భూమి వేడెక్కుతుంది, వాతావరణం గతిరీతి మారుతుంది. ఓ వైపు అకాలవర్షాలు, అధిక ఉష్ణోగ్రత, మరోవైపు అతివృష్టి, అనావృష్టి ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. 212లోనో, 220లోనో భూమి బద్దలవుతోందని సర్వప్రాణి కోటి తుడుచుపెట్టుకుపోతుందని మళ్లిd కొన్ని చోట్ల సంవత్సరాల తరువాత ప్రాణి అనేది పుడుతుందని టీవీలు, పత్రికలు ఘోచిస్తున్నాయి. ఏది ఎలా జరిగినా ఒక్కటి మాత్రం వాస్తవము మానవుడు పర్యావరణాన్ని పాడు చేసి ప్రకృతి సహజ సంపదను పూర్తిగా నాశనం చేస్తున్నాడు.
ఫలితంగా భూమికి రక్షణ కవచం లాంటి ఓజోన్‌పొర కరిగిపోతుంది. అందుకే ఓజోన్ పరిరక్షణ అవసరం గురించి అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 16, 1995నుంచి ఓజోన్ సంరక్షణా ది నోత్సవంగా నిర్వహించారు. ఓజోన్ వాయువులతో కూడిన పొర, ఓజోన్ అణువులో మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. సాధారణంగా ఆక్సిజన్ ఉండేది రెండు పరిమాణములే.
భూమికి 10 నుంచి 50 కిలోమీటర్ల మధ్య ఓజోన్ పొర ఉంటుంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను ఓజోన్‌పొర అడ్డుకుంటుంది. ఈ కిరణాలు నేరుగా తాకితే చర్మక్యాన్సర్, కంటి వ్యాధులు సంభవిస్తాయి. మొక్కలు, జంతువులు,ప్లాస్టిక్‌పైన కూడా దీని దుష్ప్రాభావం ఉంటుంది.
అంటార్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పెద్ద రంధ్రాన్ని 1985లోనే కనుగొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం కనుక 2010వరకు మనకు సమయం ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వ చట్టాలు ఈ మేరకు రూపొందిస్తున్నారు.