అధివృక్క గంథ్రి
అధివృక్క గ్రంథులు మూత్రపిండాలపై టోపిలా కనిపిస్తాయి. వీటి నిర్మాణంలో రెండు భాగాలుంటాయి. వెలుపలి వల్కలం (Cortex), లోపలి దవ్వ (Medulla) వల్కలం నుంచి విడుదలయ్యే కార్టికాయిడ్‌స మూడు రకాలు. గ్లూకో, ఖనిజ, లైంగిక కార్డికాయిడ్‌స దవ్వ నుంచి ఎపినెఫ్రిన్ (అడ్రినలిన్) నార్ ఎపినెఫ్రిన్ (నార్ అడ్రినలిన్) అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ రెండూ ఎమర్జెన్సీ లేదా పోరాట పలాయన హార్మోన్లు.
బీజకోశాలు
పురుష బీజ కోశాలైన ముష్కాలు, స్త్రీ బీజ కోశాలైన అండాశయాలు లైంగిక హార్మోన్లను విడుదల చేస్తాయి. పురుష లైంగిక హార్మోన్లు ఆండ్రోజెన్‌స. వీటిలో ప్రధానమైంది టెస్టోస్టిరాన్. స్ట్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజెన్‌స. వీటిలో ప్రధానమైంది బీటా-ఈస్ట్రడయోల్. ఈ లైంగిక హార్మోన్లు స్త్రీ, పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అదనంగా జీర్ణకోశం నుంచి కొన్ని హార్మోన్లు, మెదడులో ఉండే పీనియల్ గ్రంథి నుంచి మెలటోనిన్ అనే హార్మోన్, యుక్తవయసు వరకు మాత్రమే ఉండే బాలగ్రంథి (థైమస్) నుంచి థైమోసిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి.