Type Here to Get Search Results !

Vinays Info

రాజ్యసభ

రాజ్యసభ» 
రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు.» 1954లో రాజ్యసభగా నామకరణం చేశారు.» రాజ్యసభను పెద్దల సభ, ఎగువ సభ, మేధావుల సభగా వ్యవహరిస్తారు.» ఇది శాశ్వత సభ.» సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు.» ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.» రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250.» వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు.» సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవల్లో ప్రసిద్ధులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.» ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245.» వీరిలో 233 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు.» రాజ్యసభలో అధిక స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ (31), మహారాష్ట్ర (19) తమిళనాడు (18).» తెలంగాణకు 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.» ఆంధ్రప్రదేశ్‌కు 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.» కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీకి 3 స్థానాలు, పాండిచ్చేరికి ఒక స్థానం ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలకు రాజ్యసభ స్థానాలు లేవు.» రాజ్యసభలో తొలి ప్రతిపక్ష నాయకుడు కమలాభాయ్ త్రిపాఠి.» రాజ్యసభ సభ్యురాలిగా చేసిన తొలి నటి జయప్రద.» రాజ్యసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు.» రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.» అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం కేవలం రాజ్యసభకు మాత్రమే ఉంది.» ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.» రాజ్యసభకు ఉపరాష్ట్రపతి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.» రాజ్యసభ ఆర్థిక బిల్లును 14 రోజుల వరకు నిలుపుదల చేయవచ్చు.మ‌రిన్ని విష‌యాలు...» ద్రవ్య సంబంధమైన బిల్లులను లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.» ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. 14 రోజుల లోపు రాజ్యసభకు పంపాలి.» ప్రస్తుత లోక్‌సభ 16వది.» లోక్‌సభలో అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), పశ్చిమ్‌బంగ (42).» అతి ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన లోక్‌సభ 16వది.» 16వ లోక్‌సభలో మహిళల సంఖ్య 62.» 16వ లోక్‌సభ తర్వాత అతి ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సభ 15వది.» 15వ లోక్‌సభలో మహిళల సంఖ్య 59.» ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎక్కువమంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.» ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (కె.గీత, బి.రేణుక)» తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క మహిళా ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.(కె.క‌విత‌)» కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉంది.» మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఒక్కో లోక్‌సభ స్థానాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.» ఒక్కో లోక్‌సభ స్థానం మాత్రమే కలిగి ఉన్న రాష్ట్రాలు నాగాలాండ్, సిక్కిం, మిజోరాం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section