Type Here to Get Search Results !

Vinays Info

కరంట్ అఫైర్స్ (MAY 24-MAY 31)

అమెరికాలో మేయర్లతో కేటీఆర్ భేటీలు

-మే 25న కార్మెల్ నగర మేయర్ జిమ్ బ్రయనార్డ్, ఇండియానా పొలిస్ నగర మేయర్ జో హాగ్‌సెట్‌తో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. కార్మెల్ మేయర్ బ్రయనార్డ్‌తో సమావేశంలో తాగునీటి సరఫరా, విద్యుత్ పంపిణీ, ప్రజారవాణా, మురికి నీటి నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఇండియానా పొలిస్ మేయర్ జో హాగ్‌సెట్‌తో నగర ప్రణాళికపై, లోవా గవర్నర్ టెర్రీ బ్రాన్‌స్టాడ్‌తో బీమా, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్

-పీడీపీ అసోసియేట్స్ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రథమస్థానం, మధ్యవూపదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ రెండోస్థానం, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడోస్థానం, ఆంధ్రవూపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఐదో స్థానంలో నిలిచారు.

లిమ్కా బుక్‌లోకి సమగ్ర కుటుంబ సర్వే

-2014 ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కింది. ఈ సంస్థ ఎడిటర్ విజయ్ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికెట్ అందజేశారు.

-వస్త్ర పరిక్షిశమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - ఓరుగల్లు
-కుతుబ్‌షాహీల కాలంనాటి బంగారు నాణెం? - హెన్ను
-కుతుబ్ షాహీల కాలంలో రేవు ప్రధానాధికారిని ఏమని పిలిచేవారు? - షా బందర్
-గోల్కొండలో 200 మంది వేశ్యలున్నట్లు ఎవరు పేర్కొన్నారు? - టావెర్నియర్
-గోల్కొండ రాజ్యంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు చేశారు? - 1670
-కుతుబ్ షాహీ యుగ ముఖ్య లక్షణం? 
- హిందూ ముస్లిం సామరస్యం

జాతీయం

కేరళ సీఎం ప్రమాణ స్వీకారం

-కేరళ 12వ సీఎంగా పినరాయి విజయన్ మే 25న ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో 19 మందికి చోటు కల్పించారు. ఇందులో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, ఎన్సీపీ, జేడీఎస్, కాంగ్రెస్(ఎస్)కు చెందినవారు ఉన్నారు. 

స్మార్ట్ సిటీల ఎంపిక

-100 స్మార్ట్ సిటీల్లో భాగంగా తొలి దశలో 20 నగరాలను ఎంపిక చేశారు. 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు 98 నగరాలను గుర్తించారు. రెండో జాబితాలో 27 నగరాలు ఎంపికకు పోటీలో ఉన్నాయి. రెండో దశలో 13 నగరాలు ఎంపికయ్యాయి. వీటి ఎంపికలో మౌలిక సౌకర్యాలు, పారిశుద్ధం, పరిశువూభత, మరుగుదొడ్లు, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్, ఐటీ సేవలు తదితరాల్లో 25 శాతం మెరుగుదల. 13 నగరాలకు ప్రతి ఏడాదికి రూ. 200 కోట్ల కేంద్ర గ్రాంగ్ లభిస్తుంది. తర్వాత మూడేండ్ల వరకు రూ. 100 కోట్ల చొప్పున కేటాయిస్తారు. 

మోదీ పాలనకు రెండేండ్లు


-మే 26 నాటికి మోదీ ప్రధానిగా ఎన్నికై రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరవూపదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు కోసం కృషి చేస్తామని, ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏండ్లకు పెంచుతామని ప్రధాని ప్రకటించారు. 

నీరాంచల్‌కు శ్రీకారం


-దేశంలో వర్షాధారిత ప్రాంతాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టి వ్యవసాయానికి జీవం పోయాలనే లక్షంతో నీరాంచల్ ప్రాజెక్టును చేపట్టారు. దీన్ని 9 రాష్ట్రాల్లో అమలుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఏపీ నుంచి చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఎంపికయ్యాయి.

కూలిన ఎయిర్ సి-90 విమానం


-పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబుపూన్స్ విమానం బీచ్‌కింగ్ ఎయిర్ సి-90 అనే విమానం నజఫ్‌గఢ్ వద్ద కూలిపోయింది.

చైనాతో ఒప్పందాలు


-మే 25, 26 తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శాంతి, సౌభాగ్యం, సుస్థిర అభివృద్ధిలపై చైనాతో చర్చించారు. మార్కెట్, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలపై గువాంగ్‌ఝాలో భారత్-చైనా వాణిజ్యవేదిక సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రణబ్ సమావేశమయ్యారు.

అంతర్జాతీయం

శక్తిమంతమైన కంపెనీలల్లో దేశీయ కంపెనీలు


-మే 26న విడుదల చేసిన ప్రపంచంలో అతిపెద్ద శక్తిమంతమైన కంపెనీల జాబితాలో 56 దేశీయ కంపెనీలకు చోటు దక్కింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఫోర్బ్ మేగజైన్ గ్లోబల్- 2000 కంపెనీల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా 586, చైనా 249, జపాన్ 219, బ్రిటన్ 92, దక్షిణ కొరియాకు చెందిన 62 కంపెనీలు ఉన్నాయి.

జీ-7 దేశాల సమావేశం


-మే 26, 27 తేదీల్లో జపాన్‌లోని షిమాలో జీ-7 దేశాల సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, పర్యావరణం, ఆర్థిక స్థితిగతులపై చర్చించారు.

ఒబామా హిరోషిమా సందర్శన


-మే 27న జపాన్‌లోని హిరోషిమాలో ఉన్న శాంతి స్మారకాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా సందర్శించారు.

నార్త్ ఈస్ట్ కౌన్సిల్ 65వ ప్లీనరీ


-నార్త్ ఈస్ట్ కౌన్సిల్ 65వ ప్లీనరీ సమావేశం మే 27న షిల్లాంగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్, రోడ్లు, రైలు మార్గాలు, టూరిజం తదితర అంశాలపై చర్చించారు.

్ర పపంచంలోనే అతిపెద్ద రైలు సొరంగం ప్రారంభం


-ప్రపంచంలోనే అతిపెద్ద రైలు సొరంగం జూన్ 1న ప్రారంభం కానుంది. దాదాపుగా రూ. 83వేల కోట్ల వ్యయంతో 17 ఏండ్ల పాటు స్విట్జర్లాండ్ ఆల్ఫ్ పర్వతాలను తొలిచి దీన్ని నిర్మించారు. దీని పేరు గొట్టార్డ్ బేస్ టన్నెల్. దీని పొడవు 53.85 కి.మీ. కాగా డిసెంబర్ 11 నాటికి వాణిజ్య సర్వీసులను కూడా ప్రారంభిస్తారు. 

క్రీడలు

ఐపీఎల్ విజేత-హైదరాబాద్


-మే 29న 9వ ఐపీఎల్ టైటిల్ విజేత హైదరాబాద్ సన్‌రైజర్ జట్టు. బెంగళూర్ రాయల్ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. ఆరెంజ్ క్యాప్ - విరాట్‌కోహ్లీ (973 పరుగులు), పర్పుల్ క్యాప్ భువనేశ్వర్ (23వికెట్లు), మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ చెన్ కటింగ్.

సోనియాకు రజతం


-ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ సోనియా లాథర్‌కు 57 కేజీల విభాగంలో రజతం లభించింది.


రియల్ మాడ్రిడ్‌కు చాంపియన్ లీగ్ టైటిల్


-చాంపియన్ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ జట్టు 11వ సారి గెలుపొందింది. రూ. 11 కోట్ల బహుమతి లభించింది. ఈ టోర్నమెంట్ ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించారు.


వార్తల్లో వ్యక్తులు

‘స్పెల్-బీ’ పోటీల్లో భారతీయ అమెరికన్ విద్యార్థులు


-మే 27న నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ అమెరికన్ విద్యార్థులు జైరామ్ ఉగరేశ్ హత్వార్, నిహర్ సాయిడ్డి జంగాలు విజయం సాధించారు. 

జియోక్షిగాఫిక్ బీ పోటీలో..


-మే 26న అమెరికాలో నిర్వహించిన జియోక్షిగాఫిక్ బీ పోటీలో భారత సంతతి బాలలు విజేతలుగా నిలిచారు. ఫ్లోరిడా నుంచి రిషి నాయర్, మసాచుసెట్స్ నుంచి సాకేత్ జొన్నలగడ్డ, అలబామా నుంచి కపిల్ నాథన్ వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు.

భగత్‌సింగ్ మునిమనుమడు మృతి


-మే 29న భగత్‌సింగ్ మునిమనుమడు అభితేజ్‌సింగ్ (27) మృతిచెందారు. హిమాచల్‌వూపదేశ్‌లోని రాంపూర్ బుషాహర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు.

అవార్డులు

వేదాంత్‌కు ఉత్తమ ఆర్కిటెక్చర్ అవార్డు


-భారత సంతతికి చెందిన విద్యార్థికి దక్షిణావూఫికాలో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. విట్‌వాటర్ స్రాండ్ యూనివర్సిటీ విద్యార్థి వేదాంత్ మహరాజ్ 2015కుగాను ఉత్తమ ఆర్కిటెక్చర్ అవార్డు అందుకున్నారు.

అమెరికా జీవరసాయన ఇంజినీర్‌కు అవార్డు


-అమెరికా జీవరసాయన ఇంజినీర్‌కు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్‌కు 2016 మిలీనియం టెక్నాలజీ అవార్డు మే 25న అవార్డు లభించింది. సహజ పరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ప్రయోగశాలలో కొత్త మెరుగైన ప్రొటీన్లను సృష్టించడానికి కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. 

హీరాబెన్‌కు నారీ జాగరణ్ సమ్మాన్ అవార్డు


-మే 29న ప్రధాని నరేంవూదమోదీ తల్లి హీరాబెన్‌కు నారీ జాగరణ్ సమ్మాన్-2016 అవార్డు లభించింది. దీనిని జాగరణ్ పత్రిక ప్రకటించింది.

జీవీ రావుకు బీసీ రాయ్ పురస్కారం


-మే 28న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జీవీ రావుకు బీసీ రాయ్ పురస్కారం లభించింది. ఇతను హైదరాబాద్‌కు చెందినవారు. పశ్చిమబెంగాల్ రెండో సీఎంగా పనిచేసిన బిదాన్ చంద్రరాయ్ పేరున 1976లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. వైద్యం, సైన్స్, రాజకీయం, సాహిత్యం, కళల్లో విశేష కృషిచేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. రాయ్ జన్మదినమైన జూలై 1ని డాక్టర్స్ డేగా నిర్వహించుకుంట


భారతీయ అమెరికన్‌కు స్ప్రింగర్ థీసెస్ అవార్డు


-భారతీయ అమెరికన్ అర్ణబ్‌డేకు స్ప్రింగర్ థీసెస్ అవార్డు లభించింది. ఇతను కణితులపై పోరాడే ప్రోటాన్ ఏ 20పై అధ్యయనం చేశారు. 

సింగరేణికి ‘ఎక్సలెన్స్’ అవార్డు


-2016 మే 28న సింగరేణి సంస్థకు ఎక్సపూన్స్ ఇన్ కాస్ట్‌మేనేజ్‌మెంట్-2015 అవార్డు లభించింది. ఈ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్.

నాయుడమ్మ అవార్డుకు ఎంపిక


-మే 28న నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సంస్థ నాయుడమ్మ అవార్డుకు 2016కి ప్రముఖ పారివూశామికవేత్త గురురాజ్‌దేశ్‌పాండే, 2017కి డాక్టర్ వెంకట రామన్ రామకృష్ణన్ ఎంపికయ్యారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section