Type Here to Get Search Results !

Vinays Info

జీవుల వర్గవికాస చరిత్ర

జీవుల వర్గవికాస చరిత్ర
కణ సిద్ధాంతం
- అణు సిద్ధాంతం (దీన్ని ప్రత్యక్షంగా చూడలేం)
- నిరూపించకపోయినా, బలమైన ఆధారాలను బట్టి వివరించడాన్ని కూడా సిద్ధాంతం అంటారు.
నియమాలు
- క్రమంగా ఏర్పడే సంఘటనల వివరణను నియమం అంటారు.
- యదార్థంగా జరిగే సంఘటనలను జాగ్రత్తగా నమోదు చేసే విషయమే నియమం. ఇది ప్రయోగ పరిశీలనపై ఆధారపడి అనేకసార్లు రుజువు చేసి సప్రమాణతను కలిగి ఉంటుంది.
- ఉదా: బాయిల్ నియమం, చార్లెస్ నియమం.
విజ్ఞానశాస్త్ర విధులు
- మానవుని మేధస్సు నిరంతరం తన అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణ కొనసాగిస్తూనే శాస్త్రసాంకేతిక అభివృద్ధి జరుపుతున్నాడు.
- విజ్ఞానశాస్త్రం జీవితస్థాయిని పెంచుతుంది, శాస్త్రీయ విధానంలో శిక్షణనిస్తుంది. సాంస్కృతిక విలువల్లో, ఆలోచనా రంగంలో మార్పులు తెస్తుంది.
- విద్యార్థులను మంచి భావిపౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు శాస్త్రీయ వైఖరిని కలిగిస్తుంది.
- విజ్ఞానశాస్ర్తాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి స్థూలంగా భౌతిక, జీవ శాస్ర్తాలుగా విభజించారు.
- భౌతికశాస్త్రం తిరిగి భౌతిక, రసాయన శాస్ర్తాలుగా, జీవశాస్త్రం వృక్ష, జంతుశాస్ర్తాలుగా వర్గీకరించారు. ఇవి ప్రత్యేక శాఖలు, అనువర్తిత శాఖలుగా అభివృద్ధి చెంతున్నాయి.
జీవశాస్త్రం-అర్థం
- జీవం గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని జీవశాస్త్రం అంటారు. జీవశాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా జేబీ లామార్క్ ఉపయోగించారు. ఇది గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది.
- జీవశాస్త్రం (BIOLOGY) = జీవం (BIOS) + శాస్త్రం (LOGOS)
- జీవ ఆవిర్భావం 3,500 ఏండ్ల క్రితం జరిగింది.
- జీవశాస్త్రంలో మొక్కలు, జంతువులను చేర్చారు.
- మొక్కల అధ్యయనం వృక్షశాస్త్రం (BOTONY). బోటనీ అనే పదం గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. బోటనీ (BOTANAE) అంటే హెర్బ్ (HERB) పొద అని అర్థం.
- జంతువుల అధ్యయనం జంతుశాస్త్రం (ZOOLOGY). జువాలజీ జూఆన్ అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. జాఆన్ (ZOOON) అంటే యానిమల్ (ANIMAL) (జంతువు) అని అర్థం.
జీవశాస్త్ర స్వభావం
- జీవశాస్త్రం కూడా విజ్ఞాన శాస్త్ర స్వభావం కలిగి ఉంటుంది. విజ్ఞానశాస్త్రంలోని శాస్త్రీయ ప్రక్రియలైన పరిశీలన, ప్రకల్పన, దత్తాంశ సేకరణ, మాపనం, ప్రయోగాలు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి.
- కొత్త విషయాల అన్వేషణలో జీవశాస్త్రం తోడ్పడుతుంది.

జీవశాస్త్ర ప్రాముఖ్యత
- మానవజాతి అభివృద్ధికి జీవశాస్త్ర పరిజ్ఞానం వెన్నెముక. భూమిపై జీవం గురించిన అవగాహనను ఇది అందిస్తుంది.
- జీవశాస్త్రం శాస్త్రీయ పద్ధతి, క్రమశిక్షణ, అభిరుచులను కల్పిస్తుంది. విశాల దృక్పథాన్ని అందిస్తుంది. జీవకోటి మనుగడకు ప్రాముఖ్యత ఇస్తుంది.
- అత్యున్నత స్థాయి జీవనానికి అవసరమైన పోషణ, ఆహారం, ఆరోగ్యం, సహజ వనరుల పరిరక్షణ, వినియోగం సంబంధిత జ్ఞానాన్ని అందిస్తుంది.
- ఇతర సబ్జెక్టులతో ఉన్న సహసంబంధాన్ని తెలుపుతుంది, పరిశీలన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
జీవశాస్త్ర పరిధి
- ఇది బహు విశాలమైనది.
- పూర్వం భారతదేశంలో చరకుడు చరక సంహిత, శుశ్రుతుడు శుశ్రుతసంహిత రాయడానికి మూలం జీవశాస్త్రం.
- పూర్వం జీవశాస్ర్తాన్ని వర్ణణాత్మక శాస్త్రంగా పరిగణించారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక నిర్మాణ శాస్త్రంగా రూపొందింది.
- జీవశాస్ర్తానికి అత్యంత కృషి చేసింది- అరిస్టాటిల్ (జీవశాస్త్ర పితామహుడు)
- మన చుట్టూ ఉన్న జీవుల స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రమే జీవశాస్త్రం.
జీవశాస్ర్తాన్ని 3 శాఖలుగా విభజించారు
1. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు (PURE BRANCHES)
2. జీవశాస్త్ర అనువర్తిత శాఖలు (APPLIED BRANCHES)
3. జీవశాస్త్ర సంబంధిత శాఖలు (RELATED BRANCHES)
జీవశాస్త్రం ప్రాథమిక శాఖలు
- జంతుశాస్త్రం: జంతువుల గురించి అధ్యయనం
- వృక్షశాస్త్రం: వృక్షాల గురించి అధ్యయనం
- కణజీవశాస్త్రం: కణ నిర్మాణం, కణజాలాల గురించిన అధ్యయనం
- స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య లక్షణాలను వివరిస్తుంది.
- శరీర ధర్మశాస్త్రం: జీవుల అవయవాల నిర్మాణం, వాటి విధుల గురించి అధ్యయనం
- అంతర్నిర్మాణ శాస్త్రం: వివిధ అవయవాల కణజాలాల అంతర్గత నిర్వహణ గురించి తెలుపుతుంది.
- జన్యుశాస్త్రం: జన్యువుల గురించి, అనువంశికత వైవిధ్యాల గురించి అధ్యయనం చేయడం.
- పిండోత్పత్తి శాస్త్రం: సంయుక్త బీజం ఏర్పడినప్పటి నుంచి పిండం పూర్తిగా ఏర్పడే వరకు మధ్యగల పెరుగుదల గురించి అధ్యయనం చేయడం.
- పరిణామ శాస్త్రం: జీవం పుట్టుక, పరిణామ అధ్యయనం చేయడం.
- పురాజీవ శాస్త్రం: శిలాజాల గురించిన అధ్యయనం చేయడం.
- వర్గీకరణ శాస్త్రం: వృక్ష, జంతు లక్షణాల ఆధారంగా తరగతులుగా విభజించడం
- ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్యగల సంబంధాన్ని అధ్యయనం చేయడం.
అనువర్తిత శాఖలు
- బయోటెక్నాలజీ: జీవుల్లోని వివిధ వ్యవస్థలకు, జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలు సాధించేందుకు అధ్యయనం చేయడం.
- జీవ భౌతికశాస్త్రం: జీవుల్లోని భౌతిక ధర్మాలను, భౌతికాధార ప్రక్రియలను గురించి అధ్యయనం చేయడం.
- జీవరసాయన శాస్త్రం: జీవుల అంతర్గత రసాయన చర్యలు, మార్పులను గురించి అధ్యయనం చేయడం.
- వైరాలజీ: వైరస్‌ల అధ్యయనం చేయడం.
- మైక్రోబయాలజీ: సూక్ష్మజీవుల అధ్యయనం చేయడం.
- ఆస్ట్రానమీ: నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్ర మండలం గురించిన శాస్త్రం
- ఫైలోజనీ: జీవుల వర్గవికాస చరిత్రను తెలిపేది లేదా ఒక సమూహం జీవుల పుట్టుక గురించి అధ్యయనం, జాతుల మధ్య సంబంధం తెలిపేది.

ఏరోబయాలజీ: గాలి ద్వారా వ్యాప్తిచెందే పుప్పొడి, స్పోర్‌లను గురించి అధ్యయనం చేయడం.
- వ్యాధి నిరోధక శాస్త్రం: జీవుల అసంక్రామ్యతను అధ్యయనం చేయడం.
- మెరైన్ బయాలజీ: సముద్ర జీవుల గురించి అధ్యయనం చేయడం.
- అణుజీవ శాస్త్రం: అణుస్థాయిలో జీవుల అధ్యయనం గురించి తెలిపే శాస్త్రం.
- రేడియో ధార్మిక జీవ శాస్త్రం: జీవులపై రేడియోధార్మిక ప్రభావాన్ని వివరించడం.
సంబంధిత శాఖలు
- వైద్యశాస్త్రం: వ్యాధుల బారి నుంచి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యాన్ని పొందడం గురించి అధ్యయనం చేయడం.
- అగ్రికల్చర్ జీవశాస్త్రం: పంటలు పండించడాన్ని గురించి అధ్యయనం చేయడం.
- ఉద్యానవన జీవశాస్త్రం: ఉద్యానవనంలో మొక్కల పెంపకాన్ని గురించి తెలిపే శాస్త్రం
జీవశాస్త్ర లక్షణాలు
- ప్రకృతిని క్రమపద్ధతిలో చూపుతుంది.
- త్వరితగతిన విస్తరించే జ్ఞానంగా, అంతర అంశాల అభ్యసనంగా, ఒక అంతర్జాతీయ వ్యవస్థగా, నిరంతరం మార్పుచెందే విషయంగా ఉంటుంది.
- శాస్త్రీయ విలువలను పెంచుతుంది.
ప్రయోజనాలు
- విద్యార్థులకు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆలోచనని, శాస్త్రీయ అవగాహనని పెంచుతుంది.
- ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను కలుగజేస్తుంది. జనాభా నియంత్రణకు, వ్యాధుల నిర్మూలనకు తోడ్పడుతుంది.
- పర్యావరణ పరిరక్షణ, సహజ వనరులను వినియోగించుకునే జ్ఞానాన్ని అందిస్తుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతుంది.
- మానవుల అంతర, బాహ్య సంబంధాలను తెలుపుతుంది.
మానవ సంక్షేమం-జీవశాస్త్రం పాత్ర
- జీవశాస్త్ర అంతిమ లక్ష్యం మానవ సంక్షేమం
- సుఖమయ జీవనానికి, సమస్యా పరిష్కారానికి తోడ్పడుతుంది.
- పంటల ఉత్పత్తి పెంచడం, సస్యరక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది.
- మానవ వినాశనానికి తోడ్పడుతుంది. (ఉదా: జీవసంబంధ మారణాయుధాలు, జీవ రసాయనిక ఎరువులు, మీథేన్ విషవాయువు)
ఆహారం
- మానవుని ప్రాథమిక అవసరాల్లో మొదటిది ఆహారం.
- పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తి జరగడానికి వివిధ విప్లవాలు కృషిచేశాయి. అవి..
పారిశ్రామిక రంగం
- జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పారిశ్రామిక వ్యవస్థలు అభివృద్ధి చెందాయి.
- ఆరోగ్యపరిరక్షణకు- ఔషధాల తయారీ పరిశ్రమ
- పాల కోసం- పాడి పరిశ్రమ
- కోళ్ల కోసం (మాంసం కోసం)- పౌల్ట్రీ పరిశ్రమ
ఆర్థికరంగం
- జీవశాస్త్రం వల్ల తలసరి ఆదాయం పెరగడం, నికర జాతీయోత్పత్తి (ఎన్‌ఎన్‌పీ) ఆపై స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌పీ) పెరుగుతుంది.
కాలుష్య నివారణ
- సీఎఫ్‌సీ (క్లోరో ఫ్లోరో కార్బన్) వల్ల ఓజోన్ క్షీణిస్తుంది.
- CO2 వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుంది.
అంతరిక్షయానం
- O2 వాయువు సరఫరా జరుగుతుంది (O2 చట్రం ద్వారా)
- ఊర్థ, అధో గమనాల్లో ఎగిరే దిశకు సమాంతరంగా పడుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉండి గుండె సక్రమంగా పనిచేస్తుంది.
- కొరెల్లాను ఉపయోగించి సంవృత (CLOSED) ఆవరణ వ్యవస్థ ఏర్పాటు చేయవచ్చు.
- సహజ వనరుల పరిరక్షణ: డయాటమ్స్ ఉనికి ద్వారా ముడిచమురు నిల్వలు తెలుకోవడం
- జీవశాస్త్ర నూతన పరిశోధనలు: ఎన్నో వ్యాధి నిరోధక టీకాలు కనుగొన్నది
శాస్త్రీయ సంస్థలు-సేవలు
- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
- దీన్ని 1977లో డా. పీఎం భార్గవ నేతృత్వంలో హైరదాబాద్‌లో ఏర్పాటుచేశారు. 1987, నవంబర్ 26న జాతికి అంకితం చేశారు.
- సేవలు: మాలిక్యులర్ డయాగ్నొసిస్, క్రోమోజోమ్‌ల నిర్ధారణ, డీఎన్‌ఏ వేలి గుర్తుల ముద్రణ
- అవార్డులు: ఇటలీ మూడో ప్రపంచ విజ్ఞాన మహాసభ అవార్డు, ఫిక్కి (FICCI)తో శాస్త్రసాంకేతిక రంగంలో అవుట్‌స్టాండింగ్ అవార్డు.
- దీనికి బయోఇన్ఫర్మాటిక్స్‌లో సభ్యత్వం ఉంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)
- దీన్ని 1918లో కానూర్ (తమిళనాడు)లో సర్ రాబర్ట్ ఎంసీ కారిసన్ బెరి-బెరి విచారణ సంస్థగా స్థాపించారు.
- 1958లో దీన్ని హైదరాబాద్‌కు మార్చారు. దీని మొదటి డైరెక్టర్ డా. ఎంసీ కారిసన్
- సేవలు: దేశంలోని వివిధ ప్రాంతాల జనాభాలో సర్వసాధారణంగా ఉన్న పోషకాహార లోపం, ఆహార సమస్యలను గుర్తిస్తుంది.
- పోషకాహార ఆవశ్యకతను ప్రభుత్వానికి, ఇతర సంస్థలకు తెలుపుతుంది.
- ఈ సంస్థ విస్తరణ, శిక్షణ అని రెండు రకాలుగా క్షేత్ర అధ్యయనం జరుపుతుంది.
ఇక్రిశాట్
- 1972లో ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాఫిక్)ను హైదరాబాద్‌లో స్థాపించారు.
- ప్రపంచ జనాభాకు సరిపడేంత ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించే లక్ష్యంతో కృషి చేస్తుంది.
- అర్ధశుష్క మండలాల్లో (నల్లరేగడి, ఎర్రనేలలు) పంటలపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
- లెగ్యూమ్ జాతి మొక్కల బీజ పదార్థ నిధిని నెలకొల్పింది. జొన్న, సజ్జ, కంది, శనగ, వేరుశనగ వంటి మొక్కలు వర్షాభావ, జలాభావ పరిస్థితులు తట్టుకునేలా కొత్త వంగడాలను సృష్టించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section