తెలంగాణ రాష్ట్రం.. జనాభా అధ్యయనం
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం జనాభాపై పూర్తి అవగాహన పొందడానికి 2014, ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఇందులో దాదాపు 1,09,00,515 కుటుంబాలు, 3,85,892 మందిని సర్వే చేశారు. ఆ నివేదిక ప్రకారం...
బీసీ జనాభా
సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ (వెనుకబడిన వర్గాలు)లు 1,85,61,856 అంటే 51.08 శాతం ఉన్నారని తేలింది. దీనిప్రకారం బీసీ జనాభాలో 27,71,320 మందితో రంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉంది. రాష్ట్రంలో అన్ని కులాల జనాభా 3,63,37,160 ఉండగా అందులో సగం బీసీలుగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మంలో బీసీ జనాభా 10,24,063 కనిష్ఠంగా నమోదైంది. దేశంలో బీసీ జనాభా 43.7 శాతంగా ఉంది. శాతం పరంగా గమనిస్తే గరిష్ఠంగా కరీంనగర్‌లో 62.68 శాతం, కనిష్ఠంగా హైదరాబాద్‌లో 35.20 శాతం నమోదైంది.
ఎస్సీ జనాభా 17.50 శాతం
సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.50 శాతం అంటే 63,60,158 ఉంది. అధికంగా రంగారెడ్డి జిల్లాలో 9,55,430 మంది ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. దేశంలో ఎస్సీ జనాభా 16.2 శాతంగా నమోదవ్వగా, రాష్ట్రంలో కనిష్ఠంగా 3,90,163 జనాభాతో నిజామాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలో ఎస్సీ జనాభా శాతం గమనిస్తే గరిష్ఠంగా 20.33 శాతంతో కరీంనగర్ ప్రథమ స్థానంలో, కనిష్ఠంగా హైదరాబాద్‌లో10.64 శాతం నమోదయింది. సంఖ్యాపరంగా గరిష్ఠంగా రంగారెడ్డి, కనిష్టం నిజామాబాద్ జిల్లా. శాతం పరంగా గరిష్ఠం కరీంనగర్. కనిష్ఠం హైదరాబాద్.
ఎస్టీ జనాభా
రాష్ట్రంలో ఎస్టీ జనాభా 9.91 శాతం. అయితే దేశంలో 8.2 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఎస్టీ జనాభా 36,02,288. ఇందులో ఖమ్మం 6,83,977 మందితో ప్రథమస్థానంలో ఉండగా ఆదిలాబాద్, వరంగల్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఖమ్మంలో గరిష్ఠంగా 26.05 శాతం. కనిష్ఠంగా హైదరాబాద్‌లో 1.98 శాతంగా నమోదయింది.
హిందువులు
రాష్ట్రంలో 87.17 శాతం హిందువులు ఉండగా. ఇందులో గరిష్ఠంగా రంగారెడ్డి జిల్లాలో 14,18,792 కుటుంబాలు, కనిష్ఠంగా హైదరాబాద్‌లో నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కుంటుంబాలు 1,01,93,027 ఉండగా హిందూ కుటుంబాలు 88,85,514.
ముస్లిం కుటుంబాలు 11.01 శాతం
రాష్ట్రంలో11.01 శాతం (11,22,023) ముస్లింల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో గరిష్ఠంగా 3,83,662 కుటుంబాలు హైదరాబాద్‌లో నమోదు కాగా, కనిష్ఠంగా ఖమ్మంలో 49,752 నమోదయ్యాయి.
క్రైస్తవులు
రాష్ట్రంలో క్రైస్తవ కుటుంబాలు 1,29,107 (1.27 శాతం). ఇందులో గరిష్ఠంగా రంగారెడ్డిలో జిల్లాలో 43,813 కుటుంబాలు నమోదుకాగా, కనిష్ఠంగా ఆదిలాబాద్‌లో 3,771 కుటుంబాలు ఉన్నాయి.
సిక్కులు
వీరి కుటుంబాల సంఖ్య 15,035 (0.15 శాతం). ఇందులో గరిష్ఠంగా 4,504 కుటుంబాలు రంగారెడ్డి జిల్లాలో నమోదయితే, కనిష్ఠంగా 560 కుటుంబాలు ఖమ్మం జిల్లాలో నమోదయ్యాయి.
జైనులు
రాష్ట్ర మొత్తం జనాభాలో జైన మతస్తులు 0.06 శాతం. వీరి కుటుంబాల సంఖ్య 5726. ఇందులో గరిష్ఠంగా హైదరాబాద్‌లో 3,982 కుటుంబాలు ఉండగా, కనిష్ఠంగా కరీంనగర్‌లో 37 కుటుంబాలు ఉన్నాయి.
ఆదిలాబాద్‌లో బౌద్ధులు అధికం
వీరి కుటుంబాలు 4890 (0.05) నమోదు కాగా గరిష్ఠంగా ఆదిలాబాద్‌లో 3359 ఉండగా కనిష్ఠంగా నల్లగొండలో 21 కుటుంబాలు నమోదయ్యాయి.
కుటుంబాల సంఖ్య 1,01,93,027
రాష్ట్రంలో నమోదయిన మొత్తం కుటుంబాల సంఖ్య 1,01,93,027. అందులో గరిష్ఠంగా రంగారెడ్డి జిల్లాలో 16,56109 కుటుంబాలు, కనిష్ఠంగా నిజామాబాద్‌లో 6,96,994 కుటుంబాలు ఉన్నాయి.
రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 42,10,019 మరుగుదొడ్లు లేని కుటుంబాలు ఉండటం విచారకరం. అదేవిధంగా 14,49,462 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. కిరాయి ఇళ్లలో 24,58,381 కుటుంబాలు ఉండ గా, ఒకే గదిలో నివసించే కుటుంబాలు 42,02,101 ఉన్నాయి. నలుగురు నివసించే కుటుంబాల సంఖ్య గరిష్ఠంగా 31,37,700 (30.78 శాతం) ఉన్నాయి.
వ్యాధులు
రాష్ట్రంలో 16 శాతం జబ్బులు హృద్రోగం, 10 శాతం ఆస్తమా, 9 శాతం పక్షవాతం, 1 శాతం ఎయిడ్స్ జబ్బులు ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
పట్టణ జనాభా
రాష్ట్రంలో గరిష్ఠ పట్టణ జనాభా 100 శాతం హైదరాబాద్‌లో నమోదయింది. తర్వాత స్థానాల్లో రంగారెడ్డి (70.08), వరంగల్ (28.16) జిల్లాలు ఉన్నాయి. కనిష్ఠంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 14.97 శాతంగా ఉంది.
కార్మికులు
శ్రామికుల నుంచి నిరుద్యోగులను మినహాయిస్తే లభిం చే వారే కార్మికులు. రాష్ట్రంలో గరిష్ఠంగా కార్మికులు మహబూబ్‌నగర్‌లో (51.38 శాతం) నమోదవ్వగా, తర్వాత స్థానాల్లో ఖమ్మం (50.41 శాతం) నల్లగొండ (49.92 శాతం) ఉన్నాయి. కనిష్ఠంగా కార్మికులు హైదరాబాద్‌లో 35.84 శాతంగా నమోదయ్యారు.
ప్రధాన కార్మికులు
సంవత్సరంలో 180 రోజులపైన పని కలిగిన కార్మికులను ప్రధాన కార్మికులు అంటారు. రాష్ట్రంలో గరిష్ఠంగా ప్రధాన కార్మికులు మహబూబ్‌నగర్‌లో 44.80శాతం నమోదు కాగా, తరువాత స్థానాల్లో ఖమ్మం 43.46 శాతం నమోదు కాగా, తరువాత స్థానాల్లో ఖమ్మం 43.46 శాతం, నల్లగొండలో 42.81 శాతం, కనిష్ఠంగా హైద రాబాద్‌లో 27.80 శాతం నమోదయ్యారు.
ప్రధాన కార్మికుల్లో వ్యవసాయ కార్మికులు
ప్రధాన కార్మికుల్లో వ్యవసాయ కూలీలు గరిష్ఠంగా ఖమ్మంలో 54.89 శాతం, నల్లగొండ జిల్లాలో 46.42 శాతం, మహబూబ్‌నగర్‌లో 42.02 శాతం నమోదు కావడం జరిగింది. కనిష్ఠంగా హైదరాబాద్‌లో 1.53 శాతం నమోదు అయింది. ప్రధాన కార్మికుల్లో కుటుంబ పరిశ్రమల్లో పనిచేసేవారు గరిష్ఠంగా నిజామాబాద్‌లో 14.20 శాతం, కనిష్ఠంగా ఖమ్మంలో 1.25 శాతం నమోదైంది.
ఉపాంత కార్మికులు
ఏడాదిలో 180రోజుల్లోపు పని కలిగిన వారిని ఉపాంత కార్మికులు అంటారు. రాష్ట్రంలో గరిష్ఠ శాతం ఉపాంత కార్మికులు గల జిల్లా ఆదిలాబాద్ (9.38) కాగా, కనిష్ఠంగా మహబూబ్‌నగర్‌లో 6.58 శాతం నమోదైంది.
ప్రధాన కార్మికుల్లో రైతులు
రైతులు అధికంగా ఆదిలాబాద్‌లో 32.21 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్‌లో 30.24 శాతం, మెదక్‌లో 28.27 శాతంగా ఉన్నారు. తక్కువగా హైదరాబాద్‌లో 1.34 శాతంగా ఉన్నారు.
ఎస్సీ అక్షరాస్యత
రాష్ట్రంలో ఎస్సీల అక్షరాస్యత గరిష్ఠంగా హైదరాబాద్‌లో 77.28 శాతం ఉంటే, కనిష్ఠంగా మహబూబ్‌నగర్‌లో 47.72 శాతం నమోదయింది. అదేవిధంగా స్త్రీ, పురుషుల్లోనూ గరిష్ఠం హైదరాబాద్, కనిష్ఠం మహబూబ్‌నగర్‌లో ఉన్నారు.
ఎస్టీ అక్షరాస్యత
రాష్ట్రంలో గరిష్ఠ ఎస్టీ అక్షరాస్యత 69.34 శాతంతో హైదరాబాద్ నమోదు చేసుకుంటే, కనిష్ఠంగా 42.29 శాతంతో మహబూబ్‌నగర్ కలిగి ఉన్నది. అదేవిధంగా పురుషులు, స్త్రీల అక్షరాస్యతలో హైదరాబాద్ గరిష్ఠంగా, మహబూబ్‌నగర్‌లో కనిష్ఠంగా ఉంది.
జిల్లాలో జనాభా పరిమాణం
రాష్ట్రంలో అధిక జనాభా పరంగా జిల్లాలు వరుసగా రంగారెడ్డి (61,45,663), మహబూబ్‌నగర్ (42,86,792), కరీంనగర్ (38,42,584)నమోదైంది. హైదరాబాద్ జనా భా 37,96,103 తో నాల్గవ స్థానంలో ఉన్నది. చివరగా నిజామాబాద్‌లో 24,69,816 జనాభా నమోదైంది. దేశంలో రాష్ట్ర జనాభా 12వ స్థానం కలిగి ఉన్నది.
విస్తీర్ణం
రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం వరుస స్థానంలో ఉండగా (18432, 16105, 16029 చ॥కి॥మీ) ఉండగా కనిష్ఠంగా హైదరాబాద్‌లో 217 చ॥కి.మీ నమోదు కావడం జరిగింది. విస్తీర్ణంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉన్నది.
మహిళల అక్షరాస్యత 57.92 శాతం
రాష్ట్రంలో అక్షరాస్యత 2001లో 58 శాతం ఉండగా, 2011 నాటికి అది 66.46 శాతానికి చేరింది. అయితే దేశ సగటు 72.99 శాతం కంటే తక్కువగానే ఉన్నది. తెలంగాణ గ్రామ అక్షరాస్యత 57.25
తెలంగాణ రాష్ట్రం.. జనాభా అధ్యయనం
May 13, 2016