Type Here to Get Search Results !

Vinays Info

పదము (Word)

పదము (Word) నిశ్చితమైన అర్ధాన్నిచ్చే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరముల సముదాయము. ఇలాంటి కొన్ని పదముల సముదాయము వాక్యము.

పదాలలో రకాలు

తెలుగు భాషలో పదములు ఐదు రకములు అవి:

1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అందురు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అందురు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము

2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అందురు. వీనినే వికృతి అందురు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి

3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అందురు. ఉదాహరణ: పీట, చెట్టు

4. గ్రామ్యము : వ్యాకరణ విరుద్ధములైన పదములను గ్రామ్యములు అందురు. ఉదాహరణ: వస్తాడు, పోతాడు

5. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అందురు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.

http://vinaysinfo.blogspot.com

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section