🔹ప్రాచీన సంకుచిత భావన ప్రకారం పాఠ్య ప్రణాళిక అంటే పఠనం కోసం నిర్దేశించిన నియమిత పాఠ్యాంశాలు. విద్యాప్రణాళిక పరిధి విస్తృతంగా ఉంది.
🔹ఆధునిక భావన ప్రకారం విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపమే “పాఠ్యప్రణాళిక”.
లాటిన్‌లోని 'కరీర్' నుంచి 'కరిక్యులమ్' అనే ఆంగ్ల పదం వచ్చింది.
🔹కరీర్ అంటే 'పందెపు బాట' లేదా 'పరుగెత్తే దారి'.విద్యాపరంగా నిర్వచనం - 'బోధనా వ్యవస్థ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలనుచేరుకోవడానికి ఉపయోగించే మార్గం'.
👉కన్నింగ్‌హామ్ ప్రకారం
🔹పాఠశాల్లో నిర్ధారించిన లక్ష్యాలు, ఉద్దేశాలనూ రూపుదిద్దేటట్లు చేయడానికి ఒకకళాకారుడిలా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం.
🔹విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళికలో పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం లాంటివిలువలను పెంచే అంశాలుంటాయి.
🔹జాతీయ స్థాయిలో కింది మార్గదర్శక సూత్రాల ననుసరించి సైన్స్ పాఠ్య ప్రణాళికఉండాలి.
బయటి జీవితాన్ని, జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానం చేయాలి.
🔹కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి.
🔹పాఠ్య పుస్తకాల్లో చిక్కుకునేలా కాకుండా, విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాల్నిరూపొందించుకోవాలి.
🔹పరీక్షల్ని మరింత సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి.
🔹కరిక్యులమ్ ఆచరణలో ఇమిడి ఉన్న అంశాలు
జ్ఞాన నిర్మాణం కోసం బోధన.
🔹చుట్టూ ఉన్న పరిసరాలు, వస్తువులు, ప్రజలతో భాష, వివిధ కార్యక్రమాలతో జరిపే ప్రతి చర్య ద్వారా అభ్యసనం
అభ్యసనానుభవాల్ని రూపొందించడం
🔹ప్రణాళిక పట్ల వైఖరి
🔹విమర్శనాత్మక బోధనా వ్యూహం
🔹విజ్ఞానశాస్త్రం - పాఠ్య ప్రణాళిక
🔹నిజమైన విజ్ఞానశాస్త్ర విద్య అంటే పిల్లవాడికి తన జీవితం గురించి శాస్త్రీయంగా నిజాలు చెప్పడమే.
🔹పిల్లల వయసుకు తగిన విషయం, పద్ధతి, భాష, బోధనానుభవాలతో కూడిన జ్ఞానాన్ని అందించేలా కరిక్యులమ్ఉండాలి.
🔹పిల్లల్లోని సహజమైన కుతూహలం, సృజనాత్మకతలను మెరుగుపర్చేలా నేర్చుకునే పద్ధతులు, విధనాలు ఉండాలి.
🔹కరిక్యులమ్‌లో సైన్స్ చరిత్రకు తగినంత ప్రాధాన్యముండాలి.
👉ప్రాథమిక స్థాయి
🔹ప్రస్తుతం సైన్స్‌ను, సామాజిక శాస్త్రాలను కలిపి పర్యావరణ విద్యగా (పరిసరాల విజ్ఞానం) బోధిస్తున్నారు. ఆరోగ్యానికిఇందులో చాలా ప్రాధాన్యమిస్తున్నారు.
🔹ప్రాథమిక స్థాయిల్లో పీరియాడికల్ పరీక్షలు, మార్కులు, గ్రేడులను నిర్ణయించడం, అదే తరగతిలో మళ్లీ చదివించడంఉండకూడదు.
👉మాధ్యమిక స్థాయి
🔹సుపరిచిత ప్రయోగాలు, సరళమైన సాంకేతిక డిజైన్లు, నమూనా నిర్మాణాల ద్వారా శాస్త్రీయ సూత్రాలను పిల్లలునేర్చుకోవాలి.
🔹వివిధ కృత్యాలు, సర్వేల్లో పాల్గొనడం ద్వారా పరిసరాలు, ఆరోగ్యం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి.
🔹మాధ్యమిక స్థాయిలో నిరంతర నియమిత కాల వ్యవధి మూల్యాంకనాలు (యూనిట్ పరీక్షలు, టెర్మినల్ పరీక్షలు)ఉండాలి. ప్రత్యక్ష పద్ధతి ద్వారానే గ్రేడింగ్ ఇవ్వాలి. తప్పిపోవడం ఉండకూడదు.
👉సెకండరీ స్థాయి
🔹విద్యార్థి వివిధ అంశాలతో కూడిన శిక్షణ ద్వారా సైన్స్‌ను నేర్చుకోవాలి. మాధ్యమిక స్థాయి కంటే మరింత మెరుగైనసాంకేతిక అంశాలనూ, పరికరాలను ఉపయోగించి ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలి.
👉విజ్ఞానశాస్త్రం - సహ పాఠ్య ప్రణాళిక
🔹విద్యార్థిలో పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మక శక్తిని పెంపొందించేలా, పరిశోధనాభిలాషను కలిగించేలాపాఠశాలలు కృషి చేయాలి. వీటి కోసం విద్యా బోధనలో సహ పాఠ్యాంశాలు, పాఠ్యేతర అంశాలకు అధికప్రాధాన్యమివ్వాలి.
🔹సైన్స్ సహపాఠ్య కార్యక్రమాలు
🔹సైన్స్ కార్నర్ల ఏర్పాటు,
🔹సైన్స్ కిట్‌ల తయారీ,
🔹ప్రయోగశాలల ఏర్పాటు,
🔹సమాచార, ప్రసార సాంకేతికపరిజ్ఞానం,
🔹చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్' లలో పాల్గొనడం,
🔹సైన్స్ ఎగ్జిబిషన్‌ల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులుసాధించిన అంశాలను ప్రదర్శించడం,
🔹సైన్స్ సెమినార్లను నిర్వహించడం,
🔹సైన్స్ డ్రామాల్లో పాల్గొనడం,
🔹కళావిద్యను (చిత్రలేఖనం, శాస్త్రీయ భావనలు ఉన్న నృత్యాలు, హస్తకళలు, దృశ్యకళలు, తోలుబొమ్మలు)ప్రోత్సహించడం,
🔹పర్యావరణ విద్యా కార్యక్రమాలను నిర్వహించడం,
🔹క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన విహార యాత్రలనుచేపట్టడం,
🔹పనివిద్య ద్వారా, విజ్ఞానశాస్త్రాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం.
🔹ఆరోగ్య, వ్యాయామ విద్యకుసంబంధించిన కృత్యాలను చేయించడం,
🔹ఉపాధ్యాయులు, పిల్లల మధ్య సంబంధాల్లో, బోధనాభ్యసన ప్రక్రియలోనిఅన్ని అంశాల్లో శాంతి విద్య ప్రతిబింబించాలి.
👉విషయ ప్రణాళిక
🔹విషయ ప్రణాళిక అనేది ఆయా తరగతుల్లో బోధించాల్సిన విషయం. ఇది అంశాల విస్తృతినీ, పరిమితినితెలియజేస్తుంది. విషయ ప్రణాళిక ఒక తరగతి విద్యార్థుల మానసిక స్థాయి, విషయజ్ఞానం, దశలపై ఆధారపడిఉంటుంది. జాతీయ పాఠ్యప్రణాళిక - 2005ని అనుసరించి ఎలిమెంటరీ దశ (I-VIII) లోని తరగతులకు, సెకండరీ దశ(IX,X) లోని తరగతులకు, హయ్యర్ సెకండరీ దశ (XI,XII) లోని తరగతులకు విషయ ప్రణాళికను తయారుచేశారు.
🔹I,II తరగతుల్లో పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలను భాష, గణిత, పాఠ్య పుస్తకాలకు సంబంధించినవిషయ ప్రణాళికలకు అనుసంధానం చేశారు. 'సామాన్య శాస్త్రం' విషయ ప్రణాళిక VI నుంచి X వరకు ఆయా తరగతుల స్థాయిని బట్టి ఏడు ప్రధానాంశాలతోవివరించారు. అవి: 1. ఆహారం 2. పదార్థాలు 3. జీవ ప్రపంచం 4. వస్తువులు ఎలా పనిచేస్తాయి. 5. కదిలే వస్తువులు6. సహజ దృగ్విషయాలు 7. సహజ వనరులు.
🔹విద్యా కమిషన్‌లు, కమిటీల సిఫార్సులు
సెకండరీ విద్యా కమిషన్ (1952) అభిప్రాయాలు
🔹అనుభవాల సమగ్ర రూపం
🔹భిన్నత్వ మార్పులకు అనుగుణం
🔹సామాజిక జీవనంతో సంబంధం
🔹విరామ సమయ వినియోగానికి శిక్షణ
🔹సమైక్యత, సహ సంబంధం
👉కొఠారీ కమిషన్ సూచనలు: (1964-66)
🔹పాఠశాల్లో విద్యా ప్రణాళిక విస్తృత పరిధిలో ఉండాలని కొఠారీ సూచించారు.
🔹పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పులుండాలి.
🔹పాఠ్య పుస్తకాలను, బోధనాభ్యసన సామాగ్రిని హెచ్చు స్థాయిలో రూపొందించాలి.
పాఠ్య ప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.
🔹కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించడంలోనూ, విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా రూపొందించడానికి ప్రయత్నించడంలోనూ పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలుండాలి.
🔹వివిధ విద్యా విభాగాలు, శాఖలు జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగా పాఠశాల పాఠ్య ప్రణాళికను రూపొందించాలి.
🔹కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం ప్రాథమిక దశలో విద్యార్థికి సంబంధించిన సామాజిక, భౌతిక, జీవనసంబంధమైన పరిసరాలకు ప్రాధాన్యమివ్వాలి.
🔹ప్రాథమికోన్నత దశలో విద్యార్థుల జ్ఞాన సముపార్జనతోపాటు, తార్కికంగా ఆలోచించడంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి.
👉ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ (1977)
🔹పరిశీలన ద్వారా జ్ఞానాన్ని పొందడం.
🔹ఆటపాటల ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంచడం, జట్టు భావనను పెంపొందించడం.
సామాజికంగా ఉపయోగపడే కృత్యాల ప్రణాళికను రూపొందించడం, అమలుపరచడంలో నైపుణ్యాన్ని ఏర్పరచడం.
🔹సృజనాత్మక శక్తిని పెంపొందించడం.
🔹స్వయం అభ్యసనంలో నైపుణ్యాలను ఏర్పరచడం.
🔹కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుచేసి రసాత్మక దృష్టిని, అభినందనను పెంపొందించడం.
🔹జీవితంలో అన్ని రంగాల్లో సమైక్యత, ఓర్పు, సహకారం, నిరాడంబరత అలవర్చుకునేలా చేయడం.
👉జాతీయ విద్యావిధానం (1986)
🔹సమస్యా పరిష్కార పద్ధతి, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించడమే ప్రధానాంశాలుగా పాఠ్యప్రణాళికఉండాలి.
జాతీయ సమగ్ర పాఠ్యప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం కోసం శాస్త్ర పాఠ్యప్రణాళికకుసంబంధించిన అంశాలైన 1. పర్యావరణ పరిరక్షణ, 2. పరిమిత కుటుంబ భావన, 3. శాస్త్రీయ వైఖరులనుపెంపొందించడం.
కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, వివరాలను అందించడం. వివిధ శాస్త్ర విభాగాల సమన్వయం తెలపడం.
🔹పరిసరాలకు సంబంధించిన వివిధ అంశాలపై నిశితమైన ప్రశ్నలు వేసేట్లు చేయడం.
🔹విద్యార్థుల్లో సామాజిక, నైతిక విలువలను పెంచడానికి శాస్త్రాన్ని ఒక సహాయకంగా తెలియజేయడం.
🔹విశాల దృక్పథాన్ని, జ్ఞానపరమైన నిజాయితీని అలవరచుకోవడం, ప్రశ్నించడంలో ధైర్యం పెంచుకోవడం, శాస్త్రీయవైఖరి, విధానాలను వృద్ధిచేయడం.
🔹శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం, జీవావరణ వ్యవస్థను కాపాడటం, శాస్త్రాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలపైజాగరూకులను చేయడం.
👉మూల పాఠ్యప్రణాళిక
🔹ప్రజాస్వామ్య సమాజంలో సమర్థంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు అవసరం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలనువృద్ధిచేసే అభ్యసనానుభావాల సమూహమే 'మూల పాఠ్యప్రణాళిక'.
🔹పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రాలు
శిశుకేంద్రీకృత, 2.సమాజ కేంద్రీకృత, 3. సమైక్యతా, 4. కృత్యకేంద్రీకృత, 5.పరిరక్షణ, 6. సృజనాత్మక, 7. దూరదృష్టి, 8. మార్పునకు అనువుగా ఉండే, 9. అనుభవ సామస్త్య, 10. వ్యవస్థీకరణ సూత్రాలు.
🔹బ్రూబేకర్ అభిప్రాయం ప్రకారం పాఠ్యప్రణాళికలో విద్యార్థులను ఇమడ్చడం కాకుండా విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళికరూపుదిద్దుకోవాలి.
వ్యవస్థీకరణ ఉపగమాలు / విధానాలు
👉ఏకకేంద్ర పద్ధతి:(Concentric Method): ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలోఅభివృద్ధి చెందించే పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అంటారు.
👉అంశాల పద్ధతి లేదా శీర్షిక విధానం:(Topic Method): శాస్త్ర సంబంధమైన సూత్రం లేదా ఆసక్తి ఉన్న అంశాన్నిఎంచుకుని సంబంధిత విషయాలన్నింటినీ కేంద్రీకరించి ప్రణాళికను తయారుచేస్తే అది శీర్షిక పద్ధతి. శీర్షిక పద్ధతిలో అంశాలు 1. జీవనకేంద్రిత, 2. పరిసర కేంద్రిత, 3. పరిసర, జీవన కేంద్రిత అంశాలుగా విభజించిఉంటాయి.
🔹ప్రక్రియ పద్ధతి: ప్రక్రియల ఆధారంగా ఏర్పరచడం.
🔹భావన పద్ధతి: ఇది COPES (Conceptually Oriented Programme in Science) ఆధారంగాఅభివృద్ధిచెందింది. ప్రణాళికలో ఎంపిక చేసిన 5 భావన పథకాలు విశ్వనిర్మాణాత్మక ప్రమాణాలు, ప్రతిచర్య, మార్పు, శక్తి పరిరక్షణ, శక్తి తరుగుదల, సాంఖ్యక శాస్త్ర ఉద్దేశంలో ప్రకృతి.
🔹సమైక్య లేదా శాఖాంతర పద్ధతి: పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో శాఖాంతర పద్ధతి ఒక ముఖ్యమైన ఆధునిక పోకడ.సమైక్య విధానంలో సబ్జెక్టుల మధ్య సహసంబంధం ద్వారా విద్యార్థుల్లో అవగాహన ఏర్పరచడం. గాంధీజీ ప్రతిపాదించినబేసిక్ విద్యా విధానంలోని మూల సూత్రం సహసంబంధం.
🔹యూనిట్ పద్ధతి: యూనిట్ వ్యవస్థను ఎక్కువగా అభివృద్ధి చేసింది మోరిసన్. ఇది రెండు రకాలు. 1. మూలాధారయూనిట్, 2. బోధనా యూనిట్.
యూనిట్‌లో భాగాలు:
🔹ప్రేరణ
🔹సంకీర్ణ దృష్టి
🔹నేపథ్యాన్ని కనుక్కోవడం
🔹కొత్త అనుభవాలను చేర్చడం
🔹అభ్యసనాల నిర్వహణ
🔹విషయ సంగ్రహణ
🔹పునర్విమర్శ
🔹మూల్యాంకనం
👉చారిత్రక పద్ధతి: విషయాలను చరిత్రను అనుసరించే క్రమంలో అంటే వాటిని కనుక్కున్న క్రమంలో అమర్చడం.
🔹తార్కిక క్రమ పద్ధతి.
🔹రుతుక్రమ అమరిక విధానం.
🔹పాఠ్య ప్రణాళిక
సమాజంలో మార్పుతీసుకురాగల చైతన్యవంతమైన విధానంగా విద్యను పరిగణిస్తున్నారు. విద్యావిధానంలో పాఠ్య ప్రణాళికకు చాలా ప్రాముఖ్యం ఉంది.
భావిభారత పౌరులను తీర్చిదిద్దే పాఠ్యప్రణాళిక రేపటి సమాజానికి కావాలి.
🔹విద్యార్థిలో మానసికాభివృద్ధి క్రమానుగతమైంది. కాబట్టి, పాఠ్యప్రణాళిక రచనలో ముందు దశలను ఆధారంగాచేసుకొని భవిష్యత్తు దశలను రూపొందిస్తూ నిరంతర ప్రగతికి దోహదం చేసే విధానాన్ని పాటించాలి.
🔹పాఠ్యప్రణాళికలో శాస్త్రసత్యాలు, భావనలు, సూత్రాలు మొదలైన వాటిని పొందుపరచి, వాటి వినియోగ విలువలకుప్రాముఖ్యం ఇవ్వాలి.
శాస్త్రీయ విధానాలు, పద్ధతులు పాఠ్యప్రణాళికలో అంతర్లీనంగా ఉండాలి. శాస్త్రపరిజ్ఞానం, శాస్త్రీయవిధానాలు, ఒక వ్యక్తికినిజజీవితంలోఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడేలా పాఠ్య ప్రణా ళికను రూపొందించాలి.
🔹పాఠ్యప్రణాళిక అనే తెలుగు పదానికి, కరిక్యులం అనే ఆంగ్ల పదం మూలం. ఇది కరీర్ (career) అనే లాటిన్ పదంనుంచి వచ్చింది. కరీర్ అంటే పందెపు బాట లేదా పరిగెత్తే దారి అని అర్థం.
🔹నిర్వచనాలు
🔹విద్యా పరంగా నిర్వచిస్తే బోధనాభ్యసన కార్య క్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గమే పాఠ్యప్రణాళిక.
🔹పాఠశాలలో నిర్ధరించిన లక్ష్యాలను, ఉద్దేశాలను చేరుకునేందుకు ఉపాధ్యాయుడు ఒక కళాకారుడిలా ఉపయోగించేసాధనాన్నే కరిక్యులం అంటారు.- కన్నింగ్‌హమ్ (Cunningham)
🔹విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం ఉపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల(కృత్యాల) సమాహారమే పాఠ్యప్రణాళిక.
🔹ఆటస్థలంలో, గ్రంథాలయంలో, తరగతిగదిలో పాఠశాల వెలుపల కూడా విద్యార్థి పొందే ఉద్దేశపూర్వకమైన,యోజనచేసిన అనుభవాల సమ్మేళనమే పాఠ్యప్రణాళిక. - సెకండరీ విద్యాకమిషన్
🔹పాఠ్యప్రణాళిక విషయప్రణాళిక (సిలబస్) + సహపాఠ్య కార్యక్రమాలు+ పాఠ్యేతర కార్యక్రమాలు.
పాఠశాలలో విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపాలే పాఠ్యప్రణాళిక. పాఠశాల జీవితంమొత్తాన్నిపాఠ్యప్రణాళికగా చెప్పవచ్చు.
విద్యాప్రణాళిక పరిధి (పాఠ్యప్రణాళిక పరిధి) విస్తృతమైంది. పాఠశాలకు పాఠ్యప్రణాళికే జీవం.విద్యా ఉద్దేశాలనుసాధించడం కోసం విద్యాసంస్థల్లో రూపొందించి అమలు జరిగే కార్యక్రమాల అనుభవాల సమ్మేళనం పాఠ్యప్రణాళిక.ప్రాచీనమైన, సంకుచితమైన భావన ప్రకారం పాఠ్యప్రణాళిక అంటే పఠనం కోసం నిర్దేశించిన నియమిత పాఠ్యాంశాలు..అంటే సిలబస్.
🔹ప్రాచీన దృక్పథంలో విజ్ఞానశాస్త్ర బోధన విషయప్రణాళికలో లక్ష్యాలకు, విషయవ్యవస్థీకరణ విధానానికి,మూల్యాంకనానికి అగ్రస్థానం ఉండేది. కానీ నేడు సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, పరిశీలనాత్మక దృష్టినిఏర్పరచడానికి, సమస్య పరిష్కార విధానానికి పాఠ్యప్రణాళికలో అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నారు.
🔹విషయప్రణాళిక (సిలబస్) అనేది ఒక తరగతి ఒక విషయం (Subject)లో బోధించవలసిన అంశాల విస్తృతినీ,పరిమితినీ తెలియజేస్తుంది. ఇది ఆ తరగతి విద్యార్థుల మానసికస్థాయి, విషయజ్ఞానం, దశలపై ఆధారపడి ఉంటుంది.పాఠ్య, విషయ ప్రణాళికలే కాకుండా పద్ధతులు, ఉపకరణాలు, వనరులతో ఎన్నో అంశాలపై ఆదారపడి ఉంటుంది.
🔹1986 - జాతీయ విద్యా విధానంలో జాతీయ సమగ్ర పాఠ్యప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడంకోసం శాస్త్రపాఠ్య ప్రణాళికకు సంబంధించి కొన్ని అంశాను చేర్చారు. అవి.. 1. పర్యావరణ పరిరక్షణ 2. పరిమిత కుటుంబభావన 3. శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం.
🔹పాఠ్యప్రణాళికలోని ప్రధానాంశాలు - నిర్దేశించిన లక్ష్యాలు
అభ్యసనానుభవాలు.ఈ రెండు అంశాల ఆధారంగా పాఠ్యప్రణాళికలో రెండు విభాగాలుంటాయి.
విషయాత్మక భాగం: దీనిలో విషయ పరిజ్ఞానం, అవగాహన ఉంటాయి.
🔹బోధనా విభాగం: ఇందులో లక్ష్యసాధన కోసం వ్యవస్థీకరించిన విషయాలు, బోధనాభ్యసన కృత్యాలు, వనరులుఉంటాయి. శాస్త్ర అధ్యయనం సందర్భంగా విషయాన్ని ఎంపిక చేయడంలో పాటించవలసిన కొన్ని మౌలిక సూత్రాలు:ప్రాథమిక లేదా మౌలిక పరిజ్ఞానాన్నందించే, బోధనకు అనువుగా ఉండే, సామాజికావసరాలకు సంబంధించినవిషయాలు, నిత్యజీవితానికి సంబంధించిన, విద్యార్థుల ప్రజ్ఞ, ఆసక్తి, అభిరుచులకు తగినట్లుండే విషయ జ్ఞానం.
పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రాలు
🔹శిశు కేంద్రీకృత సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థుల వయసుకు తగినట్లు, వారి అవసరాలను తీర్చేట్లు ఉండాలి.
సమైక్యతా సూత్రం: ఆధునిక యుగంలో విద్యార్థి అవ సరాలను, కృత్యాలనూ సమైక్య పరిచే, మూర్తిమత్వాన్నిపెంపొందించే పాఠ్యప్రణాళికను రూపొందించాలి.
🔹సమాజ కేంద్రీకృత సూత్రం: పాఠ్యప్రణాళిక సమాజం ఉద్దేశాలనూ, అవసరాలనూ సంస్కృతినీ ప్రతిబింబించేలా ఉండాలి.
సృజనాత్మక సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థిని ఒక పరిశోధకుడి స్థానంలో ఉంచి, సృజనాత్మక కృత్యాలకు అవకాశంకల్పించేదిగా ఉండాలి.
🔹సంరక్షణ సూత్రం: పాఠ్యప్రణాళిక, మన నాగరికతను, సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించడానికి వీలు కల్పించేదిగాఉండాలి.
కృత్యాధార సూత్రం: 'చేయడం ద్వారా అభ్యసనం' అనే మనో విజ్ఞానశాస్త్ర సూత్రాన్ని సంతృప్తి పరిచేదిగా, 'శాస్త్రమంటేచేయడం' అనే నిర్వచనానికి ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉండాలి. వ్యక్తిగత ప్రయోగశాల కృత్యాలకూ, పర్యటనానుభవాలకుప్రాధాన్యం ఇవ్వాలి.
ముందుచూపు/ దూరదృష్టి సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థిని పూర్తిస్థాయి వ్యక్తిగా రూపొందించేదిగా ఉండాలి.
🔹వైవిధ్య, స్థితిస్థాపక సూత్రం: పాఠ్యప్రణాళిక మారుతున్న సమాజం, విద్యార్థుల అవసరాలకు, వారిలోని వివిధఆసక్తులకూ తగినట్లు ఉండాలి. విశాల దృక్పథంతో ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా అమలు చేయడానికి అనువైనసర్దు బాటుకు వీలుండాలి.
🔹సంపూర్ణ అభ్యసనానుభవ సూత్రం: శాస్త్ర లక్ష్యాలు ఉద్దేశాలన్నిట్లో అభ్యసనానుభవాలను ఏర్పరుస్తూ నిత్య జీవితంలోఉపయోగపడే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి. శాస్త్రాన్ని భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లా చూడకుండా విజ్ఞానాన్నంతాశాస్త్ర ఫలితంగా చూడగలిగేలా ఉండాలి.
🔹విరామ సమయ వినియోగ సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగినఅలవాట్లు పెంపొందించేలా ఉండాలి.
పాఠ్యప్రణాళిక గురించి సెకండరీ విద్యాకమిషన్ అభిప్రాయాలు
🔹అనుభవాల సమగ్రరూపం
🔹భిన్నత్వం, మార్పులకనుగుణం
🔹సామాజిక జీవనంతో సంబంధం
🔹విరామ సమయ వినియోగానికి శిక్షణ
🔹సమైక్యత, సహ సంబంధం.
🔹పాఠ్యప్రణాళిక అభివృద్ధికి కొఠారి కమిషన్ చేసిన సూచనలు
🔹పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పు లుండాలి. పాఠశాలలో విద్యాప్రణాళిక విస్తృత పరిధితో ఉండాలి.పాఠ్యపుస్తకాలు, బోధనాభ్యసన సామాగ్రిని హెచ్చు స్థాయిలో రూపొందించాలి. పాఠ్య ప్రణాళికలో మార్పులువచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.కొత్త పాఠ్యప్రణాళికను విద్యార్థుల అవసరాలకుతగినట్లు రూపొందించడానికి ప్రయత్నించడంలో పాఠశాలలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలుండాలి. వివిధ విద్యా విభాగాలు,శాఖలు జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగా పాఠశాల పాఠ్యప్రణాళికను రూపొందించాలి.
👉పాఠ్యప్రణాళికను ప్రభావితం చేసే అంశాలు
🔹ఉపాధ్యాయుడు
🔹పాఠ్యపుస్తకాలు
🔹పరికరాలు, ఉపకరణాలు
🔹మార్గదర్శకత్వం
🔹పరిపాలన - పర్యవేక్షణ
🔹పరీక్షలు, మూల్యాంకనం
🔹యునెస్కో ప్రణాళిక సంఘం ప్రకారం, 🔹పాఠ్యవిషయాన్ని బోధనా పద్ధ తులను ప్రభావితం చేసే అంశాలు
🔹సామాజికావసరాలు
🔹శాస్త్రీయ జ్ఞానం స్థాయి
🔹శాస్త్రాన్ని పఠిస్తున్న విద్యార్థుల వికాసంలో ప్రత్యేకతలు
🔹పాఠ్య ప్రణాళిక నిర్మాణ సిద్ధాంతాలు / వ్యవస్థీకరణ విధానాలు
🔹పాఠ్య ప్రణాళిక కోసం విషయాన్ని కింద పేర్కొన్నపద్ధతుల్లో అమర్చవచ్చు.
అన్వేషణాక్రమం లేదా చారిత్రక క్రమం.
🔹తార్కిక క్రమం ఉదా: ప్రత్యేక విశిష్ట శాస్త్ర విభాగ పద్ధతిలో.
🔹ప్రధాన కేంద్రీకృత సిద్ధాంతానికి సంబంధించిన అంశాలను సమూహలుగా ఏర్పర్చడం ద్వారా.
విద్యార్థికి తక్షణ ఆవశ్యకత గల సూత్రాలను తెలిపే పద్ధతిలో.
🔹విద్యార్థి మానసిక ఉద్వేగాలను, వారి వయసును దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.
ప్రవర్తనాత్మక మార్పులను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.
🔹యూనిట్ పథకాన్ని రూపొందించడం ద్వారా.
పాఠశాలలోఉన్నబోధనావసతి సౌకర్యాలకు తగినట్లుగా.
🔹పాఠశాలలో లభించే ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను, వారు బోధనాంశాలకిచ్చే ప్రాముఖ్యాన్ని దృష్టిలోఉంచుకోవడం ద్వారా రుతుక్రమ విధానం లేదా కాలక్రమ విధానంలో ఏర్పరచడం.
🔹చారిత్రక క్రమం
విజ్ఞాన శాస్త్ర విషయాలను చరిత్రను అనుసరించే క్రమంలో (కనుక్కున్న క్రమంలో) అమర్చడం.
కౌమారదశకు పూర్వదశలో ఉన్న విద్యార్థులు చారిత్రక క్రమాన్ని అభినందిస్తారు. ఉదాహరణకు..
సూక్ష్మజీవులకు సంబంధించిన పాఠాలను లివెన్‌హుక్, లూయిపాశ్చర్ వంటి శాస్త్రవేత్తలతో ముడిపెట్టిబోధించవచ్చు.
తులాదండాలు అధ్యయనాన్ని లోలక భావనలకు ముందుగా చేర్చాలి.
ఖగోళశాస్త్రం భూగోళ శాస్త్రానికి ముందుగా ఉండాలి.
కర్బన రసాయన శాస్త్రానికి ముందు మూలక రసాయన శాస్త్రాన్ని అమర్చాలి.
విషయాలను చారిత్రక క్రమంలో అమర్చితే, తార్కిక క్రమంలో ఉపయోగకరంగా ఉండవు.
ఈ పద్ధతిలో అమర్చేటప్పుడు ఉపయోగంలేని విషయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది.
తార్కిక క్రమం
సాధారణీకరణం లేదా సూక్ష్మీకరణం చేసిన దశను ఆ పాఠ్యవిషయ అభ్యసనానికి ప్రారంభదశగా పరిగణించే క్రమంతార్కిక క్రమం. ఒక శాస్త్ర భావనను లేదా శాస్త్ర సూత్రాన్ని తీసుకుని దాని వినియోగాన్ని వివిధ రీతుల్లో అధ్యయనం చేయడం. ఉదా:
రసాయన శాస్త్రంలో మూలపదార్థాలు మూలకాలు, సంయోగపదార్థాలు, సంక్లిష్ట సంయోగ పదార్థాలు, మిశ్రమాలుఅనే క్రమంలో అమర్చడం.
మరో తార్కిక క్రమంలో మూల పదార్థాలను అణు భారం అభివృద్ధి క్రమంలో (పెరిగే క్రమంలో) అమర్చవచ్చు.
అలాగే జీవశాస్త్రంలో జీవులను శరీర నిర్మాణరీతుల ఆధారంగా జంతు రాజ్యాన్ని రాజ్యం, ఉపరాజ్యం, వర్గం,ఉపవర్గం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతిగా విభజించవచ్చు. లేదా శరీర అవయవాల కార్యకలాపాన్నిఆధారంగా చేసుకొని, అధ్యయనం చేయవచ్చు.
విద్యార్థుల స్వభావానికి కూడా తార్కిక క్రమంతోపాటు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ పద్ధతిలో పాఠ్యప్రణాళికను నిర్మించినాతార్కికంగా సంబంధం ఉండేలా చూడాలి.
శీర్షికా విధానం లేదా అంశ పద్ధతి
శాస్త్ర విషయాన్ని శీర్షికల ఆధారంగా విభజించి, అధ్యయనం చేయడాన్ని శీర్షికా విధానం అంటారు.
సైకిల్ చక్రంలో కమ్ముల (spokes)ను కేంద్రస్థానం (hub) నుంచి అంచులకు విస్తరించేలా అమర్చే విధానంవంటిది.
శాస్త్రసంబంధమైన సూత్రాన్నిగానీ, ఆసక్తి ఉన్న అంశాన్నిగానీ, సిద్ధాంతాన్నిగానీ ఆధారంగా చేసుకొనిఅనేక సంబంధిత విషయాల శీర్షికను కేంద్రీకరించి పాఠ్య ప్రణాళికను తయారుచేయడం శీర్షిక పద్ధతి. ఉదా: 'పని' అనే అంశం ఆధారంగా భౌతికశాస్త్రంలో యాంత్రిక శాస్త్ర పాఠ్య విషయాలన్నిటినీ అధ్యయనం చేయవచ్చు.అలాగే 'శక్తి' అనే అంశంలో వివిధ రకాల, రూపాలశక్తి రసాయనశక్తి, వృక్ష జంతువుల జీవన క్రియలు, పదార్థశక్తివిలువలు, శరీర ఉష్ణోగ్రత క్రమపరచడంమొదలైన విషయాలను జతపరచవచ్చు.
దీనివల్ల విద్యార్థి వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందగలడు.
శీర్షిక విధానంలోపాఠ్య ప్రణాళికను అమర్చేటప్పుడు విద్యార్థిలో అభిలషించదగిన వైఖరులు, నైపుణ్యాలు, అభివృద్ధిచెందుతున్నదీ లేనిదీ గమనించాలి. విద్యార్థుల అభిరుచులను, పరిసరాలను దృష్టిలో ఉంచుకొని శీర్షికలు అమర్చాలి.
మనోవైజ్ఞానిక విధానం
విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు, సమస్యలు, సహజ సామార్థ్యాల ఆధారంగా పాఠ్య ప్రణాళికనుపొందు పరచడం.
విద్యార్థుల్లో వైయక్తిక బేధాలుంటాయి. కాబట్టి, పాఠ్య ప్రణాళికలో కూడా వైవిధ్యం ఉండాలి.
పాఠ్యప్రణాళిక ఒకే విధంగా ఉండాలనే వాదన సరికాదని అన్నది రైబర్న్.
'ఒకే విధమైన పాఠ్యప్రణాళిక వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందదు' అని పేర్కొన్నది- సెకండరి విద్యాకమిషన్
''పాఠ్య ప్రణాళికలో వైవిధ్యానికీ, సడలింపులకు ఆస్కారం ఉండాలి''- సెకండరీ విద్యాకమిషన్
పాఠ్యవిషయాలను పరిచితం నుంచి అపరిచితానికి, మూర్తత్వం నుంచి అమూర్తత్వం వైపు, సరళం నుంచి సంక్లిష్టంకుఅమర్చాలి.
శీర్షికలను పొందుపరిచేటప్పుడు అభ్యసనానుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రయోగాలు చేయడానికి, ప్రకల్పనలు నిర్వహించడానికీ, క్షేత్ర పర్యటనలు చేయడానికి పరిశోధనలుచేయడానికి వీలుండాలి.
ఏక కేంద్రీకరణ పద్ధతి (ఏక కేంద్ర పద్ధతి)
వివిధ రకాలైన శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి ఏక కేంద్రీకరణ పద్ధతి.
తరగతి స్థాయి పెరిగేకొద్దీ విషయ పరిజ్ఞానం విస్తరిస్తూ ఉంటుంది.
సరళమైన విషయం ప్రాథమిక స్థాయిలోనూ అదే అంశానికి చెందిన విషయాన్ని విపులంగా, క్లిష్టంగా పైతరగతుల్లోనూ ప్రవేశపెడతారు.
విద్యార్థి పరిపక్వత పెరిగేకొద్దీ విషయ పరిజ్ఞానం, వివరణ, క్లిష్టత పెరుగుతూ ఉంటాయి.
ఉదాహరణకు ప్రాథమిక స్థాయిలో జ్ఞానేంద్రియాల గురించి సరళంగా, సూక్ష్మంగా అద్యయనం చేస్తారు. ఉన్నతతరగతుల్లో వాటి గురించి విపులంగా తెలుసుకుంటారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞాన శాస్త్రంలో అనుసరిస్తున్న పాఠ్యప్రణాళిక పద్ధతి - ఏకకేంద్రీకరణ పద్ధతి.
యూనిట్ పద్ధతి
ఒక సంవత్సరంలో విద్యార్థులకు బోధించవలసిన విషయానికి సంబంధం ఉన్న అర్ధవంతమైన అనేక విభాగాలుగాపాఠ్యప్రణాళికను అమర్చుతారు. ఈ విభాగాలనే యూనిట్లు అంటారు.
యూనిట్ పరిధిని బట్టి చిన్న, చిన్న సబ్ యూనిట్లుగా విభజిస్తారు.
రుతుక్రమ పద్ధతి
భోధనాభ్యసన సామగ్రి లభించే కాలాన్నిబట్టి పాఠ్యవిషయాలను అమర్చడం.
ఉదాహరణ: కప్ప సంబంధిత విషయాన్ని వర్షాకాలంలో, మల్లెపూల సంబంధిత విషయాన్ని వేసవికాలంలోవచ్చేలా అమర్చడం.