ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే, 5 సం॥ జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించడం వంటి కీలక సిఫార్పులను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆరీచించింది. ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారు పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయిరీ సంఘం చేసిన సిఫారసులను ఆమోదించారు. ప్రకటనలు తప్పదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ.50 లక్ష జరిమానా, ఐదేళ్ల జైు శిక్ష విధించానే నిబంధను చేర్చారు.