పటాల అధ్యయనం-విశ్లేషణ
1. గడ్డి భూములు అనే భూ వినియోగాన్ని చూపించే రంగు?
1) ముదురు ఆకుపచ్చ 2) లేత ఆకుపచ్చ
3) గోధుమ 4) ఊదారంగు
2. జనసాంద్రతను లెక్కిస్తున్నప్పుడు దేన్ని ముందుగా లెక్కగట్టాలి?
1) జనాభా 2) వైశాల్యం
3) సామాజిక స్థితి 4) ఏదీకాదు
3. జనసాంద్రత= ........./వైశాల్యం
1) జనాభా నిష్పత్తి 2) జనసంవత్సరం
3) జనాభా 4) ప్రదేశం పొడవు
4. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం?
1) తెలంగాణ 2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్ 4) బీహార్
5. జనసాంద్రత రీత్యా తెలంగాణ స్థానం?
1) 12వ 2) 13వ 3) 16వ 4) 18వ
6. అత్యల్ప జనసాంద్రత రాష్ర్టాలు వరుసగా..
1) అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ
2) అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం
3) మిజోరం, జమ్ముకశ్మీర్
4) మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్
7. AP జనసాంద్రత?
1)307 2) 306 3) 305 4) 308
8. ఒక పటంలో హైదరాబాద్-కొత్తగూడెం మధ్య దూరాన్ని 3 సెం.మీ.గా చూపించారు. 1 సెం.మీ.కు 75 కి.మీ. అయినా వాస్తవ దూరం ఎంత?
1) 215 కి.మీ. 2) 25 కి.మీ.
3) 225 కి.మీ. 4) ఏదీకాదు
9. హైదరాబాద్-ఆదిలాబాద్ మధ్య దూరం 300 కి.మీ. ఐతే పటంలో దాన్ని 5 సెం.మీ.గా చూపబడింది. అయినా ఒక సెం.మీ.కు దూరం ఎంత?
1) 600 కి.మీ. 2) 600 మీ.
3) 60 సెం.మీ. 4) 60 కి.మీ.
10. ఒక పటంలో మహబూబ్‌నగర్-వనపర్తి మధ్య వాస్తవ దూరం 50 కి.మీ. ఒక రేఖ ద్వారా రెండు స్థలాల మధ్య దూరం 5 సెం.మీ చూపిస్తే 1 సెం.మీ = ........ అవుతుంది?
1) 10 సెం.మీ. 2) 250 కి.మీ.
3) 250 మీ. 4) 10 కి.మీ.
11. ఒక పటంలో హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి మధ్య 7 సెం.మీగా చూపబడింది. రెండు నగరాల మధ్య వాస్తవ దూరం 1400 కి.మీ. హైదరాబాద్-చెన్నై మధ్య దూరం పటంలో 3 సెం.మీగా చూపబడితే, రెండు నగరాల మధ్య వాస్తవ దూరం ఎంత?
1) 600 కి.మీ. 2) 60 కి.మీ.
3) 60 సెం.మీ. 4) 600 మీ.
12. ఒక గ్రామ వైశాల్యం 10 చ.కి.మీ. ఉండి అందులో 10 వేల మంది ప్రజలు ఉంటే, ఆ గ్రామ జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కి ఎంత?
1) 1000 2) 100 3) 10,000 4) 1,00,000
సమాధానాలు
1-2, 2-1, 3-3, 4-4, 5-3, 6-2,
7-1, 8-3, 9-4, 10-4, 11-1, 12-1
అక్షాంశాలు - రేఖాంశాలు
1. భూమిపై పడమర నుంచి తూర్పునకు గీయబడిన ఊహారేఖలు?
1) అక్షాంశాలు 2) రేఖాంశాలు
3) అక్షం 4) ఏదీకాదు
2. అక్షాంశాల దృష్ట్యా ఇండియా దేనిలో ఉంది?
1) ఉత్తర అక్షాంశం 2) దక్షిణార్ధగోళం
3) దక్షిణ అక్షాంశం 4) ఉత్తరార్ధగోళం
3. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యం?
1) ఇవి సమాంతర రేఖలు
2) ఇవి నిర్దిష్ట ప్రదేశాన్ని తెల్పుతాయి
3) భూమధ్య రేఖతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య - 181
4) పైవన్నీ
4. అక్షాంశాల దృష్ట్యా అత్యధిక జలభాగం ఉన్న అర్ధగోళం?
1) ఉత్తరార్ధ 2) దక్షిణార్ధ 3) పశ్చిమార్ధ 4) పూర్వార్ధ
5. ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవానికి గీయబడిన ఊహా రేఖలు?
1) అక్షం 2) రేఖాంశాలు
3) అక్షాంశాలు 4) ధృవ రేఖలు
6. రేఖాంశాల దృష్ట్యా ఇండియా ఏ అర్ధగోళంలో ఉంది?
1) పూర్వార్ధ 2) ఉత్తరార్ధ 3) దక్షిణార్ధ 4) పశ్చిమార్ధ
7. రేఖాంశాల దృష్ట్యా అత్యధిక జలభాగం ఉన్న అర్ధ గోళం?
1) ఉత్తరార్ధ 2) పశ్చిమార్ధ 3) పూర్వార్ధ 4) దక్షిణార్ధ
8. రేఖాంశాల దృష్ట్యా సరైన వాక్యం ఏది?
1) అర్ధ వృత్తాలు 2) కాలనిర్ణయ రేఖలు
3) మొత్తం సంఖ్య 360 4) పైవన్నీ
9. అంతర్జాతీయ కాలమాన రేఖ (అంతర్జాతీయ మధ్యాహ్న రేఖ/అంతర్జాతీయ మెరిడియన్ రేఖ)?
1) 1800 తూర్పు/పశ్చిమ రేఖాంశం 2) భూమధ్య రేఖ
3) 00 రేఖాంశం 4) 821/20 తూర్పు రేఖాంశం
10. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?
1) 1800ల తూర్పు రేఖాంశం
2) 00 ల రేఖాంశం
3) 821/20ల తూర్పు రేఖాంశం
4) 821/20ల పశ్చిమ రేఖాంశం
11. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్‌కు తూర్పు, పడమరలను కలిపి మొత్తం కాల మండలాలు?
1) 12 2) 24 3) 15 4) 180
12. ఒక కాల మండలానికి, మరో కాల మండలానికి మధ్య కాల భేదం ఎంత?
1) 2 గంటలు 2) 12 గంటలు
3) 1 గంట 4) ఏదీకాదు
13. ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత?
1) 1 గంట 2) 4 నిమిషాలు
3) 12 గంటలు 4) ఏదీకాదు
14. ఒక గంట సమయంలో భూమి ఎన్ని రేఖాంశాలను దాటుతుంది?
1) 1 2) 4 3) 12 4) 15
15. 100 తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు ఉన్నప్పుడు అక్కడి సమయం మ.12 గంటలు. అయితే 90 తూర్పు రేఖాంశం వద్ద సమయం?
1) 12:04 PM 2) 11:56 AM
3) 12:00 4) 11:56 PM
16. 100 తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు ఉన్నప్పుడు అక్కడ సమయం మ. 12 గంటలు, అయితే 110 తూర్పు రేఖాంశం వద్ద సమయం?
1) 12:04 PM 2) 12:00
3) 11:56 AM 4) 12:04 AM
17. భారతదేశ ప్రామాణిక సమయం, గ్రీనిచ్ ప్రామాణిక సమయం కంటే ......... ?
1) 51/2గంటలు ముందు ఉంటుంది
2) సమానంగా ఉంటుంది
3) 51/2 గంటలు వెనుక ఉంటుంది 4) ఏదీకాదు
18. గ్రీనిచ్ ప్రామాణిక సమయం, భారతదేశ ప్రామాణిక సమయం కంటే..
1) 51/2 గంటలు ముందుంటుంది
2) సమానంగా ఉంటుంది
3) 51/2 గంటలు వెనుక ఉంటుంది 4) ఏదీకాదు
19. ముంబై 730 తూర్పు రేఖాంశంపై ఉంది. అయిన గ్రీనిచ్ (00) వద్ద మధ్యాహ్నం 12:00 ఐతే, అప్పుడు ముంబైలో సమయం?
1) 4:00 PM 2) 4:52 PM
3) 4:52 AM 4) ఏదీకాదు
సమాధానాలు
1-1, 2-4, 3-4, 4-2, 5-2, 6-1, 7-2, 8-4, 9-1, 10-3, 11-2, 12-3, 13-2, 14-4, 15-2, 16-1, 17-1, 18-2, 19-2
భూమి ఆవరణములు
1. లితో అంటే గ్రీకు భాషలో అర్థం?
1) శిల్పం 2) జీవం 3) శిల 4) నీరు
2. నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు అనేవి దేనికి సంబంధించినవి?
1) వాతావరణం 2) శిలావరణం
3) జలావరణం 4) జీవావరణం
3. ఆవిరి అంటే గ్రీకు భాషలో అర్థం?
1) వాతావరణం 2) శిలావరణం
3) జలావరణం 4) జీవావరణం
4. బయోస్ అంటే అర్థం?
1) శిల 2) నీరు 3) ఆవిరి 4) జీవం
5. జీవం అనేది ఏ ఆవరణాన్ని ప్రభావితం చేస్తుంది?
1) శిలావరణం 2) జలావరణం
3) వాతావరణం 4) పైవన్నీ
6. మహా సముద్రాలు, ఖండాలు ఏ రకమైన భూ స్వరూపాలు?
1) మొదటి శ్రేణి 2) రెండో శ్రేణి
3) మూడో శ్రేణి 4) నాలుగో శ్రేణి
7. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏ రకమైన భూ స్వరూపాలు?
1) మొదటి శ్రేణి 2) రెండో శ్రేణి
3) మూడో శ్రేణి 4) నాలుగో శ్రేణి
8. లోయలు, డెల్టాలు (గాలి, నీరువల్ల ఏర్పడే భూస్వరూపాలు) ఏ రకం భూస్వరూపాలు?
1) మొదటి శ్రేణి 2) రెండో శ్రేణి
3) మూడో శ్రేణి 4) నాలుగో శ్రేణి
9. పలకల అంచుల వద్ద ఏర్పడే భూ చర్యలు?
1) అగ్ని పర్వతాలు 2) భూకంపాలు
3) 1, 2 4) ఏదీకాదు
10. భూగర్భంలో కరిగిన శిలాద్రవాన్ని ఏమంటారు?
1) లావా 2) మాగ్మా 3) 1, 2 4) ఏదీకాదు
11. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు పెల్లుబికి వచ్చిన శిలాద్రవాన్ని ఏమంటారు?
1) లావా 2) మాగ్మా 3) 1, 2 4) ఏదీకాదు
12. మధ్యదరా సముద్రపు ద్వీపస్తంభం అని ఏ అగ్ని పర్వతాన్ని పిలుస్తారు?
1) స్ట్రాంబోలి (సిసిలీ) 2) ఫ్యూజియామా (జపాన్)
3) కోటోపాక్సి (ఈక్వెడార్) 4) నార్కొండమ్ (ఇండియా)
13. అత్యధిక సంఖ్యలో అగ్ని పర్వతాలు బద్దలయ్యే, భూకంపాలు సంభవించే ప్రాంతం?
1) అట్లాంటిక్ వలయం 2) పసిఫిక్ అగ్ని వలయం
3) హిందూ వలయం 4) ఏదీకాదు
14. కిలిమంజారో అగ్ని పర్వతం కలిగిన ప్రాంతం?
1) భారత్ 2) ఫిలిప్పైన్స్ 3) ఇటలీ 4) టాంజానియా
15. నాజ్‌కా, అరేబియా వంటివి .................. పలకాలు.
1) పెద్ద 2) చిన్న 3) పసిఫిక్ 4) ఏదీకాదు
16. జిగ్‌సా పజిల్ అంటే?
1) ఖండాలన్నింటిని ఒక చోట అమర్చడం
2) సముద్రాలను విడగొట్టడం
3) ఖండాలన్నింటిని వేర్వేరుగా ఉంచటం 4) ఏదీకాదు
17. నీటి ప్రవాహం వల్ల ఏర్పడే భూ స్వరూపాలను జతపర్చండి.
భూ స్వరూపాలు ప్రాంతం
1) V ఆకారపు లోయ ఎ) ఏంజెల్
2) అగాధదరి బి) బైసన్ గార్జ్
3) జలపాతం సి) గ్రాండ్ కాన్యన్
4) ఒండ్రు మైదానం డి) నదీముఖ ద్వారం
ఇ) గంగా-సింధు మైదానం
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
18. తెలంగాణ, ఇండియాలో అత్యంత ఎత్తయిన జలపాతాలు?
1) టుగెలా, పోచారం 2) జోగ్, టుగెలా
3) కుంటాల, జోగ్ 4) జోగ్, కుంటాల
19. కింది వాటిని జతపర్చండి.
పార్ట్-1 పార్ట్-2
1) ఆసియాఖండం ఎ) హిమనీ నదాలు
2) హిమాలయాలు బి) రెండవ శ్రేణి
3) సుందర్‌బన్ డెల్టా సి) మొదటి శ్రేణి
4) U ఆకారపు లోయ డి) మూడో శ్రేణి
ఇ) ఇండస్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-సి, 2-బి, 3-డి, 4-ఇ
3) 1-సి, 2-బి, 3-ఇ, 4-ఎ 4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
20. అంతర్జనిత బలాలవల్ల ఏర్పడిన భూ స్వరూపం?
1) కొండలు 2) నదులు
3) జలపాతాలు 4) గార్జ్‌లు
21. భూ-అంతర్భాగపు సంవహన ఉష్ణప్రవాహాల వలన కలిగే ఫలితం?
1) ఖండం లాగబడుతుంది
2) పగులులోయ ఏర్పడుతుంది
3) సముద్రం ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంటుంది.
4) ప్రాచీన సముద్రం ఏర్పడుతుంది.
22. కింది వాటిని జతపర్చండి.
సముద్రపు భూ స్వరూపాలు నిర్మాణం
(అలల ప్రభావం వల్ల)
1) సముద్రపు తోరణాలు ఎ) సముద్ర భూభాగం
(సీ ఆర్చెస్) లోపలికి చొచ్చుకుని వెళ్లిన ప్రదేశం
2) పేర్పుడు స్తంభాలు (స్టాక్స్) బి) సముద్రంలోకి చొచ్చుకువచ్చిన భూభాగం
3) సముద్రపు బృగువు సి) సముద్రపు నీటి (సీ క్లిఫ్) నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం
4) అగ్రం డి) అలలవల్ల పక్కగోడల శిలలు మిగలడం
ఇ) సముద్రపు అలలు నిరంతరం రాళ్లకేసి కొట్టడం
1) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ 2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-బి, 2-డి, 3-సి, 4-ఇ
23. భూభాగంలో 1/5వ వంతు ఏ భూస్వరూపాలు ఉన్నాయి?
1) నదులు 2) కొండలు 3) లోయలు 4) ఎడారులు
24. గాలి ప్రభావంవల్ల ఏర్పడే భూ స్వరూపాలు?
1) పుట్ట గొడుగులు 2) ఇన్సెల్‌బెర్గ్
3) ఇసుక దిబ్బలు 4) పైవన్నీ
సమాధానాలు
1-3, 2-3, 3-1, 4-4, 5-4, 6-1, 7-2, 8-3, 9-3, 10-2, 11-1, 12-1, 13-2, 14-4, 15-2, 16-1, 17-2, 18-3, 19-4, 20-1, 21-1, 22-2, 23-4, 24-4
వాతావరణం
1. వాతావరణంలో ఉండే వాయువుల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
1) నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, నియాన్
2) నత్రజని, ఆర్గాన్, ప్రాణవాయువు, నియాన్
3) ప్రాణవాయువు, బొగ్గుపులుసు వాయువు, ఆర్గాన్, నియాన్
4) ఏదీకాదు
2. ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉండే ప్రదేశం?
1) ధృవాలు 2) భూమధ్య రేఖ
3) ఆయన రేఖ 4) పైవన్నీ
3. వాతావరణంలో మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?
1) ట్రోపో 2) స్ట్రాటో 3) మిసో 4) థర్మో
4. ఏయే ఆవరణల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం జరుగుతాయి?
1) ట్రోపో, స్ట్రాటో & ఐనో, మిసో
2) స్ట్రాటో, ఐనో & ట్రోపో, మిసో
3) ట్రోపో, మిసో & మిసో, ఐనో
4) ట్రోపో, మిసో & స్ట్రాటో, ఐనో
5. కింది వాటిని జతపర్చండి.
ఆవరణాలు అంశం
1. ఐనో ఆవరణం ఎ. జెట్ విమానాలు, ప్యారాచూట్‌లు, ఓజోన్ పొర
2. మిసో ఆవరణం బి. శీతోష్ణస్థితి, వర్షపాతం
3. స్ట్రాటో ఆవరణం సి. రేడియో తరంగాలు
4. ట్రోపో ఆవరణం డి. ఉల్కలు కాలిపోతాయి
ఇ. అత్యంత ఎత్తైన పొర
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ 2) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి 4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
6. కింది వాటిలో సరికాని వాక్యం?
1. గాలి నిదానంగా వీచి హాయిగా ఉండేది-సమీరం (తెమ్మర)
2. వేగంగా వీచే గాలి - ఈదురు గాలి
3. తీర ప్రాంతంలో వేగంగా వీచే గాలి - పెనుగాలి/తుపాను గాలి
4. తక్కువ పీడన ప్రాంతం నుంచి ఎక్కువ పీడన ప్రాంతం వైపు కదిలే గాలి - పవనం
7. ఉప ఆయన రేఖ వద్ద ఏర్పడిన అధిక పీడన మేఖల రెండు భాగాలుగా చీలి పవనాలను కింది విధంగా ప్రసరింపజేస్తుంది.
1) రెండు భాగాలు ఉపధృవ ప్రాంతం వైపు
2) రెండు భాగాలు భూమధ్య రేఖ ప్రాంతం వైపు
3) ఒక భాగం భూమధ్య రేఖ వైపు, మరొక భాగం ఉపధృవ ప్రాంతం వైపు
4) ఒక భాగం ధృవ ప్రాంతం వైపు, మరొక భాగం ఉపధృవ ప్రాంతం వైపు
8. ఉపధృవ ప్రాంతంలో ఏ పీడన మండలం ఏర్పడుతుంది?
1) అధిక పీడనం 2) అల్పపీడనం
3) 1, 2 4) ఏదీకాదు
9. అధిక పీడన మండలం ఏర్పడే ప్రాంతాలు, అల్పపీడన మండలం ఏర్పడే ప్రాంతాలు?
1. ఉప ఆయనరేఖ, ధృవ & భూమధ్యరేఖ, ఉపధృవ
2. ఉప ఆయనరేఖ, భూమధ్య రేఖ & ధృవ, ఉపధృవ
3. భూమధ్య రేఖ & ఉప ఆయరేఖ
4. ఏదీకాదు
10. ప్రపంచ పవనాలు అంటే?
1) వ్యాపార పవనాలు 2) పశ్చిమ పవనాలు
3) ధృవ పవనాలు 4) పైవన్నీ
11. ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి మాత్రమే పరిమితమై వీచే పవనాలు?
1) ప్రపంచ పవనాలు 2) రుతు పవనాలు
3) స్థానిక పవనాలు 4) ఏదీకాదు
12. మాన్‌సూన్ అనే ఆంగ్ల భాషాపదం, మౌసమ్ అనే ఏ భాషాపదం నుంచి వచ్చింది?
1) ఫ్రెంచ్ 2) అరబిక్ 3) గ్రీకు 4) లాటిన్
13. చినూక్, లూ అనేవి ఏ విధమైన పవనాలు?
1) శీతల 2) ఉష్ణ 3) 1, 2 4) ఏదీకాదు
14. లూ అనే ఉష్ణ పవనాలు ఏ దేశంలో వీస్తాయి?
1) ఫ్రాన్స్ 2) జపాన్
3) గుజరాత్ 4) ఉత్తర భారతదేశం
15. కింది వాటిలో శీతల పవనం కానిది?
1) మిస్ట్రాల్ 2) ప్యూనా 3) పాంపెరో 4) యోమా
16. జతపర్చండి.
పవనం పేరు ప్రాంతం
1. ఫోన్ ఎ. ఫ్రాన్స్, మధ్యదరా సముద్రం, రోమ్
2. సైమూన్ బి. జపాన్
3. మిస్ట్రాల్ సి. యూరప్
4. పాంపెరో డి. అరేబియా ఎడారి
ఇ. దక్షిణ అమెరికా (పంపాలు)
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ 2) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
17. వాతావరణంలోని నీటి ఆవిరిని (ఆర్థ్రతను) కొలిచే పరికరం?
1) రెయిన్ గేజ్ 2) ఉష్ణమాపకం
3) ఆర్థ్రతామాపకం 4) థర్మోఫైల్
18. జతపర్చండి.
మేఘం రకం లక్షణం
1. సిర్రస్ మేఘాలు ఎ. మధ్యలో ఉంటాయి
2. క్యుములస్ బి. బాగా ఎత్తులో ఉంటాయి
3. స్ట్రాటస్ సి. కింద స్థాయిలో
4. నింబస్ డి. వర్షం, నిలువు మేఘాలు
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
19. ఏ వర్షపాతాన్ని ఓరోజెనిక్ వర్షపాతం అంటారు?
1) సంవహన 2) పర్వతీయ 3) చక్రీయ 4) పైవన్నీ
20. తుఫాను/అల్పపీడన ద్రోణితో కూడిన వర్షపాతం?
1) సంవహన 2) పర్వతీయ 3) చక్రీయ 4) ఏదీకాదు
21. కింది వాటిలో సరైన వాక్యం?
1) వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకిలేచి చల్లబడినపుడు పడే వర్షం-సంవహన వర్షపాతం
2) తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండవల్ల పైకి లేచినపుడు కురిసే వర్షం - పర్వతీయ వర్షపాతం
3) సాధారణంగా పవనాలు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి - కొరియాలిస్ ప్రభావం
4) వాతావరణంలో సాపేక్ష ఆర్థ్రత 100గా ఉంటే దాన్ని సంతృప్త స్థాయి అంటారు 5) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1-1, 2-2, 3-1, 4-2, 5-3, 6-4, 7-3, 8-2, 9-1, 10-4, 11-2, 12-2, 13-2, 14-4, 15-4, 16-1, 17-3, 18-4, 19-2, 20-3, 21-5
జలావరణం
1. నీరు ఆవిరిగా మారే ప్రక్రియ?
1) ఘనీభవనం 2) భాష్పీభవనం
3) ద్రవీభవనం 4) అవపాతం
2. వర్షం కురవడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ?
1) ఘనీభవనం 2) భాష్పీభవనం
3) ద్రవీభవనం 4) అవపాతం
3. మంచు, పొగమంచు, వడగండ్ల రూపంలో నీరు భూమి మీదకు చేరడం?
1) ఘనీభవనం 2) భాష్పీభవనం
3) ద్రవీభవనం 4) అవపాతం
4. అవపాతంరూపం కానిది ఏది?
1) వర్షం 2) మంచు 3) మబ్బులు 4) స్లీట్
5. అత్యధికంగా నీరు భాష్పీభవనం దేనిద్వారా జరుగుతుంది?
1) నదులు 2) చెరువులు
3) చెట్లు 4) సముద్రాలు (మహాసముద్రాలు)
6. అత్యల్పంగా నీరు భాష్పీభవనం దేనిద్వారా జరుగును?
1) నదులు 2) చెరువులు
3) చెట్లు 4) మహాసముద్రాలు
7. మహాసముద్రాల్లో మొత్తం నీటిలో ఉప్పునీటి శాతం?
1) 2.75 శాతం 2) 97.25 శాతం
3) 68.76 శాతం 4) 29 శాతం
8. మొత్తం నీటిలో మంచి నీటి శాతం?
1) 97.25 శాతం 2) 68 శాతం
3) 2.75 శాతం 4) ఏదీకాదు
9. ప్రస్తుతం ఉన్న మహాసముద్రాలన్నీ కలిసి గతంలో ఏ మహాసముద్రంగా ఉండేవి?
1) లారెన్షియా 2) గోండ్వానాల్యాండ్
3) పాంథాల్సా 4) ఏదీకాదు
10. కింది వాటిని జతపర్చండి.
మహా సముద్రాల నేల లోతు
(నిమ్నోన్నత స్వరూపాలు)
1. ఖండతీరపు అంచు ఎ) 300 - 6000 మీ.
2. ఖండతీరపు వాలు బి) 200 - 3000 మీ.
3. మహాసముద్ర మైదానాలు సి) 6000 మీ. పైన
4. మహాసముద్ర అగాథాలు డి) 200 మీ.
ఇ) 20,000 మీ.
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి 2) 1-డి, 2-బి, 3-ఎ, 4-ఇ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ 4) 1-బి, 2-ఎ, 3- సి , 4- డి
11. ముడి చమురు, సహజవాయు నిక్షేపాలు లభించే మహాసముద్ర నేల ప్రాంతం?
1) ఖండతీరపు వాలు 2) ఖండతీరపు అంచు
3) మహాసముద్ర మైదానాలు
4) మహాసముద్ర అగాథాలు
12. సముద్ర అగాథదరులు ఏర్పడే ప్రాంతం లేదా ఉండే ప్రాంతం?
1) ఖండతీరపు అంచు 2) ఖండతీరపు వాలు
3) మహాసముద్ర మైదానాలు
4) మహాసముద్రపు అగాథాలు
13. కింది వాటిని జతపర్చండి.
నిమ్నోన్నత స్వరూపాలు విస్తీర్ణ శాతం
1. ఖండతీరపు అంచు ఎ) 79 శాతం
2. ఖండతీరపు వాలు బి) 76.2 శాతం
3. మహాసముద్ర మైదానాలు సి) 7.6 శాతం
4. మహాసముద్ర అగాథాలు డి) 15 శాతం
ఇ) 57 శాతం వరకు
1) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-ఇ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఇ
14. అతిపెద్ద మహాసముద్ర అగాథం?
1) ఫ్యుర్టోరికో 2) చాలెంజర్
3) జావా 4) సుందా
15. అతిపెద్ద ఖండతీరపు అంచుగల ప్రదేశం?
1) బోర్నియా 2) ఘనా
3) సైబీరియా 4) పపువా
16. చాలెంజర్ లేదా మెరియానా అగాథం లోతు మీటర్లలో ఎంత?
1) 10,475 మీ. 2) 11,022 మీ.
3) 7,450 మీ. 4) ఏదీకాదు
17. సమాన సముద్ర లోతుగల ప్రాంతాలను కలుపుతూ గీయబడే రేఖలను ఏమంటారు?
1) ఐసోథర్మో 2) ఐసోబార్
3) ఐసోబాత్‌లు 4) ఏదీకాదు
18. సాధారణ లవనీయత అంటే?
1) 1000 మి.లీ. సముద్ర జలాల్లో 350 గ్రా. ఉప్పు ఉండుట
2) 100 మి.లీ. సముద్ర జలాల్లో 35 గ్రా. ఉప్పు ఉండుట
3) 1 మి.లీ. సముద్ర జలాల్లో 35 గ్రా. ఉప్పు ఉండుట
4) 1000 మి.లీ. సముద్ర జలాల్లో 35 గ్రా. ఉప్పు ఉండుట
19. ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు?
1) ఐసోబాత్స్ 2) ఐసో హాలిన్స్
3) ఐసోబార్స్ 4) ఐసో హైట్స్
20. సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది, సముద్ర తీరం నుంచి నీరు కొంత లోపలికి పోతుంది. ఇవి వరుసగా..
1) పర్వవేలా తరంగాలు, లఘువేలా తరంగాలు
2) లఘువేలా తరంగాలు, పర్వవేలా తరంగాలు
3) తరంగం
4) ప్రవాహాలు
21. ఉష్ణ ప్రవాహాలకు సంబంధించి సరికాని వాక్యం?
1) ఇవి ఖండాలకు తూర్పువైపు నుంచి ప్రయాణిస్తాయి
2) ఇవి భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు ప్రయాణిస్తాయి
3) ఇవి ధృవ ప్రాంతాలను వేడెక్కిస్తాయి
4) ఇది గ్రీన్‌ల్యాండ్ ప్రవాహం
22. కాలిఫోర్నియా ప్రవాహం ఏ ప్రవాహం?
1) ఉష్ణప్రవాహం 2) శీతల ప్రవాహం
3) 1, 2 4) ఏదీకాదు
23. అట్లాంటిక్ మహాసముద్రానికి శీతల ప్రవాహం కానిది?
1) ఓయాషియో 2) లాబ్రడార్
3) కెనరీ 4) బెంగ్యులా
24. అత్యధిక, అత్యల్ప లవణీయతగల సముద్రాలు?
1) మృత సముద్రం, బాల్టిక్ సముద్రం
2) బాల్టిక్ సముద్రం, మృత సముద్రం
3) బాల్టిక్ సముద్రం
4) మృత సముద్రం
సమాధానాలు
1-2, 2-3, 3-4, 4-3, 5-4, 6-3, 7-2, 8-3,
9-3, 10-1, 11-2, 12-2, 13-4, 14-2, 15-3,
16-2, 17-3, 18-4, 19-2, 20-1,
21-4, 22-2, 23-1, 24-1
భూస్వరూపాలు
1. అత్యధిక ఎత్తును, వాలును వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగిన భూస్వరూపాలు?
1) పర్వతాలు 2) పీఠభూములు
3) మైదానాలు 4) కొండలు
2. ఎత్తైన ప్రదేశం, విశాలమైన ఉపరితలం కలిగిన భూస్వరూపం?
1) పర్వతాలు 2) పీఠభూములు
3) మైదానాలు 4) కొండలు
3. సున్నితమైన వాలు కలిగి, సమతలంగా, విశాలంగా ఉన్న భూస్వరూపం?
1) పర్వతాలు 2) పీఠభూములు
3) మైదానాలు 4) కొండలు
4. దేశంలో అతిపెద్ద పీఠభూమి?
1) దక్కన్ పీఠభూమి 2) బుందేల్‌ఖండ్
3) కర్ణాటక 4) తెలంగాణ
5. దేశంలో అతిపెద్ద మైదానం?
1) గంగా, సింధు మైదానం
2) దక్షిణ మైదానం
3) పశ్చిమ మైదానం
4) తూర్పు మైదానం
6. తెలంగాణ రాష్ట్రం కింది దేనిలో భాగం?
1) దక్కన్ పీఠభూమి 2) ఉన్నత పీఠభూములు
3) మధ్యధరా పీఠభూమి 4) ఏదీకాదు
7. దేవర కొండలు, యాదాద్రి కొండలు అని ఏ జిల్లాలోని తూర్పు కొండలకు పేరు?
1) నిజామాబాద్ 2) మెదక్
3) కరీంనగర్ 4) నల్లగొండ
8. కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట అనే పట్టణాలు ....... తెలంగాణ పీఠభూమిలో భాగం.
1) ఎగువ 2) దిగువ
3) 1, 2 4) ఏదీకాదు
9. భద్రాచలం, మంథని, మంచిర్యాల, చెన్నూరు పట్టణాలు ............ తెలంగాణ పీఠభూమిలో భాగం.
1) ఎగువ 2) దిగువ
3) 1, 2 4) ఏదీకాదు
10. నిర్మల్ కొండలు ఏ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో భాగం?
1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్
3) కరీంనగర్ 4) వరంగల్
11. బాలాఘాట్ పర్వతాలు ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి?
1) వరంగల్ 2) ఖమ్మం
3) మహబూబ్‌నగర్ 4) నల్లగొండ
12. నదులు సముద్రంలో కలిసేచోట ఏర్పడే స్వరూపం?
1) లోయలు 2) డెల్టా
3) కయ్యలు 4) పైవన్నీ
సమాధానాలు
1-1, 2-2, 3-3, 4-1, 5-1, 6-1,
7-4, 8-1, 9-2, 10-2, 11-3, 12-2
భూమి పొరలు
1. అత్యంత మందమైన భూపొర?
1) భూ పటలం 2) భూ ప్రావరం
3) భూ కేంద్రమండలం 4) ఏదీకాదు
2. కిందివాటిలో అత్యంత మందమైన పొర?
1) భూపటలం
2) భూ ప్రావారం
3) బయటి కేంద్రమండలం
4) అంతర్ కేంద్రమండలం
3. ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఏ పొరలో ఉంటాయి?
1) భూపటలం
2) భూ ప్రావారం
3) బాహ్య కేంద్రమండలం
4) అంతర్ కేంద్రమండలం
4. భూమి ఘన పరిమాణంలో అత్యల్ప, అత్యధిక శాతంగల పొరలు?
1) భూపటలం, భూప్రావారం
2) భూప్రావారం, భూకేంద్రమండలం
3) భూకేంద్రమండలం, భూపటలం
4) భూపటలం, భూకేంద్రమండలం
5. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) వెజినర్ 2) హిట్లర్
3) కొపర్నికస్ 4) టాలమీ
6. జతపర్చండి.
1. అపహేళి ఎ. 147 మి.కి.మీ.
2. పరిహేళి బి. 152 మి.కి.మీ.
3. భూమి వేగం గం. సి. 365 రోజుల 5 గం.ల 56 నిమిషాలు
4. భూపరిభ్రమణం డి. 1,07,200
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
7. జతపర్చండి.
పొరపేరు రసాయనాలు
1. భూపటలం ఎ. FE, MG
2. భూప్రావారం బి. SI, AL
3. భూ కేంద్రమండలం సి. SI, MG
డి. NI, FE
1) 1-బి, 2-సి, 3-డి 2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-ఎ, 2-డి, 3-సి 4) 1-బి, 2-సి, 3-డి
సమాధానాలు
1-3, 2-2, 3-4, 4-4, 5-1, 6-2, 7-1