Type Here to Get Search Results !

Vinays Info

సంధులు - Sandulu

👉తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధియనం బడు.

👉వివరణ :పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

👉ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డు లో ఉకారం ఉన్నదీ. (డ్+ఉ=డు)ఈ ఉకారమే పూర్వస్వరం.

👉ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

👉ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

👉అతడిక్కడ

👉అతడు+ఇక్కడ(పూర్వపదం+పరపదం)

👉అతడ్+ఉ+ఇక్కడ(పూర్వస్వరం ఉ)

👉అతడ్+ఇక్కడ(పూర్వస్వరం లోపించింది)

👉అతడ్+ఇక్కడ(పరస్వరం మిగిలింది)

👉అతడి+క్కడ(పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

👉అతడిక్కడ(పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

👉ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

👉సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

👉ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది.

👉రాముడు + అతడు = రాముడతడు అయినది.

👉సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

👉పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

👉మరికొన్ని ఉదాహరణలు

1.రామ+అయ్య=రామయ్య 2.మేన+అత్త=మేనత్త

👉వర్ణాలబట్టి సంధులు రెండు రకములు
1.అచ్సంధి

2.హల్సంధి

👉భాషనిబట్టి సంధులు రెండు రకములు

1.సంస్కృత సంధులు

2.తెలుగు సంధులు

🌴🌴🌴🌴సంస్కృత సంధులు🌴🌴🌴🌴

👉సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

👉సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: భాను+ఉదయము=భానూదయము. భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది/ దేవ + ఆలయము = దేవాలయము./

👉గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋ లు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము./ దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు. / గుణ+ ఉన్నతుడు = గుణోన్నతుడు.

👉యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - ర లు ఆదేశమగున

ఉదా: అతి+అంతము=అత్యంతము.

👉వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔ లు పరమగునపుడు ఔ కారమును వచ్చును

ఉదా: ఏక+ఏక=ఏకైక./ అష్ట + ఐశ్వర్యములు = అష్టైశ్వర్యములు.

👉అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.

ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.

👉జస్త్వ సంధి: వర్గ ప్రధమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.

ఉదా: వాక్+ఈశ=వాగీశ.

👉శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.
ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.

👉ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.
ఉదా: తత్+టీక=తట్టీక.

👉ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.

🌴🌴🌴🌴తెలుగు సంధులు🌴🌴🌴🌴

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.

👉అచ్చు సంధులు :

👉అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.

👉యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా: వెల+ఆలు=వెలయాలు.

👉ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు

👉ఉకార సంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు
ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.

👉ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఉదా: ఏమి+ఏమి=ఏమేమి./ చివర + చివర= చిట్టచివర. కడ + కడ = కట్టకడ

👉హల్లు సంధులు :

👉గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె

👉సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు

👉పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పుం-పు లగు
ఉదా: సరసము+మాట=సరసపుమాట

👉ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు/ చిఱు + ఎలుక = చిట్టెలుక, /

👉టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
ఉదా: పేరు+ఉరము=పేరుటురము/ నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.

👉రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు
ఉదా: పేద+ఆలు=పేదరాలు

👉దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి

👉నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
ఉదా: సొగసు+తనము=సొగసుందనము

👉పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.
ఉదా: భయము+పడె=భయపడె

👉త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
త్రికము మీది అస0యుక్త హల్లునకు ద్విరుక్త0బు పర0బుగనగు.

👉ద్విరుక్త0బగు హల్లు పర0బగునప్పుడు ఆచ్ఛిక0బబబైన దీర్గ0నకు హ్రస్వ0బగు

ఉదా: అక్కడ = ఆ+కడ; ఇక్కడ 'ఆ' అనునది .త్రికము మరియు 'క' అనునది అస0యుక్త హల్లు. కనుక ద్విరుక్త0బు వచ్చి

ఆ+క్కడ ఐనది. ద్విరుక్త0బగు 'క్క' పర0బుగనప్పుడు 'ఆ' దీర్గ0 కాస్త హ్రస్వ0బై 'అ' అవుతు0ది = అక్కడ

👉ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.
ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.

👉బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.
ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.

👉ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.

🌸🌸🌸🌸🌸🌸🌺🌸🌸🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section