బహుమనీ సామ్రాజ్యము
బహమనీ సామ్రాజ్యం 1347 – 1518
బహమనీ సామ్రాజ్యం, 1470లో
రాజధాని గుల్బర్గా, తర్వాత బీదర్
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.త.650
• మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
• మౌర్యులు • క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
• శాతవాహనులు • క్రీ.పూ.200 - క్రీ.త.200
• కళింగులు • క్రీ.పూ.180? - క్రీ.త.400?
• ఇక్ష్వాకులు • 210 - 300
• బృహత్పలాయనులు • 300 - 350
• అనందగోత్రులు • 295 - 620
• శాలంకాయనులు • 320 - 420
• విష్ణుకుండినులు • 375 - 555
• పల్లవులు • 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
• మహాపల్లవులు
• రేనాటి చోడులు
• చాళుక్యులు
• రాష్ట్రకూటులు
• తూర్పు చాళుక్యులు • 624 - 1076
• పూర్వగాంగులు • 498 - 894
• చాళుక్య చోళులు • 980 - 1076
• కాకతీయులు • 1083 - 1323
• అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
• ముసునూరి నాయకులు • 1320 - 1368
• ఓఢ్ర గజపతులు • 1513
• రేచెర్ల పద్మనాయకులు • 1368 - 1461
• కొండవీటి రెడ్డి రాజులు • 1324 - 1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు • 1395 - 1447
• బహమనీ రాజ్యము •
• విజయనగర సామ్రాజ్యము • 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
• అరవీటి వంశము • 1572 - 1680
• కుతుబ్ షాహీ యుగము • 1518 - 1687
• నిజాము రాజ్యము • 1742-1948
• బ్రిటిషు రాజ్యము •
• స్వాతంత్ర్యోద్యమము • 1800 - 1947
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు • 1912-1953
• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు • 1948-1952
• ఆంధ్ర ప్రదేశ్ అవతరణ • 1953-1956
• ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర • 1956-
బహుమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్‌ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా, ఢిల్లీ సుల్తాన్, ముహమ్మద్ బిన్ తుగ్లక్ కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహుమనీల రాజధాని ఎహసానాబాద్ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్ (బీదర్)కు తరలించారు. బహుమనీలు దక్కన్ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్ గవాన్ యొక్క వజీరియతులో (1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహుమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, మరియు గోల్కొండ సల్తనత్, దక్కన్ సల్తనత్ లుగా పేరు పొందాయి.
సామ్రాజ్య స్థాపకుడి చరిత్రపై కథనం
బహమనీ సామ్రాజ్య స్థాపకుడు హసన్ గంగు గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. సన్ గంగు ఒక బ్రాహ్మణుడి వద్ద పొలం పనులు చేస్తూండేవాడు. ఒకరోజు పొలం దున్నుతూండగా, అతడికి ఒక నిధి దొరికింది. ఆ నిధిని తీసుకువెళ్ళి బ్రాహ్మణునికి ఇచ్చాడు. అతడి నిజాయితీకి సంతోషించిన బ్రాహ్మణుడు, అతణ్ణి, రాజు కొలువులో పని ఇప్పించాడు. తిరుగుబాటు తరువాత, అతడు రాజైనపుడు, ఆ బ్రాహ్మణుడిపై కృతజ్ఞతగా తన రాజ్యానికి బ్రాహ్మనీ సామ్రాజ్యం అని పేరు పెట్టుకున్నాడు, అదే బహమనీ సామ్రాజ్యం అయింది[1]. అయితే ఈ కథనాన్ని ధ్రువపరచే చారిత్రిక ఆధారాలు దొరకలేదు.
బహుమనీ సుల్తానుల జాబితా
అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా 1347 - 1358
మహమ్మద్ షా I 1358 - 1375
అల్లాద్దీన్ ముజాహిద్ షా 1375 - 1378
దావూద్ షా 1378
మహమ్మద్ షా II 1378 - 1397
ఘియాతుద్దీన్ 1397
షంషుద్దీన్ 1397
తాజుద్దీన్ ఫిరోజ్ షా 1397 - 1422
అహ్మద్ షా I వలీ 1422 - 1436
అల్లాద్దీన్ అహ్మద్ షా II 1436 - 1458
అల్లాద్దీన్ హుమాయున్ జాలిమ్ షా 1458 - 1461
నిజాం షా 1461 - 1463
మహమ్మద్ షా III లష్కరి 1463 - 1482
మహమ్మద్ షా IV (మెహమూద్ షా) 1482 - 1518
అహ్మద్ షా III 1518 - 1521
అల్లాద్దీన్ 1521 - 1522
వలీ అల్లా షా 1522 - 1525
కలీమల్లా షా 1525 - 1527