1. మహబూబ్‌నగర్ హైదరాబాద్‌కు ఏ దిక్కులో ఉంది?
1) తూర్పు 2) పడమర 3) ఉత్తరం 4) దక్షిణం
2. మహబూబ్‌నగర్ నుంచి వరంగల్ వెళ్లాలంటే ఏ దిశగా ప్రయాణం చేయాలి?
1) తూర్పు 2) ఈశాన్యం 3) నైరుతి 4) దక్షిణం
3.హైదరాబాద్ నుంచి భోపాల్ మీదుగా రాజస్థాన్‌కు విమానం ద్వారా వెళ్లాలంటే ఏ దిశగా ప్రయాణం చేస్తారు?
1) తూర్పు 2) పడమర 3) వాయవ్యం 4) ఉత్తరం
4. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు?
1) కాలనిర్ణయ రేఖలు 2) కాంటూరు రేఖలు
3) కాస్మిక్ రేఖలు 4) ఏదీకాదు
5. సమతల రేఖలు (కాంటూరు రేఖలు)కు సంబంధించినవి?
1) ఇవి వక్ర రేఖలు
2) ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు
3) కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది.
4) పైవన్నీ
6. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువగా ఉంటే.. కాంటూరు రేఖలు పటంలో ఏ విధంగా ఉంటాయి?
1) దగ్గరగా 2) దూరంగా
3) ఎటువంటి మార్పు ఉండదు 4) లోతుగా
7. ఒక పటంలో రెండు కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గర, దగ్గరగా ఉన్నాయి. అప్పుడు భూమి వాలు ఎలా ఉంటుంది?
1) ఎత్తుగా 2) లోతుగా
3) సమతలంగా 4) ఎత్తు తక్కువ
8. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేసింది ఎవరు?
1) అనాక్సి మెండర్ 2) ఆల్ ఇద్రిసి
3) హాన్ తూయీ 4) మెర్కెటర్
9. యూరప్‌ను పటంలో చిన్నగాను, ఆఫ్రికా అంచు గుడ్ హోప్ అగ్రంను పెద్దగా చూపింది ఎవరు?
1) మెర్కెటర్ 2) ఆల్ ఇద్రిసి
3) హాన్‌తూయీ 4) ఆనాక్సి మెండర్
10.పలకలపై ప్రపంచ పటాలను తయారు చేసింది ఎవరు?
1) సుమేరియన్లు 2) బాబిలోనియన్లు
3) 1, 2 4) చైనీయులు
11. భారతదేశ పటాలను తయారు చేయడానికి స్థాపించిన సంస్థ?
1) జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) బయాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3) సర్వే ఆఫ్ ఇండియా
4) అంతర్జాతీయ సర్వే సంస్థ
12.భారతదేశ మొదటి పటాలను తయారు చేసింది ఎవరు?
1) లాంబ్టన్ 2) జేమ్స్ రన్నెల్ 3) ఎవరెస్ట్ 4) టాలమి
13. ఉపరితల ఛాయా చిత్రీకరణకు వేటిని ఉపయోగిస్తారు?
1) విమానాలు 2) హెలికాప్టర్లు
3) గాలి బెలూన్లు 4) పైవన్నీ
14.అటవీ సంరక్షణ, యుద్ధతంత్రాలు, పటాల తయారీ, వాతావరణ పరిశోధన వంటి ప్రణాళికల రూపకల్పనలకు వేటిని ఉపయోగిస్తారు?
1) ఉపరితల ఛాయా చిత్రాలు
2) ఉపగ్రహ ఛాయాచిత్రాలు
3) సాధారణ పటాలు
4) ఏదీకాదు
15.జిల్లాలు, రాష్ర్టాలు, దేశాలు, రాజధానులను తెలిపే పటాలేవి?
1) రాజకీయ పటాలు 2) భౌతిక పటాలు
3) చారిత్రక పటాలు 4) భూ వినియోగ పటాలు
16.నివాస ప్రాంతం, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, దుకాణాలు, మొదలైన వాటిని ఏ పటాలు తెలుపుతాయి?
1) రాజకీయ పటాలు 2) భౌతిక పటాలు
3) భూ వినియోగ పటాలు 4) చారిత్రక పటాలు
17.భౌతిక పటాలు కింది వాటిలో దేన్ని సూచిస్తాయి?
1) గ్రామ సరిహద్దు 2) ఆహారపంటల సాగు
3) కొండలు 4) పశువులను మేపే స్థలాలు
18.హిమాలయాలు ప్రపంచంలో ఎత్తయిన భూ ఉపరితల స్వరూపం. ఇందులో హిమాలయాలను తెలిపే పటాల రకం?
1) రాజకీయ పటాలు 2) భూ వినియోగ పటాలు
3) భౌతిక పటాలు 4) చారిత్రక పటాలు
19. గణాంక వివరాలను చూపటానికి వేటిని ఉపయోగిస్తారు?
1) చుక్కలు 2) వృత్తాలు 3) రేఖా పటాలు 4) పైవన్నీ
20. ఖమ్మం జిల్లాలో ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు అత్యధికంగా ఉన్నాయి. వీటిని ఏ భూ ఆచ్ఛాదన రంగులో తెలుపుతారు?
1) ముదురు ఆకుపచ్చ 2) నలుపు
3) ముదురు నీలం 4) తెలుపు
21.ఖండాల చుట్టూ పటంలో ముదురు నీలం రంగుతో చూపారు. ఈ రంగు ఏ భూ ఆచ్ఛాదనను తెలుపుతుంది?
1) చెరువులు 2) సరిహద్దులు
3) సముద్రాలు 4) మహాదట్టమైన అడవులు