Type Here to Get Search Results !

Vinays Info

తమలపాకు

తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. ఇది పైపరేసికుటుంబానికి చెందినది. బీటిల్, అనే పదం తమిళ పదమైన వెట్టిల నుండి వచ్చినది. ఈ పదం పోర్చుగీసు ద్వారా వచ్చినది. దీనిని పానా ఆకులు అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు. తమలపాకు దక్షిణ మరియు అగ్నేయ ఆసియాలోనూ, పాకిస్తాన్ నుండి న్యూగినియా వరకూ విస్తృతంగా పండిస్తారు. తమలపాకు సంవత్సర వర్షపాతం 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి.ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు. ఆంధ్ర దేశంలో తుని తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరం లో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section