Type Here to Get Search Results !

Vinays Info

పేర్వారం జగన్నాథం | Perwaram Jagannatham

పేర్వారం జగన్నాథం

పేర్వారం జగన్నాధం (సెప్టెంబర్ 23, 1934 - సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త.

జననం

వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించాడు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయం లో తెలుగు విభాగంలో ఆచార్యుడిగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశాడు.

మరణం

సెప్టెంబర్ 29, 2008 న వరంగల్ లో మరణించాడు. మాజీ డి.జి.పి.పేర్వారం రాములు ఇతడి సోదరుడు.

రచనలు

అభ్యుదయకవిత్వానంతర ధోరణులు
ఆరె భాషానిఘంటువు
మోర్దోపు దున్న
సాహితీ సౌరభం
సాగర సంగీతం
వృషభ పురాణం
గరుడపురాణం
శాంతి యజ్ఞం
తెలుగులో దేశీయ కవితాప్రస్థానం
ఆరె జానపద గేయాలు
నన్నయ భారతి (ప్రథమ సంపుటము) (సంపాదకత్వం - వ్యాస సంకలనం)
డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు (అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
సాహిత్యావలోకనం

VINAYS INFO

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section