లోక్ సభ

VINAYS INFO
VINAYS INFO

లోక్‌సభ»
 1954లో లోక్‌సభ స్పీకర్ జి.వి.మౌలాంకర్ హౌస్ ఆఫ్ పీపుల్‌కు 'లోక్‌సభ' అని నామకరణం చేశారు.» దీన్ని ప్రజాప్రతినిధుల సభ, ప్రజల సభ, దిగువ సభ అని కూడా వ్యవహరిస్తారు.» ఇది తాత్కాలిక సభ.» లోక్‌సభలో మొత్తం గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. (రాష్ట్రాల నుంచి 530 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 స్థానాలు, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు)» ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యులు 545.
(530 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు)» ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.» లోక్‌సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు.» లోక్‌సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.» లోక్‌సభలో ఒక పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే 10% స్థానాలు కైవసం చేసుకోవాలి.» లోక్‌సభలో తొలి ప్రతిపక్ష నాయకుడు వై.బి.చవాన్.» లోక్‌సభ సభ్యులను వయోజన ఓటుహక్కుతో ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.» లోక్‌సభ రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించకూడదు.» 5వ లోక్‌సభ 6 సంవత్సరాలు పనిచేసింది.» అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రిమండలిని తొలగించే అధికారం లోక్‌సభకు ఉంది.

You may like these posts

Post a Comment