🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తెలంగాణ 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
👉జనాభా పరంగా, భౌగోళికంగా ఇది దేశంలో 12వ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు.
👉పది జిల్లాలతో కూడిన తెలంగాణలో మొత్తం 68 నగరాలున్నాయి.
👉ఇందులో ఆరు కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలు, 25 నగర పంచాయతీలు, 8,691 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
👉200 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 346.
👉500 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 870.
👉1000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 1733
👉2000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 3,029
👉5000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 43,104
👉10,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 630
👉10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 122 ఉన్నాయి.
👉రాష్ట్రం మొత్తంలో 83,57,826 కుటుంబాలున్నాయి. (సమగ్ర కుటుంబ సర్వే 2014 ఆగస్టు 19 ఆధారంగా).
👉తెలంగాణలో పెద్ద జిల్లా మహబూబ్‌నగర్ (పాలమూర్).
👉చిన్న జిల్లా హైదరాబాద్.
👉తెలంగాణ అధికార భాష తెలుగు, రెండో భాష ఉర్దూ.
👉తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయమైన ఉస్మానియా యూనివర్సిటీని 1918లో స్థాపించారు.
👉1976లో వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ (నల్గొండ), శాతవాహన (కరీంనగర్), తెలంగాణ (నిజామాబాద్), పాలమూర్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
👉రాష్ట్ర సరిహద్దులుగా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. అవి...
1) ఛత్తీస్‌గఢ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
గమనిక: పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు కలిసి ఉన్నప్పుడు ఒడిశాతో కూడా సరిహద్దు ఉంది.
👉తెలంగాణ భూపరివేష్టిత రాష్ర్టం. దీనికి అంతర్జాతీయ సరిహద్దు, సముద్రతీరం లేవు.
👉దేశంలో మొత్తం అయిదు భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. అవి:
1) హరియాణా
2) జార్ఖండ్
3) ఛత్తీస్‌గఢ్
4) మధ్యప్రదేశ్
5) తెలంగాణ
👉రాష్ట్ర గీతం: ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’.
👉తెలంగాణ రాష్ట్ర పక్షి: పాలపిట్ట
👉రాష్ట్ర జంతువు: జింక
👉రాష్ట్ర వృక్షం: జమ్మిచెట్టు
👉రాష్ట్ర పుష్పం: తంగేడు పువ్వు
👉రాష్ట్ర పండుగలు: బతుకమ్మ, బోనాలు
👉తెలంగాణ రాష్ట్ర రాజధాని: హైదరాబాద్.
👉తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 457 మండలాలు ఉన్నాయి. విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.
👉ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు
1) భద్రాచలంలోని కొన్ని గ్రామాలు,
2) కూనవరం,
3) చింతూర్
4) వరరామచంద్రపురం,
5) వేలేరుపాడు,
6) కుక్కునూరు,
7) బూర్గంపాడు.
👉తెలంగాణ రాష్ట్ర గీతం రాసినవారు ‘అందె శ్రీ’. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్ జిల్లాలోని రేబర్తి గ్రామం ఈయన జన్మస్థలం.
👉ఈయనకు కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
👉తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో.. రెండు వలయాల లోపల కాకతీయ తోరణం, మధ్యలో చార్మినార్ ఉంటుంది. వెలుపలి వలయం బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది అభివృద్ధికి గుర్తు. లోపలి వలయం, కాకతీయ తోరణం, చార్మినార్ ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇది శాంతికి గుర్తు.
👉తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపకర్త ఏలే లక్ష్మణ్. ఈయనిది నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కదిరేని గూడెం.
👉- తెలంగాణలో విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు:
1) మహబూబ్‌నగర్,
2) ఆదిలాబాద్.
👉- తెలంగాణలో విస్తీర్ణపరంగా చిన్న జిల్లాలు:
1) హైదరాబాద్, 2) రంగారెడ్డి.
👉- రాష్ట్రంలో అధిక మండలాలున్న జిల్లాలు:
1) మహబూబ్‌నగర్ (64)
2) నల్గొండ (59)
👉- రాష్ట్రంలో తక్కువ మండలాలు ఉన్న జిల్లా:
1) హైదరాబాద్ (16)
2) నిజామాబాద్ (36)
👉తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రామగుండం. ఆ తర్వాత భద్రాచలం, కొత్తగూడెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
👉తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119.
👉లోక్‌సభ స్థానాలు 17,
👉రాజ్యసభ స్థానాలు 7.
👉అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా - హైదరాబాద్ (15).
👉తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా - నిజామాబాద్ (9).
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴