Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ

ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు?
- నవాబ్ సర్ విఖారుల్ ఉలమా

పురానాపూల్‌ను పారిస్‌లోని ఫోర్ట్ న్యూఫ్‌తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు?
- ట్రావెర్నియర్ (1645లో)

పురానాపూల్‌కు మరోపేరు?
- బ్రిడ్జ్ ఆఫ్ లవ్

హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలిపే చెరువుకట్టను ఏమంటారు?
- హుస్సేన్‌సాగర్ ఆనకట్ట (ట్యాంక్‌బండ్)
ఈసా, మూసా (మూసీ) నదుల సంగమం వద్ద మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నీటిలో కలిపారు.

హైదరాబాద్‌లో గోషామహల్‌ను ఎవరు, ఎందుకు నిర్మించారు?
- అంతఃపుర స్త్రీల సరససల్లాపాల కోసం అబుల్ హసన్ తానీషా నిర్మించాడు

పెద్దమనుషుల ఒప్పందంలో (1956 ఫిబ్రవరి 20న) ఉన్న ఉపముఖ్యమంత్రి పదవి ఆరో వేలుతో సమానం అన్నది?
- నీలం సంజీవరెడ్డి

610 జీవోను ఏ కమిటీల సిఫారసు ఆధారంగా ఎన్టీ రామారావు 1985, డిసెంబర్ 30న ప్రవేశపెట్టారు?
- జై భారత్‌రెడ్డి, సుందరేశన్ కమిటీలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని నాటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పార్లమెంటులో ఎప్పుడు ప్రకటించారు?
- 2013, ఆగస్టు 5న

50 సంవత్సరాల హైదరాబాద్ రచయిత ఎవరు?
- ముందుముల నరసింగరావు

50 సంవత్సరాల జ్ఞాపకాలు రచయిత?
- దేవులపల్లి రామానుజరావు

బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర రాసిందెవరు?
- ఉమ్మెత్తల కేశవరావు

తెలంగాణ పోరాట స్మృతులు రచయిత?
- ఆరుట్ల రామచంద్రారెడ్డి

పులిజాల రంగారావు జీవిత చరిత్ర రచయిత ఎవరు?
- బీఎన్ శాస్త్రి

తెలంగాణ సాయుధ పోరాటం- నా అనుభవాలు రాసిందెవరు?
- నల్లా నర్శింహులు

తెలంగాణ ఉద్యమానికి తొలి వేదిక?
- ఖమ్మం జిల్లా పాల్వంచ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section