ఆక్సిజన్
ప్రాణ వాయువు (ఆంగ్లం:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటె ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువు ను గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.
సంకేతం,ఫార్ములా
ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O2".
చరిత్ర
స్వీడన్ దేశస్తుడైన షీలే మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టు 1774 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.
ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ
ఆక్సిజన్ ను పొటాషియం పెర్మాంగనేట్(KMnO4),
పొటాషియం క్లోరేట్(KClO3),
హైడ్రోజన్ పెరాక్సైడ్(H2O2),
పొటాషియం నైట్రేట్ (KNO3) మరియు మెర్క్యురిక్ ఆక్సైడ్ (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.
2KClO3 → 2KCl + 3O2 ↑2KNO3 → 2KNO2 + O2 ↑2HgO → 2Hg + O2 ↑2NaNO3 → 2NaNO2 + O2 ↑
పొటాషియం పెర్మాంగనేట్ నుండి తయారీ
ఒక పరీక్షనాళిక లో కొంత పొటాNveen రంధ్రం గల రబ్బరు బిరడా ను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాళికను నెమ్మదిగా వేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశమునొందించి వాయు జాడీ లోనికి వెళ్తుంది.
సమీకరణం: 2KMnO4 → K2MnO4+MnO2 +O2↑
ఆక్సిజన్ వాయువు పరీక్ష
క్సిజన్ ఉన్న జాడీలో మండుచున్న పుల్లను పెడితే అది ప్రకాశవంతంగా మండును.