శాతవాహనుల రాజకీయ చరిత్ర
- దక్కన్ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం శాతవాహనులు. వీరి పాలన గురించి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వాయు పురాణంలో 30 మంది రాజులని, మత్స్య పురాణంలో 19 మంది రాజులని వివరాలు ఉన్నాయి. (ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏ పురాణంలో ఎంత మంతి రాజులను పేర్కొన్నారు)
- శ్రీముఖుడు ఈ రాజ్య స్థాపకుడు ఇతడు మౌర్యులకు సామంతుడిగా పనిచేశాడు. ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో పౌరతిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాట్లు చివరకు దక్కన్ ప్రాంతానికి వ్యాపించి శ్రీముఖుని మరణానికి కారణమయ్యాయి. ప్రజలు తిరుగుబాటు చేసి, ఇతని పాలనను వ్యతిరేకించి చంపేశారని జైనమత గ్రంథంలో సోమదేవసూరి తన కథాసరిత్సాగరంలో, హేమచంద్ర సూరి పరిశిష్టపర్వన్ గ్రంథంలో వివరించారు. ఇతని తర్వాత కన్హుడు లేదా కృష్ణుడు రాజ్యానికి వచ్చాడు.
- ఉత్తర భారతదేశంలోని వాసుదేవుడు భాగవతమతం స్థాపించాడు. ఈ మతాన్ని దక్షిణ భారతదేశంలో కన్హుడు ప్రచారం చేశాడు. ఇతడు బౌద్ధులకు లేదా శ్రావణుల కొరకు నాసిక్ (గోదావరి నది జన్మప్రాంతం)లో ఒక గుహ దేవాలయం నిర్మించాడు. ఈ దేవాలయాన్ని కొంచెం మార్పులు చేసినట్లు తర్వాతి కాలంలో గౌతమీ బాలశ్రీ తన నాసిక్ శాసనంలో చెప్పుకొంది.
మొదటి శాతకర్ణి
- కన్హుడి తర్వాత మొదటి శాతకర్ణి లేదా మల్లకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతని గురించి మత్స్య పురాణం (మొత్తం 18 పురాణాలు కలవు. వీటిని అష్టాదశ పురాణాలు) అంటారు. (తొలి పురాణం మత్య్స, దశావతారాల్లో కూడా మొదటిది). మౌర్యు ల చివరి రాజు బృహద్రదుడు తన సేనాని పుష్యమిత్రుడి చేతిలో ఓడి చంపబడ్డాడు. దీంతో ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత శుంగవంశాన్ని పుష్యమిత్ర శుంగుడు స్థాపించాడు.
దీంతో అప్పటి వరకు మౌర్యులకు సామంతులుగా ఉన్న శాతవాహనులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. మొదటిశాతకర్ణి నిజమైన శాతవాహన రాజుగా చెప్పుకోవచ్చు. అశ్వమేథ, రాజసూయ యాగాలు నిర్వహించాడు. తన రాజ్యాన్ని విస్తరించడానికి మరాఠా రాజు త్రణకైయిలో కుమార్తె దేవి నాగానికను వివాహం చేసుకున్నాడు. నాగానిక నానాఘాట్ శాసనం వేయించింది. ఈ శాసనంలో త్రైరాజ్య యుద్ధాల గురించి, శాతవాహనులు స్వతంత్రం స్థాపించుకొనుటకు గల కారణాలు వివరించింది. త్రైరాజ్య యుద్ధాలంటే శాతవాహనుకు, కళింగులకు మధ్య విభేదాలు, కళింగులకు,శుంగులకు మధ్య రాజకీయ విభేదాల గురించి పేర్కొంటుంది.
- మొదట శాతకర్ణి రాజ్యవిస్తరణలను కళింగ ఖారవేలుడు అడ్డుకట్ట వేశాడు. ఇతని రాజ్యంపైకి దాడి చేసి పితుండ నగరంను గాడిదలతో దున్నించాడు. (పితుండ నగరం ప్రతిపాల నగరం(ప్రతిపాలపురం)గా పేర్కొన్నారు). ఇతనికి దక్షిణాపథపతి అనే బిరుదు కలదు. తర్వాత పూర్ణాత్సంగ, స్కందస్కంబి పాలనలోకి వచ్చారు. తర్వాత రెండోశాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతడు దీర్ఘకాలం పరిపాలించిన శాతవాహన రాజు. దాదాపు 56 ఏండ్లు పరిపాలించాడు. ఇతడు ఒడిశా (కళింగ), పాటలీపుత్ర ప్రాంతాలను జయించినట్లు ఆనందుడు అనే కవి పేర్కొన్నాడు. ఇతని తర్వాత లంబోదరుడు, అప్పీలకుడు, మేఘస్వాతి, స్వాతికర్ణి, స్కందస్వాతి, మృగేంద్రుడు వరుసగా రాజ్యానికి వచ్చారు.
కుంతల శాతకర్ణి
- ఇతని కాలంలో ప్రాకృత భాషను రద్దుచేసి సంస్కృతాన్ని ప్రవేశపెట్టాడు.(ఇతని కాలంలోనే సంస్కృతం రాజభాష, మిగతా రాజులందరిలో ప్రాకృతం రాజభాష) ఇతని ఆస్థానంలో వాత్సాయనుడు కామశాస్త్రం అనే గ్రంథంలో సంగీతం, సాహిత్యంతో పాటు (64 కళల గురించి పేర్కొన్నాడు) పేయింటింగ్స్, వాటి రకాల గురించి పేర్కొన్నాడు. ఈ గ్రంథానికి శంకారాచార్యుడు జయమంగళం పేరుతో వ్యాఖ్యా నం రచించాడు. తర్వాత పులోమావి-I రాజ్యానికి వచ్చాడు. ఇతడు పాటలీపుత్రంపై దాడి చేశాడు. ఇతని చేతిలో ఓటమి చెంది ఉరిశిక్షకు గురైన కణ్వ వంశ పాలకుడు సుశర్మ.(సుశర్మ అనంతరం మగధను కణ్వులు పరిపాలించారు. కణ్వవంశ స్థాపకుడు వాసుదేవుడు) పులోమావి ఘన విజయాల గురించి కుమ్రాహార్(ప్రాచీన పాటలీపుత్రం), బీత (అలహాబాద్ సమీపంలో ఉంది), తవ్వకాల్లో లభించిన శాతవాహనులు నాణేలు రుజువు చేస్తున్నాయి.
- హాలుడు పాలించినది ఒక సంవత్సరమే. అయినా ఇతని కీర్తి అజరామరమైనది. స్వయంగా గొప్పకవి. అనేక మంది కవులను పోషించి కవి వత్సలుడుగా ప్రసిద్ధి చెందాడు. శ్రీలంక మీద దండయాత్ర చేసి దుట్టగామణి అనే రాజును ఓడించి లీలావతి అనే రాజకుమార్తెను తీసుకొచ్చి తెలంగాణలోని గోదావరి తీరంలో వివాహం చేసుకున్నాడు. ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాడ్యుడు (తెలంగాణ తొలికవి) బృహత్కథ గ్రంథకర్త నివసించారు.
గౌతమిపుత్ర శాతకర్ణి
- శాతవాహనుల్లో గొప్పరాజు. యవనులను, శకులను, ప్రహ్లావులను నాశనం చేశాడు. వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడుగా ప్రసిద్ధి. త్రిసముద్రతోయ పీతవాహనుడు(ఇతని రాజ్యం మూడు సముద్రాల వరకు విస్తరించినది అని అర్థం). ఇతనికి రాజరాణో లేదా రాజరాజు అనే బిరుదు ఉన్నట్లు తన తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన శాసనం నాసిక్లో వివరాలు కలవు. (నాసిక్ శాసనం 24వ రాజు వాసిష్టపుత్ర పులోమావి కాలంలో చెక్కించబడెను).
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
May 28, 2016
Tags