈ ప్రణాళిక కాలంలో అమలైన పథకాలు..

1974లో- జాతీయ కనీస అవసరాల పథకం
1975లో- 20 సూత్రాల కార్యక్రమం
1977లో- పనికి ఆహార పథకం (నిజ వేతన పథకం)
1977లో- అంత్యోదయ (రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభమైంది)
1978-79లో- సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం

-ఒకటో ప్రణాళిక నుంచి ఐదో ప్రణాళిక వరకు సగటు వృద్ధిరేటు 3.5 శాతంగా ఉంది.

👉ఆరో పంచవర్ష ప్రణాళిక

-ప్రణాళిక కాలం- 1980-1985
-నమూనా- జవహర్‌లాల్ నెహ్రూ, హారడ్
-ప్రణాళిక లక్ష్యం- పేదరిక నిర్మూలన, స్వావలంబన సాధన
-ప్రణాళికా సంఘం అధ్యక్షులు- ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ
-ఉపాధ్యక్షుడు- ఎన్‌డీ. తివారీ
-వృద్ధిరేటు లక్ష్యం- 5.2 శాతం
-సాధించిన వృద్ధిరేటు- 5.7 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 61.7 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రైవేట్‌రంగం వాటా- 38.3 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 1,09,290 కోట్లు
-ఈ ప్రణాళిక కాలంలో బ్లూ రెవల్యూషన్ (నీలి విప్లవం) 1980లో ప్రారంభించబడింది.
-ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు
-1980లో- జాతీయ గ్రామీణ ఉపాథి పథకం (ఎన్‌ఆర్‌ఈపీ)
-1982లో- గ్రామీణ ప్రాంతాల స్త్రీ, శిశు అభివృద్ధి పథకం
-1983లో- గ్రామీణ భూమి లేని వారి ఉపాధి హామీ పథకం
-1985లో- ఇందిరా ఆవాస్ యోజన

👉ఏడో పంచవర్ష ప్రణాళిక

-ప్రణాళిక కాలం- 1985-1990
-నమూనా- జవహర్‌లాల్ నెహ్రూ, మహలనోబిస్
-ప్రణాళిక లక్ష్యం- ఆహారం, పని, ఉత్పాదకత
-ప్రణాళికా సంఘం అధ్యక్షులు- రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్
-ఉపాధ్యక్షుడు- మన్మోహన్‌సింగ్
-వృద్ధిరేటు లక్ష్యం- 5 శాతం

-సాధించిన వృద్ధిరేటు- 6 శాతం
-ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 51.7 శాతం
-ప్రైవేట్‌రంగం వాటా- 48.3 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 2,18,730 కోట్లు
-ఈ ప్రణాళిక కాలంలో 1986లో CAPART, 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ స్థాపించారు.
-ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు
-1986లో- పట్టణ పేదలకు స్వయం ఉపాధి పథకం
-1988లో- మిలియన్ బావుల పథకం
-1989లో- జవహర్ రోజ్‌గార్ యోజన
-1989లో- నెహ్రూ రోజ్‌గార్ యోజన

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section