* * విద్యార్థులకు కధలంటే ఇష్టం . కథ ద్వారా పద్యలక్షణాలు చెబితే ఇష్టంగా నేర్చుకుంటారు * *
* * పెళ్ళిచూపులు * *
* * సరదా కథ * *
* ఛందస్సు అనే నగరంలో గణవిభజన అనే యువకుడు పెళ్ళీడు కొచ్చాడు . ఒకరోజు తన తల్లిదండ్రులతో వృత్తపద్యం అనే పల్లెటూరికి పెళ్ళిచూపులకి వెళ్ళాడు .
అక్కడ అమ్మాయిని ప్రశ్నలు అడిగాడు , ఆమె సమాధానాలు చెప్పింది -
నీ పేరు ? ఉత్పలమాల
వయసు ? 20 ( అక్షరాలు )
చదువు ? భ,ర,న,భ,భ,ర,వ
ర్యాంక్ ? 10 ( యతిస్థానం )
యువకుడు అమ్మాయి నచ్చలేదని మరో పెళ్ళిచూపులకి వెళ్ళాడు .
అక్కడ కూడా ప్రశ్నలే -
నీ పేరు ? చంపకమాల
వయసు ? 21
చదువు ? న,జ,భ,జ,జ,జ,ర
ర్యాంక్ ? 11
అమ్మాయి నచ్చలేదని మరో అమ్మాయి కోసం వెళ్ళాడు.
మళ్ళీ ప్రశ్నలు -
నీ పేరు ? మత్తేభం
వయసు ? 20
చదువు?స,భ,ర,న,మ,య,వ
ర్యాంక్ ? 14
తను కూడా నచ్చలేదని మరో అమ్మాయి కోసం వెళ్ళి అవే ప్రశ్నలు -
నీ పేరు ? శార్ధూలం
వయసు? 19
చదువు ? మ,స,జ,స,త,త,గ
ర్యాంక్ ?13
ఈ అమ్మాయి కూడా నచ్చలేదని మరో యువతి వద్దకు వెళ్ళాడు .
నీ పేరు ? అని అడగిన వెంటనే
ఆ యువతి సిగ్గుపడుతూ
నా పేరు
యమతారాజభానసలగం
అని చెప్పింది .
నాకు ఈ అమ్మాయి పేరు నచ్చింది , నేను
యమాతారాజభానసలగం
అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు .
* * శుభం * *
పద్య లక్షణాలు కోడ్
June 08, 2016
Tags