Type Here to Get Search Results !

Vinays Info

తెలుగు వచనములు | Telugu Vachanamulu

👉తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి.

ఏకవచనము మరియు బహువచనము.

👉ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. వరి, బంగారము, మొదలైనవి.

👉బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, కందులు, పెసలు, మొదలైనవి.
వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.

👉సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.

👉ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము".

👉ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".

👉బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది "బహువచనము"

🌹తెలుగు భాషలో ఏకవచనము మరియు బహువచనములు మాత్రమే ఉన్నాయి.💮

1. ఏకవచనము - ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును - పుస్తకము, బల్ల, రామరావు.

2. బహువచనము - రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము - పుస్తకములు, బల్లలు, పూలు.

3. నిత్య ఏకవచనము - పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి.

4. నిత్య బహువచనము - ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.

V I N A Y S I N F O | వినయ్స్ ఇన్ఫో

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section