👉ఆరతి గుప్తా నీ సాహా (సెప్టెంబర్ 24, 1940 - ఆగష్టు 23, 1994) ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ.
👉ఈమె జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ.
జీవిత విశేషాలు
ఆమె తన నాల్గవ యేట నుండే ఈతను ప్రారంభించారు. ఆమె ప్రతిభను "సచిన్ నాగ్" అనే కోచ్ గుర్తించారు.
👉1945 నుండి 1951 వరకు ఆమె ఆలిండియా రికార్డు (1949) తో పాటు 22 పోటీలలో పాల్గొన్నది.
👉ఆమె ఇంగ్లీషు ఛానెల్ ఇదిన భారతీయ స్విమ్మర్ అయిన మిహిర్ సేన్ కు ప్రభావితురాలైంది.
👉సెప్టెంబర్ 29 1959 న ఇంగ్లీషు ఛానెల్ ఈది భారత దేశంలో ప్రథమ మహిళగా నిలిచింది.
👉ఆమె ఫ్రాన్స్ లోని "కేప్ గ్రిస్ సెజ్" నుండి ఇంగ్లాండు లోని "సాండ్‌గేట్" వరకు ఈది రికార్డు సృష్టించింది.
👉ఈ దూరాన్ని ఆమె 16 గంటల 20 నిమిషాలలో పూర్తిచేయగలిగింది. ఆమె "సాండ్‌గేట్" వద్ద భారతీయ పతాకాన్ని నిలిపింది.
👉ఆమెకు 1960 లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.
👉ఆమె ఆగష్టు 23 1994 న మరణించింది.
👉1998 లో వివిధ రంగాలలో భారతీయ మహిళల కృషికి గుర్తింపుగా, ఆర్తీ గుప్తాకు కూడా పోస్టల్ స్టాంపును భారత ప్రభుత్వం విడుదలచేసింది.