శాసనసభ» శాసనసభను విధాన సభ అని కూడా అంటారు.» శాసనసభలో ప్రజలు ఎన్నుకున్నవారు సభ్యులుగా ఉంటారు.» ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి సభలో సభ్యులు సంఖ్య ఉంటుంది.» శాసనసభకు పోటీచేయడానికి కావాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు.» శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు.» స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు.» స్పీకరు లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.» స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు.» శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ, పాండిచ్చేరి.» విధానసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 500కు మించకూడదు.» కనిష్ఠ సభ్యుల సంఖ్య 60కు మించకూడదు.» గోవా (40), సిక్కిం (32), మిజోరాం (40) రాష్ట్రాల్లో 60 కంటే తక్కువ సభ్యులున్నారు.» ఆర్థిక బిల్లు విషయంలో శాసనసభదే అంతిమ నిర్ణయం.శాసనమండలి» శాసనమండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు.» మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువ ఉండకూడదు. కనీసం 40 మంది సభ్యులుండాలి.
(i) మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు పరోక్షంగా ఎన్నికవుతారు.
(ii) 1/3వ వంతును రాష్ట్ర శాసనసభ్యులు ఎన్నుకుంటారు.
(iii) 1/3వ వంతును స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు.
(iv) 1/12వ వంతును పట్టభద్రులు ఎన్నుకుంటారు.
(v) 1/12వ వంతును ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.
(vi) 1/6వ వంతును గవర్నర్ నామినేట్ చేస్తారు.» విధానపరిషత్‌లో సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు.» ఇది శాశ్వత సభ.» ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒకవంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.» సభ్యుల కాలపరిమితి 6 సంవత్సరాలు.» ప్రస్తుతం శాసనమండలి ఉన్న రాష్ట్రాలు 7. అవి (1) ఉత్తరప్రదేశ్ (2) ఆంధ్రప్రదేశ్ (3) తెలంగాణ (4) కర్ణాటక (5) మహారాష్ట్ర
(6) బిహార్ (7) జమ్మూకశ్మీర్
శాసనసభ అండ్ శాసన మండలి
May 15, 2016
Tags